‘భలే ఉన్నాడే’ ఫ్యామిలీ అంతా కలసి చూడదగ్గ బ్యూటీఫుల్ ఎంటర్ టైనర్ 

Must Read

యంగ్ హీరో రాజ్ తరుణ్ అప్ కమింగ్ మూవీ ‘భలే ఉన్నాడే’. రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్‌వి కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జె శివసాయి వర్ధన్ డైరెక్టర్. బ్లాక్ బస్టర్ మేకర్ మారుతి ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ టీజర్, ట్రైలర్, సాంగ్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 7న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.ఈ నేపధ్యంలో మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. 

ప్రెస్ మీట్ లో హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నేను వర్క్ చేసిన డైరెక్టర్స్ లో శివసాయి వన్ అఫ్ ది బెస్ట్ డైరెక్టర్. తన కన్విక్షన్, సినిమాని చేసే విధానం అద్భుతంగా వుంది. నాకు డైరెక్టర్ అవ్వాలని వుందని ఎప్పుడూ చెబుతుంటాను. ఆయన డైరెక్ట్ చేసిన విధానం చూసిన తర్వాత నేను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా వుందని అర్ధమైంది. కిరణ్ గారు చాలా సపోర్ట్ చేశారు. డైరెక్టర్ విజన్ కి తగ్గట్టు ప్రతిది సమకూర్చారు. మనీషా చక్కగా పెర్ఫార్మ్ చేసింది. తెలుగు నేర్చుకొని డబ్బింగ్ చెప్పింది. శేఖర్ చంద్రతో ఇది నా మూడో సినిమా. బ్యూటీఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. మారుతి గారితో ఎప్పటినుంచో సినిమా చేయాలని వుండేది. ఈ సినిమాతో కుదిరినందుకు చాలా హ్యాపీగా వుంది. సెప్టెంబర్ 7న సినిమా థియేటర్స్ లో రిలీజౌతుంది. ఇది ప్రోపర్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఫ్యామిలీ అంతా కలసి చూసేలా తీశాం. బ్యూటీఫుల్ ఎంటర్ టైనర్, చాలా మంచి ఎమోషన్స్ వుంటాయి. తప్పకుండా థియేటర్స్ లో సినిమా చూడండి’ అన్నారు

హీరోయిన్ మనీషా కంద్కూర్ మాట్లాడుతూ.. ఇది నా ఫస్ట్ మూవీ. చాలా ఎక్సయిటింగ్ గా వుంది. ఇందులో రోమాన్స్, కామెడీ వుంది. మీ అందరికీ నచ్చుతుంది. టీం అంత చాలా సపోర్ట్ చేశారు. రాజ్ బెస్ట్ కో స్టార్. దర్శక నిర్మాతలకు థాంక్ యూ. శేఖర్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అందరూ థియేటర్స్ లో మూవీ చూసి ఎంజాయ్ చేయాలి’ అని కోరారు. 

డైరెక్టర్ శివసాయి వర్ధన్ మాట్లాడుతూ.. భలే ఉన్నాడే నా ఫస్ట్ మూవీ. సినిమా కూడా చాలా బావుటుంది. నాకు అవకాశం ఇచ్చిన మారుతిగా గారికి థాంక్. రాజ్ తరుణ్ ఈ టైటిల్ కి పర్ఫెక్ట్ యాప్ట్. చాలా ఫ్రెష్ గా కనిపిస్తున్నాడు. ఇందులో తను షారీ డ్రాపర్ క్యారెక్టర్ లో కనిపిస్తాడు. అమ్మాయికి చీర కట్టాలంటే ఒక కంఫర్ట్బుల్ లెవల్ వుండాలి. దాని ప్రకారం ఈ క్యారెక్టర్ లుక్ ని డిజైన్ చేశాం. తను ఎందుకు ఇలా వున్నాడనేది సెప్టెంబర్ 7న తెలుస్తుంది. వినాయక చవితి రోజు రిలీజ్ చేస్తున్నాం కాబట్టి మార్నింగ్ పూజ చేసుకొని ఈవింగ్, నైట్ షో కి వెళితే హ్యాపీగా ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసే సినిమా ఇది. చాలా హెల్దీ కామెడీ వుంటుంది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది’ అన్నారు. 

నిర్మాత కిరణ్ కుమార్.. ఇది మా ఫస్ట్ సినిమా. చాలా మంచి సినిమా తీశామనే నమ్మకం వుంది. సినిమా చాలా బావుటుంది. రాజ్ గారు, డైరెక్టర్ గారు, అందరికీ థాంక్ యూ. ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్. అందరికీ నచ్చుతుంది’ అన్నారు

సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర మాట్లాడుతూ.. ఈ సినిమా సూపర్ ఎక్స్ పీరియన్స్. చాలా కొత్త జోనర్. సాంగ్స్ డిఫరెంట్ గా ట్రై చేశాం. రెండు పాటలు విడుదలయ్యాయి. మంచి రెస్పాన్స్ వస్తోంది. మారుతి గారు చాలా మంచి ఐడియాస్ ఇచ్చారు. రాజ్ తరుణ్ తో ఇది మూడో సినిమా. రాజ్ క్రేజీ ఎనర్జీతో చేశారు. ఆడియన్స్ సినిమాని చాలా ఎంజాయ్ చేస్తారు’అన్నారు.  

తారాగణం: రాజ్ తరుణ్, మనీషా కంద్కూర్, సింగీతం శ్రీనివాస్, అభిరామి, అమ్ము అభిరామి, లీలా శాంసన్, వీటీవీ గణేష్, హైపర్ ఆది, కృష్ణ భగవాన్, గోపరాజు రమణ, శ్రీకాంత్ అయ్యంగార్, రాచా రవి, సుదర్శన్, శ్రీనివాస్ వడ్లమాని, మణి చందన, పటాస్ ప్రవీణ్ తదితరులు.

సాంకేతిక సిబ్బంది:

దర్శకత్వం: జె శివసాయి వర్ధన్

ప్రెజెంట్స్: మారుతీ టీమ్

నిర్మాత: N.V కిరణ్ కుమార్

బ్యానర్: రవికిరణ్ ఆర్ట్స్

DOP: నగేష్ బానెల్లా

సంగీతం: శేఖర్ చంద్ర

ఎడిటర్: శ్రీకాంత్ పట్నాయక్ ఆర్

ఆర్ట్: సురేష్ భీమగాని

ప్రొడక్షన్ డిజైనర్: శివ కుమార్ మచ్చ

పీఆర్వో: వంశీ-శేఖర్

Latest News

తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌

సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్‌ హస్పటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఈ రోజు (బుధవారం) పరామర్శించారు. శ్రీతేజ్‌ యోగా...

More News