బండి సరోజ్ కుమార్ నూతన చిత్రం ‘పరాక్రమం’ ప్రీ టీజర్ విడుదల
బి ఎస్ కె మెయిన్ స్ట్రీమ్ పతాకం పై బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించబోతున చిత్రం “పరాక్రమం”. ప్రస్తుతానికి ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. సెప్టెంబర్ మరియు అక్టోబర్ మాసాల్లో రెండు షెడ్యూల్స్ లో ముప్పై రోజులో షూటింగ్ పూర్తి చేసి ఫిబ్రవరి 14, 2024 లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ రోజు ఈ చిత్రం యొక్క ప్రీ టీజర్ ను విడుదల చేసారు. ఈ సందర్భంగా
దర్శకుడు బండి సరోజ్ కుమార్ మాట్లాడుతూ “మీడియా మిత్రులకు, పెద్దలకు నమస్కారాలు. బండి సరోజ్ కుమార్ అనే నేను ఒక నటుడిగా , దర్శకుడిగా మీలో కొంత మందికి తెలిసే ఉండొచ్చు. “కళ నాది. వెల మీద” అనే కాన్సెప్ట్ తో, డిజిటల్ platforms లో రిలీజ్ చేసిన “నిర్బంధం, మాంగల్యం” లాంటి క ల్ట్ సినిమాలో నాకు లక్షలాది ప్రేక్షకుల అభిమానం లభించింది. వాళ్ళు ఇచ్చిన బలంతో ఇప్పుడు నేను “BSK MAINSTREAM” అనే నా సొంత నిర్మాణ సంస్థ ద్వారా వెండితెరకు రాబోతున్నాను. పిల్లా , పాపలతో కుటుంబాలు సినిమా హాల్ కు తరలి వచ్చే కథాంశం తో “పరాక్రమం” అనే చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ” I,ME,MYSELF ” దీని టాగ్ లైన్ .
“పరాక్రమం” అనే ఈ చిత్రం యొక్క “Pre-Teaser” ను ఈ లేఖతో జత చేశాను . ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 14 2024 న విడుదల లక్ష్యంగా, ఈ సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో రెండు షెడ్యూల్స్ తో ముప్పై రోజుల
షూటింగ్ తో ఈ చిత్రం పూర్తవుతుంది.
ఈ చిత్ర కథాంశం గురించి చెప్పాలంటే – గోదావరి జిల్లా లో “లంపకలోవ” గ్రామంలో పుట్టిన “లోవరాజు” అనే యువకుడి జీవితంలో జరిగే గల్లీ క్రికెట్, ప్రేమ, నాటక రంగ జీవితం , రాజకీయం లాంటి ఘట్టాల ఆవిష్కరణ ఈ చిత్ర ముఖ్య కథాంశం. యువతను అన్ని విధాలుగా ఎంటర్టైన్ చేస్తూనే, వారిని మేల్కొలిపే ఒక మంచి కమర్షియల్ కథతో రాబోతున్నాను. నాతోపాటు ప్రతిభ ఉన్న నూతన నటీ, నటులను ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం చేయబోతున్నాను.
దీనికి రచన, కూర్పు, సంగీతం, దర్శకత్వం నేనే వహిస్తుండగా మిగిలిన విభాగాల్లో ప్రతిభ గల సాంకేతిక
నిపుణులతో ఈ చిత్రం నిర్మించబడుతుంది. ఒక గొప్ప సంకల్పంతో నేను నిర్మించబోయే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లి నాకు, నా నిర్మాణ సంస్థ కి మరింత బలాన్ని చేకూర్చాలి అన్నది పాత్రికేయులకు నా విజ్ఞప్తి.
ఇట్లు
నటుడు – దర్శకుడు
బండి సరోజ్ కుమార్
చిత్రం పేరు : పరాక్రమం
నటీనటులు : బండి సరోజ్ కుమార్, అనామిక, కిరీటి, మోహన్ సేనాపతి, తదితరులు
బ్యానర్ : బి ఎస్ కె మెయిన్ స్ట్రీమ్ (BSK MAINSTREAM)
కథ, ఎడిటర్, సంగీతం, నిర్మాత, దర్శకుడు – బండి సరోజ్ కుమార్
వి ఎఫ్ ఎక్స్ : AYKERA studios
సౌండ్ డిజైన్ మరియు మిక్సింగ్ : కాళీ ఎస్ ఆర్ అశోక్
ఆర్ట్ : కిరీటి మూసి
పబ్లిసిటీ డిజైర్ : సాగర్ ముదిరాజ్, మరియు ఉదయ్ జల
లిరిక్స్ : శశాంక్ వెన్నెలకంటి
లైన్ ప్రొడ్యూసర్ : ప్రవీణ్ గూడూరి
పి ఆర్ ఓ : పాల్ పవన్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : మన రాజు
స్టిల్స్ : నవీన్ కళ్యాణ్
Young and talented hero Kiran Abbavaram stars in the highly anticipated period thriller "KA." The…
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా "క". ఈ సినిమాలో నయన్ సారిక,…
Blockbuster filmmaker Gunasekhar, renowned for his unique storytelling and hit films, is set to release…
వైవిధ్యమైన సినిమాలు, భారీ చిత్రాలను తెరకెక్కించటంలో సెన్సేషనల్ డైరెక్టర్ గుణశేఖర్‌కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఆయన డైరెక్షన్లో ‘యుఫోరియా’…
డిఫరెంట్ కాన్సెప్ట్, టైటిల్‌తో ‘సి 202’ అనే చిత్రం రాబోతోంది. ఇప్పుడు ఆడియెన్స్ అంతా కూడా కొత్త కాన్సెప్ట్, కంటెంట్…
Films coming up with new concepts and great content has become a trend. With audiences…