‘బకాసుర రెస్టారెంట్‌’ నుంచి అయ్యో ఏమీరా ఈ జీవితం సాంగ్‌ను ఆవిష్కరించిన బ్లాక్‌బస్టర్‌ డైరెక్టర్‌ దర్శకుడు హరీశ్‌ శంకర్‌

పలు విజయవంతమైన చిత్రాలతో మంచి నటుడిగా, కమెడియన్‌గా అందరికి సుపరిచితుడైన ప్రవీణ్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘బకాసుర రెస్టారెంట్‌’, ఈ చిత్రంలో వైవా హర్ష టైటిల్‌ రోల్‌లో నటిస్తున్నారు. కృష్ణభగవాన్‌ ,షైనింగ్‌ ఫణి, కేజీఎఫ్‌ గరుడరామ్‌,ఇతర ముఖ్య పాత్రలో యాక్ట్‌ చేస్తున్నారు. ఎస్‌జే శివ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ చిత్రాన్ని ఎస్‌జే మూవీస్‌ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్‌ ఆచారి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్దమైంది. హంగర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘అయ్యో ఏమీరా ఈ జీవితం’ అనే లిరికల్‌ వీడియో సాంగ్‌ను బ్లాక్‌బస్టర్‌ మాస్‌ దర్శకుడు హరీష్‌ శంకర్‌ విడుదల చేశారు. వికాస బడిస స్వరాలు సమాకూర్చిన ఈ పాటను ప్రముఖ గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆలపించాడు. ఈ సందర్బంగా దర్శకుడు మాట్లాడుతూ ” ఇదొక యూత్‌ఫుల్‌ సాంగ్‌. రాహుల్‌ సిప్లిగంజ్‌ తన స్వరంతో ఈ పాటకు మరింత వన్నె తెచ్చాడు. వికాస బడిస స్వరాలు ఆకట్టుకునే విధంగా ఉంటాయి. సినిమాలో ప్రతి సన్నివేశం ఆడియన్స్‌కు థ్రిల్లింగ్‌తో పాటు వినోదాన్ని కూడా పంచుతుంది. ఓ ఇన్నోవేటివ్‌ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం తప్పకుండా అందర్ని అలరిస్తుందనే నమ్మకం ఉందిఅతి త్వరలో చిత్ర విడుదల తేదిని ప్రకటిస్తాం’ అన్నారు.

ప్రవీణ్‌, వైవా హర్ష, షైనింగ్‌ ఫణి (బమ్‌చిక్‌ బంటి), కేజీఎఫ్‌ గరుడ రామ్‌, కృష్ణభగవాన్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, ఉప్పెన జయకృష్న, వివేక్‌ దండు, అమర్‌, రామ్‌పటాస్‌, రమ్య ప్రియ, ప్రాచీ ఠాకూర్‌, జబర్థస్త్‌ అప్పారావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డీఓపీ: బాల సరస్వతి, ఎడిటర్‌: మార్తండ్‌.కె.వెంకటేష్‌, సంగీతం: వికాస్‌ బడిస, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: వినయ్‌ కొట్టి, ఆర్ట్‌ డైరెక్టర్: శ్రీ రాజా సీఆర్‌ తంగాల, పీఆర్‌ఓ: ఏలూరు శ్రీను, మడూరి మధు, నిర్మాతలు: లక్ష్మయ్య ఆచారి, జనార్థన్‌ ఆచారి, దర్శకత్వం: ఎస్‌జే శివ.

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

11 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

12 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

12 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago