‘భలే ఉన్నాడే’లో స్ట్రాంగ్ విమెన్ క్యారెక్టర్ చేశాను. ఇది చాలా మంచి కథ. యాక్ట్రెస్ అభిరామి

Must Read

యంగ్ హీరో రాజ్ తరుణ్ న్యూ ఏజ్ ఎంటర్ టైనర్ ‘భలే ఉన్నాడే’. రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్‌వి కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జె శివసాయి వర్ధన్ డైరెక్టర్. బ్లాక్ బస్టర్ మేకర్ మారుతి ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నారు. మనీషా కంద్కూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ అభిరామి కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ టీజర్, ట్రైలర్ సాంగ్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 13న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా యాక్ట్రెస్ అభిరామి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.  

వెరీ బిగినింగ్ నుంచి ఇప్పటివరకూ మీ జర్నీ గురించి చెప్పాలంటే ?
-రెండు పదాలలో చెప్పాలంటే.. హ్యాపీ యాక్సిడెంట్ (నవ్వుతూ). నేను ఏదీ ప్లాన్ చేసిన రాలేదు. ఎలాంటి సినీ నేపధ్యం లేదు. అమ్మ నాన్న బ్యాంక్ ఉద్యోగులు. మిడిల్ క్లాస్ అమ్మాయిని. టీవీలో యాంకర్ గా చేశాను. తర్వాత ఫిల్మ్ ఆఫర్స్ వచ్చాయి. కొన్ని సినిమాలు చేశాను. తర్వాత యుఎస్ వెళ్లి చదువుకున్నాను. పెళ్లి చేసుకొని అక్కడే కొన్నాళ్ళు సెటిల్ అయ్యాను. తిరిగిరావడంలో కూడా ప్లాన్ లేదు. ఇదొక వండర్ ఫుల్ జర్నీ. నచ్చిన వృత్తిలో వున్నాను. నేను చాలా లక్కీ.    

‘భలే ఉన్నాడే’ మూవీలోకి ఎలా వచ్చారు ?
-మారుతి గారు కాల్ చేసిన ఈ సినిమా, క్యారెక్టర్ గురించి చెప్పారు. తర్వాత డైరెక్టర్ శివసాయి వర్ధన్ కథ, క్యారెక్టర్ చెప్పినపుడు చాలా నచ్చింది. ఇమ్మిడియట్ గా చేయాలని డిసైడ్ అయ్యాను.

మీ క్యారెక్టర్ ఎలా వుండబోతోంది ?
-ఇందులో నా క్యారెక్టర్ పేరు గౌరీ. తను బ్యాంక్ ఎంప్లాయ్. అమ్మనాన్న బ్యాంక్ ఉద్యోగులే కావడంతో ఇది నాకు పర్శనల్ గా కనెక్ట్ అయ్యే క్యారెక్టర్. సింగిల్ మదర్, స్ట్రాంగ్ ప్రిన్సిపల్ వున్న విమెన్ క్యారెక్టర్ నాది. డైరెక్టర్ గారు మదర్ తో పాటు ఒక సిస్టర్ లా కనిపించేలా క్యారెక్టర్ ని తీర్చిదిద్దారు.

-గౌరీ స్ట్రాంగ్ విమెన్. తనలో సీరియస్ నెస్ తో పాటు హ్యుమర్, ఎమోషన్ వుంటుంది. సినిమా త్రూ అవుట్ నా క్యారెక్టర్ వుంటుంది. మదర్- సన్ రిలేషన్షిప్ సినిమాకి సోల్ గా వుంటుంది. ఈ సినిమాకి నా క్యారెక్టర్ ఎమోషనల్ యాంకర్ లా వుంటుంది. అలాగే ఈ సినిమాలో సింగీతం గారు, లీలా గారి పాత్రల మధ్య నడిచే కథ కూడా బ్యూటీఫుల్ గా వుంటుంది,    

డైరెక్టర్ శివసాయి వర్ధన్ గురించి?
-శివసాయి వర్ధన్ ఫస్ట్ టైం డైరెక్టర్ లా అనిపించలేదు. తనకు చాలా క్లారిటీ వుంది. క్లియర్ విజన్ తో వుంటారు. సినిమాకి ఎంతకావాలో ఏమి కావాలో తెలుసు. చాలా ఫ్లెక్స్ బుల్ గా వుంటారు. సినిమాకి యూజ్ అయ్యే ఏదైనా సజెషన్ ఇస్తే తీసుకుంటారు.

మూవీ ప్రొడ్యూసర్స్ గురించి ?
-నిర్మాతలు చాలా కంఫర్ట్ బుల్ గా చూసుకున్నారు. వారితో వర్క్ చేయడం మంచి ఎక్స్ పీరియన్స్.  
-మారుతిగారు గ్రేట్ ప్రొడ్యూసర్, డైరెక్టర్. తనకి ఎలాంటి కథని ఎంచుకోవాలో అన్నీ తెలుసు.  

యాక్టింగ్ విషయంలో రాజ్ తరుణ్ కి ఏమైనా సజెషన్స్ ఇచ్చారా?
-రాజ్ తరుణ్ గుడ్ యాక్టర్. సజెషన్స్ అంటూ ప్రత్యేకంగా ఏమీ ఇవ్వలేదు. ఇందులో తనది శారీ డ్రాపర్ క్యారెక్టర్. శారీని ఎలా టై చేస్తారో కొంచెం గైడ్ చేశాను.    

మీ రీఎంట్రీలో మహారాజ, సరిపోదా శనివారం లాంటి సూపర్ హిట్స్ చేశారు. ‘భలే ఉన్నాడే’లో మిమ్మల్ని ఆకట్టుకున్న ఎలిమెంట్స్ ఏమిటి?
-నిజానికి నేను ఒప్పుకున్న మొదటి సినిమా ఇదే. తర్వాత మహారాజా, సరిపోదా శనివారం వచ్చాయి. ఆ రెండు ముందుగా రిలీజ్ అయ్యాయి. నేను ఎప్పుడూ కథనే చూస్తాను. మహారాజ, సరిపోదా శనివారం ఎలా అయితే కథ నచ్చి చేశానో.. ‘భలే ఉన్నాడే’ చేయడానికి కారణం కూడా కథే. నాకు కథ, క్యారెక్టర్ నచ్చితే మరో ఆలోచన లేకుండా చేస్తాను.

చెప్పవే చిరుగాలి తర్వాత మళ్ళీ తెలుగులో సినిమాలు చేయకపోవడానికి కారణం?
 -నేను ఆ సినిమా సమయంలోనే డిగ్రీ చేయడానికి యుఎస్ వెళ్లాను. ఆ సినిమాని చాలా రోజుల తర్వాత చూశాను. సినిమా చాలా మంచి విజయం సాధించింది. తర్వాత కొన్ని ఆఫర్స్ వచ్చాయి. నేను యుఎస్ లో వుండిపోవడం వలన చేయడం కుదరలేదు.

మీ రీఎంట్రీ ఎలా జరిగింది ?
-పదేళ్ళ క్రితం తమిళ్ లో నా రీఎంట్రీ జరిగింది. కమల్ హసన్ గారి విశ్వరూపం సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కి డబ్బింగ్ చెప్పడానికి యూఎస్ నుంచి వచ్చాను. అప్పటినుంచి చాలా మంది క్యారెక్టర్స్ కోసం అప్రోచ్ అయ్యారు. నేను మాత్రం సెలక్టివ్ గా చేస్తున్నాను. గత రెండేళ్ళలో పది సినిమాలు చేశాను. ఇప్పుడు ఇండియాలోనే వున్నాను.

కొత్తగా చేస్తున్న సినిమాలు ?
-రెండు తెలుగు కథలు విన్నాను. తర్వాతలోనే వాటి గురించి చెప్తాను.
-ఇంట్రస్టింగ్ రోల్స్ చేయాలని వుంది. తమిళ్ లో లీడ్ రోల్ లో  రెండు సినిమాలు చేస్తున్నాను.  
-కమల్ హసన్, మణిరత్నం గారి సినిమాని ఇటివలే నా పోర్షన్ పూర్తి చేశాను. ఇంకొన్ని ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్స్ వున్నాయి.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News