ఇండస్ట్రీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘సంక్రాంతికి వస్తున్నాం విక్టరీ వెంకటేష్

Must Read

విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పొంగల్ బ్లాక్ బస్టర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అందరినీ అద్భుతంగా అలరించి, అత్యధిక వసూళ్ళు సాధించిన మొదటి తెలుగు రిజినల్ చిత్రంగా చరిత్ర సృష్టించి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ విక్టరీ వేడుకని నిర్వహించింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ వేడుకుకు అతిధిగా హాజరయ్యారు. డైరెక్టర్ హరీష్ శంకర్, వశిష్ట, వంశీపైడిపల్లి స్పెషల్ గెస్ట్ లు గా హాజరయ్యారు. ఈ వేడుకలో నిర్మాతలు చిత్ర యూనిట్ తో పాటు ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ కి షీల్డ్స్ అందించారు.

విక్టరీ వేడుకలో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. అందరికీ థాంక్ యూ. మీరంతా ఈ వేడుకకు రావాడం చాలా సంతోషంగా వుంది. ఇండస్ట్రీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ని సెలబ్రేట్ చేసుకోవడం ఆనందంగా వుంది. ఓ మంచి దేవుడా.. నేను అడగకుండానే కలియుగ పాండవులు సినిమా ఇచ్చావు. నేను అడగకుండానే చాలా హిట్లు ఇచ్చావు. చంటి లాంటి సినిమా ఇచ్చి పెద్ద బ్లాక్ బస్టర్ చేశావు(నవ్వుతూ) ప్రేమించుకుందాం రా, బొబ్బిలిరాజా, సీతమ్మవాకిట్లో, గణేష్, లక్ష్మీ,తులసి, రాజా ఇలా ఎన్నో ఇచ్చావు. 2000 లో మళ్ళీ ఒక ఇండస్ట్రీ హిట్ కలిసుందాంరా ఇచ్చావ్. 2025లో ఏం ఆడకుండా సైలెంట్ గా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చావు. ఇది కలా నిజమా తెలియడం లేదు. అభిమానులు ప్రేక్షకులు ఇండస్ట్రీలో వున్నవారంతా కోరుకోవడం వలనే ఇది సాధ్యపడిందని భావిస్తున్నాను. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన అందరికీ థాంక్ యూ. ఈ సినిమా బిగినింగ్ నుంచి చాల ఎంజాయ్ చేశాను. మా గురువు గారు రాఘవేంద్రరావు మంచి ఫ్యామిలీ ఫిల్మ్ చేయ్ పెద్ద హిట్ అవుతుందని చెప్పేవారు. ఆయన నమ్మకం నిజమైయింది. నా ఫ్యాన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా చాలా గొప్పగా ఆదరించారు. మీ ప్రేమ అభిమానం ఎప్పుడూ కావాలి. పదేళ్ళుగా సినిమా చూడని ఆడియన్స్ కూడా థియేటర్స్ కి వెళ్లి ఈ సినిమా చూడటం చాలా ఆనందాన్ని ఇచ్చింది. అనిల్ అద్భుతమైన పనితీరు కనబరిచాడు, 2027లో మళ్ళీ సంక్రాంతికి వస్తాం. రికార్డులు కాదు.. మంచి ఎంటర్ టైన్మెంట్ ఫిలిమ్స్ తో ఆడియన్స్ ఎంజాయ్ చేసేలా చూడటం నాకు ఇష్టం. అందరికీ థాంక్ యూ’ అన్నారు.

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ..ఈ సినిమాని వెంకటేష్ క్యారెక్టర్ లో వుండి చూశాను. హీరోయిన్స్ కోసం ఎక్కువ ఎంజాయ్ చేశాను(నవ్వుతూ). భీమ్స్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఇది వెంకటేష్ విక్టరీ. దిల్ రాజు అనిల్ కాంబినేషన్ అన్ని హిట్స్. ఏ ఫర్ అనిల్. ఈ సినిమాతో అంతులేని ఆనందం ఇచ్చే అనిల్ అయ్యాడు. అనిల్ ఇలాంటి వినోదాత్మక సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను’ అన్నారు.  

హీరోయిన్ మీనాక్షి మాట్లాడుతూ.. ఆడియన్స్ కి థాంక్ యూ ఈ సినిమాలో  పార్ట్ కావడం చాలా ఆనందంగా వుంది. థాంక్ యూ వెంకటేష్ గారు. టీం అందరికీ థాంక్ యూ. ఈ సినిమాని చాలా ఎంజాయ్ చేశాను. అన్నారు.

హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ.. ఈ సినిమా విజయం చాలా ప్రత్యేకం. ఇలా షీల్డ్ తీసుకుని మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాకి విజయం అందించిన ఆడియన్స్ కి థాంక్యూ. వెంకటేష్ గారి చాలా మిస్ అవుతాను. ఇది నాకు చాలా స్పెషల్ ఫిలిం’అన్నారు

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. వెంకటేష్ గారి కలియుగ పాండవులు సినిమాలో వి ఫర్ విక్టరీ అనే డైలాగ్ ఉంటుంది. వెంకటేష్ గారు వెంకటేష్ గారి విక్టరీ అనేది ఇప్పుడు కొత్త సామెత. ఈ సినిమాని ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. డైరెక్టర్ అనిల్ కి థాంక్యూ. మాకు ఇంత పెద్ద హిట్ ఇచ్చారు. ఇలాంటి ఫంక్షన్ చేసుకుని చాలా కాలమైంది. ఆ అవకాశం ఈ సినిమా ద్వారా మాకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది’అన్నారు

నిర్మాత శిరీష్ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. ఇంతటి విజయానికి కారణమైన మా డిస్ట్రిబ్యూటర్స్ కి, ఎగ్జిబిటర్స్ కి  మా పిఆర్ఓ వంశీ శేఖర్ కి అందరికీ థాంక్యూ వెరీ మచ్’అన్నారు

డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ఈ వేడుక చూస్తుంటే సంక్రాంతి మళ్లీ వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ సంక్రాంతి మా టీమ్ అందరికీ మెమొరబుల్. ఇంత గొప్ప విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ సినిమా చాలా సరదాగా తీసాం. ప్రమోషన్స్ చాలా కష్టపడి చేశాం. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి ఈ సినిమా చాలా కాలం గుర్తుండిపోతుంది. వెంకటేష్ గారితో త్వరలో మళ్లీ మా కాంబినేషన్ చేయాలి. మళ్లీ సంక్రాంతికి మీ ముందుకి వస్తాం. సంక్రాంతికి వస్తున్నాం 300 కోట్ల గ్రాస్ సాధించింది. ఈ సినిమా ఇంత రెవెన్యూ చేస్తుందని ఎవరికీ అంత చిక్కలేదు. ఆడియన్స్ కి థాంక్యూ. మీరు లేకపోతే ఈ విజయం లేదు’అన్నారు.

డైరెక్టర్ వశిష్ట మాట్లాడుతూ… అందరికి నమస్కారం. ఈ మధ్యకాలంలో సీల్డ్ ఇస్తున్న సినిమాలే అరుదుగా మారిపోయాయి. అలాంటి సీల్డ్ ఇస్తున్న ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. జెన్యూన్ బ్లాక్ బస్టర్ కొట్టి షీల్డ్స్ తీసుకున్న అందరికీ కంగ్రాజులేషన్స్’అన్నారు

డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ… అనిల్ పటాస్ సినిమా అప్పుడు కలిశాడు. ఎవరు పోలీస్ క్యారెక్టర్ చేసిన మీ సినిమా ఇన్స్పిరేషన్ అన్న అని చెప్పాడు.  ఈరోజు అనిల్ ఇచ్చిన సక్సెస్ నాకు ఇన్స్పిరేషన్ గా నిలిచింది. అనిల్ తన కోర్ స్త్రెంత్ ని నమ్ముకుని తనకు నచ్చిన సినిమానే తీశాడు. అందుకే ఈ సినిమా అంత పెద్ద హిట్ అయింది. అనిల్ కన్వెన్షన్ కి హ్యాట్సాఫ్. అందరు ఫ్యాన్స్ విక్టరీ వెంకటేష్ గారి అభిమానులే. వెంకటేష్ గారు అనిల్ రావిపూడి అందరూ ఇష్టపడే కాంబినేషన్. ఈ సినిమా ప్రతిగట్టు మీద హిట్ అయ్యింది. ఈ సినిమా హిట్ సినిమాలు అందరికీ రావాలని కోరుకుంటున్నాను’అన్నారు

డైరెక్టర్ వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. ఇది ఫ్యామిలీ ఈవెంట్ లా వుంది. అనిల్ నాకు తమ్ముడు లాంటి వాడు. రాజు గారు ఎన్నో సినిమాలు చేశారు. ఈ సినిమా వారు చేసిన పుణ్యాలకు దక్కిన ఫలితం. వారు గౌరవం కొరుకునే నిర్మాతలు. ఇక్కడ నుంచి వారు ఆడే ఇన్నింగ్స్ ఇండస్ట్రీ చూస్తుంది. ఐశ్వర్య, మీనాక్షి అద్భుతంగా పెర్ఫర్మ్ చేశారు. వెంకటేష్ గారు నేను చూసిన ఫస్ట్ హీరో. బొబ్బిలిరాజా కోసం మేము గోడలు దూకాం. ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టారు. దేవుడు మంచి వారికే పాజిటివ్ వ్యక్తులకే సక్సెస్ ఇస్తాడు.అనిల్ ఎనిమిది హిట్లు ఇచ్చాడు. తనకి ఆడియన్స్ పల్స్ తెలుసు. అనిల్ ఇలాంటి సినిమాలే తీయాలని కోరుకుంటున్నాను. మూడు వందల కోట్లు హిట్ ఇవ్వడం మామూలు విషయం కాదు. పరిశ్రమకు ప్రేక్షకులు ఇలాంటి సినిమాలే కావాలి. టీం అందరికీ బిగ్ కంగ్రాట్స్’అన్నారు. సినిమా యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News