జూలై 12న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ఘోస్ట్ నుండి వస్తున్న ‘బిగ్ డాడీ’

Must Read

కరుణడ చక్రవర్తి డా శివరాజ్ కుమార్ హీరోగా హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్యాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతోన్న చిత్రం ఘోస్ట్. కన్నడ బీర్బల్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు రూపొందించి తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న దర్శకుడు శ్రీని ఘోస్ట్ చిత్రానికి దర్శకుడు. ప్రముఖ రాజకీయనాయకుడు, నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఘోస్ట్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఘోస్ట్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. ఘోస్ట్ టీజర్ ను బిగ్ డాడీ పేరుతో జూలై 12 న విడుదల చేయనున్నారు. బిగ్ డాడీ అనౌన్స్మెంట్ ను స్ట్రైకింగ్ పోస్టర్ తో ప్రకటించారు. శివరాజ్ కుమార్ గన్ తో సీరియస్ లుక్ తో ఉన్న పోస్టర్ ఆకట్టుకుంటోంది.

ప్రముఖ మలయాళ నటుడు జయరామ్ ఘోస్ట్ లో కీలక పాత్ర పోషిస్తుండగా ప్రశాంత్ నారాయణ్, అచ్యుత్ కుమార్, దత్తన్న, అవినాష్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. ‘ఘోస్ట్’ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. మస్తీ, ప్రసన్న వి ఎం డైలాగ్స్ రాస్తున్నారు. కె జి ఎఫ్ తో దేశవ్యాప్తంగా  గుర్తింపు తెచ్చుకున్న ఆర్ట్ డైరెక్టర్ శివ కుమార్ ఈ సినిమాకి పనిచేస్తున్నారు. పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య సంగీతాన్ని అందిస్తున్నారు. కన్నడ లో టాప్ స్టార్స్, టెక్నిషన్స్ తో చిత్రాలు తీసే సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత సందేశ్ నాగరాజ్ ‘ఘోస్ట్’ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

క్యాస్ట్ : డాక్టర్ శివరాజ్ కుమార్
ప్రొడక్షన్ :  సందేశ్ ప్రొడక్షన్స్ (29వ చిత్రం)
డైరెక్టర్ : శ్రీని (బీర్బల్)
కెమెరా మాన్ : మహేంద్ర సింహ
సంగీతం : అర్జున్ జన్య
ఆడియో: టి- సీరీస్
ఆర్ట్ : శివ కుమార్ (కె జి ఎఫ్)
డైలాగ్స్: మస్తీ, ప్రసన్న వి ఎం
పబ్లిసిటీ, పి ఆర్ ఓ: బిఏ రాజు’స్ టీం

Latest News

సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న మూవీ “కిల్లర్”

"శుక్ర", "మాటరాని మౌనమిది", "ఏ మాస్టర్ పీస్" వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్ "కిల్లర్" అనే సెన్సేషనల్ సై-ఫై...

More News