ముంబై కి చెందిన ప్రముఖ ఫ్యాషన్ రంగ మోడల్.. బెవిలిన్ భరాజ్ తెలుగు సినిమా రంగంలో హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి హైదరాబాద్ వచ్చింది. తన క్వాలిటీస్, క్వాలిఫికేషన్స్ తెలియజేయడానికి ఫిలిం ఛాంబర్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు ఆమె. ఈ సందర్భంగా పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు బెవిలిన్ భరాజ్ సమాధానాలు ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ “ఫ్యాషన్ మోడలింగ్ లో అక్కడ నాకు మంచి పేరు, ఒక స్టార్ డం ఉంది. మాది ముంబైలో వ్యాపార కుటుంబం. సోలార్ ఎనర్జీ బిజినెస్ లో ఉన్నాము.
“రే ఫోర్స్ గ్రీన్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్” కంపెనీ నిర్వహిస్తున్నాము. నేను ఈ సంస్థలో డైరెక్టర్ గా పని చేస్తున్నాను. మా సంస్థ సోలార్ ఎనర్జీని తయారు చేస్తుంది.
ఫ్యాషన్ మోడలింగ్ లో అడుగుపెట్టి మంచి విజయం సాధించాను. ఇంటర్నేషనల్ స్థాయి లో పాపులారిటీ సంపాదించాను. ఇప్పుడు సినిమాల్లో నటించడానికి కూడా మా పేరెంట్స్ ఎంతో ప్రోత్సహిస్తున్నారు. నేను నటనలో, డాన్సులలో, ఫైట్స్ లో శిక్షణ పొందాను. సినిమాలు అంటే చాలా ఇష్టం. తెలుగు సినిమాలు రెగ్యులర్ గా చూస్తూ ఉంటాను. బాహుబలి, పుష్ప, ఆర్ ఆర్ ఆర్ వంటి సినిమాలు తెలుగు సినిమాని జాతీయ స్థాయికి చేర్చాయి. ఫ్యాషన్ మోడలింగ్ లో ముంబైలో బిజీగా ఉండటం వల్ల హైదరాబాద్ రాలేకపోయాను. ఇప్పుడు సమయం కుదిరింది.
తెలుగు సినిమాలు చేయాలనుకుంటున్నాను. అందుకే హైదరాబాద్ వచ్చాను. పలువురు దర్శక నిర్మాతలను కలిశాను.. కలుస్తున్నాను. హీరోయిన్., నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరోయిన్., యాక్షన్ హీరోయిన్… ఇలా ఏ పాత్ర ఇచ్చినా న్యాయం చేస్తాను. త్వరలోనే మంచి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తాను” అన్నారు బెవిలిన్ భరాజ్.
బాలీవుడ్ సినిమా రంగంలో మా బంధువులు, స్నేహితులు చాలామంది పెద్ద స్థాయిలో ఉన్నారు. అయితే వారిలో ఎవరి పేరు ఉపయోగించుకోకుండా స్వశక్తితో నా కెరీర్ ని నిర్మించుకోవాలి అనుకుంటున్నాను. అందుకే వారి పేర్లు చెప్పడం లేదు.. అన్నారు బెవిలిన్.
హాలీవుడ్ హీరోయిన్ లాగా కనిపించడం ఈ నటి ప్రత్యేకత.
లవ్, ఎమోషన్, డ్రామా వంటి కమర్షియల్ ఎలిమెంట్స్‌తోపాటు చక్కటి సోషల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్…
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…