” ఉపేంద్ర గాడి అడ్డా” ఆరంభం

Must Read

” ఉపేంద్ర గాడి అడ్డా” ఆరంభం

కంచర్ల ఉపేంద్ర హీరోగా, సావిత్రి కృష్ణ హీరోయిన్ గా, ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వంలో ఎస్. ఎస్.ఎల్.ఎస్. (SSLS) క్రియేషన్స్ పతాకంపై కంచర్ల అచ్యుతరావు నిర్మిస్తున్న “ఉపేంద్ర గాడి అడ్డా” చిత్రం సోమవారం హైదరాబాద్ లో ఆరంభమైంది.
అమీర్ పేటలోని సంస్థ కార్యాలయలో పూజా కార్యక్రమాల అనంతరం హీరోహీరోయిన్లపై తీసిన ముహూర్తపు సన్నివేశానికి చిత్ర నిర్మాత కంచర్ల అచ్యుతరావు క్లాప్ నివ్వగా, అతిధిగా విచ్చేసిన నిర్మాత సాయి వెంకట్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.


ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ, “మా స్వస్థలం విశాఖపట్నంలో మేము నెలకొల్పిన ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇక
.హీరోగా నటిస్తున్న మా అబ్బాయితో వరుసగా తొమ్మిది సినిమాలు తీయాలని సంకల్పించాం. ఇప్పటికే నాలుగు సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. ఇది మా బ్యానర్ లో ఐదవ సినిమా. చక్కటి కమర్షియల్ అంశాలతో కూడుకున్న మాస్ సినిమా ఇది. దర్శకుడు చెప్పిన స్క్రిప్ట్ నచ్చి, ఈ చిత్రం తీస్తున్నాం” అని అన్నారు.


దర్శకుడు ఆర్యన్ సుభాన్ ఎస్.కె. మాట్లాడుతూ, ప్రస్తుతం హీరో వరుణ్ సందేశ్ తో నేను దర్శకత్వం వహిస్తున్న “కానిస్టేబుల్” చిత్రం నిర్మాణంలో ఉంది. ఇక ఈ నూతన చిత్రం స్క్రిప్ట్ సైతం చాలా బాగా వచ్చింది. ఇప్పుడున్న ట్రెండ్ కు తగ్గట్టు యూత్ ఫుల్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా ఇది. హీరో పాత్ర పక్కా మాస్ అయితే హీరోయిన్ పాత్ర బాగా డబ్బున్న అమ్మాయిగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాద్ దమ్ బిర్యాని తింటే ఎంత రుచిగా ఉంటుందో ఈ సినిమా కూడా అంత బావుంటుంది. సెప్టెంబర్ మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టి, సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ పార్ట్ పూర్తి చేస్తాం” అని చెప్పారు.


హీరో కంచర్ల ఉపేంద్ర మాట్లాడుతూ, మా నాన్న నిర్మాత గా తెరకెక్కుతున్న ఈ సినిమాలన్నీ ప్రతీ నెలకు ఒకటి చొప్పున విడుదల చేస్తాం. నా అభిరుచి, నాన్నకు ఉన్న ఫ్యాషన్ తో సినీ రంగంలోనికి అడుగుపెట్టాం. ఈ సినిమా కూడా నాకు ఒక మంచి సినిమా అవుతుంది” అని అన్నారు.


హీరోయిన్ సావిత్రి కృష్ణ మాట్లాడుతూ, ఇప్పటికే తెలుగు, కన్నడ బాషలలో సినిమాలు చేస్తున్నానని, తన కెరీర్ మలుపునకు ఈ సినిమా ఓ కారణం అవుతుందని అన్నారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ రవీందర్ అందిస్తున్నారు

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News