జిలేబి’కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సినిమా చూసిన ప్రేక్షకులంతా చాలా ఎంజాయ్ చేస్తున్నారు: ‘జిలేబి’ సక్సెస్ మీట్ లో చిత్ర యూనిట్
నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, మన్మధుడు లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలని అందించిన మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కె. విజయభాస్కర్ చాలా విరామం చేసిన యూత్ ఫుల్ ఫన్ అండ్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ ‘జిలేబి’. ప్రముఖ పారిశ్రామికవేత్త గుంటూరు రామకృష్ణ ఎస్ఆర్కే ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. అంజు అశ్రాని చిత్రాన్ని ప్రజెంట్ చేశారు. విజయభాస్కర్ తనయుడు శ్రీకమల్ హీరోగా పరిచమైన ఈ చిత్రంలో శివాని రాజశేఖర్ కథానాయికగా నటించారు. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఆగస్ట్ 18న విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి ఘన విజయాన్ని సాధించింది. ఈ నేపద్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది.
సక్సెస్ మీట్ లో దర్శకుడు కె.మాట్లాడుతూ.. ఇంత మంచి ఫన్ ఎంటర్ టైనర్ ని ఎంచుకొని, ఎక్కడా రాజీపడకుండా ఒక పెద్ద సినిమాలా నిర్మించిన నిర్మాతలు రామకృష్ణ, అంజుఅశ్రాని కి ధన్యవాదాలు. సినిమాపై వున్న నమ్మకంతో సొంతగా రిలీజ్ చేశారు. సినిమా చూసినప్పుడు ఫస్ట్ టైం ప్రొడక్షన్ లా ఎక్కడా అనిపించదు. ‘జిలేబి’ సినిమా చదువుకునే రోజులు, హాస్టల్ డేస్ ని మళ్ళీ గుర్తుకు తెచ్చింది. ప్రతి సినిమా ఒక పరీక్ష లాంటిదే. ఐతే చదువుకునే రోజుల్లో పరీక్ష ఒత్తిడితో రాసేవాళ్ళం. ఇక్కడ మాత్రం ఎంజాయ్ చేస్తూ రాస్తాం. సినిమాలో వినోదం ఎలా వుందో ప్రేక్షకులు చూసి చెప్పాలి. శ్రీకమల్, శివానితో పాటు నటీనటులంతా చక్కగా నటించారు. రాజేంద్రప్రసాద్ గారు, మురళీశర్మ వారి అనుభవాన్ని జోడించారు. మణిశర్మ చక్కని సంగీతం అందించారు. రామజోగయ్యశాస్త్రీ గారి లిరిక్స్ హైలెట్. అలాగే భాను అద్భుతంగా కోరియోగ్రఫీ చేశారు. అందరూ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి సహకరించారు. అందరికీ ధన్యవాదాలు. కమల్ ఇప్పుడే ప్రయాణం మొదలుపెట్టాడు. ఇంకా మీ ప్రేమ కావాలి. ప్రేక్షకులు కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయని ప్రామిస్ చేయగలం. సినిమా చూసిన తర్వాత మీ ఫీడ్ బ్యాక్ ని ఇవ్వండి” అని కోరారు.
హీరో శ్రీ కమల్ మాట్లాడుతూ.. ‘జిలేబి’ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా అనందంగా వుంది. మార్నింగ్, ఈవెంట్ షోస్ కంటే నైట్ షోస్ ఇంకా పెరిగాయి. థియేటర్స్ ఇంకా పెరుగుతున్నాయి. నా మొదటి సినిమాకి ఇంత మంచి ఫీడ్ బ్యాక్ రావడం సర్ ప్రైజ్ గా వుంది. ఈ సినిమా ఇంకా పెద్ద లెవల్ కి వెళ్లాలని ప్రేక్షకులని కోరుకుంటున్నాను. అందరూ సినిమా చూడండి పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటారు. ఇది మా గ్యారెంటీ. థియేటర్ కి రండి.. నవ్వుతూ బయటికి వెళ్తారు” అన్నారు.
నిర్మాత గుంటూరు రామకృష్ణ మాట్లాడుతూ.. జిలేబి చిత్రానికి అన్ని చోట్ల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా డీసెంట్ మూవీని ప్రేక్షకులు అభినందిస్తున్నారు. కామెడీ చాలా బావుందని రివ్యూస్ వస్తున్నాయి. సినిమా ఫలితం పట్ల చాలా ఆనందంగా వుంది. సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు” తెలిపారు
నిర్మాత అంజు అశ్రాని మాట్లాడుతూ.. జిలేబి చిత్రాన్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. మేము ఇంకా మంచి మంచి హిట్స్ తో మీ ముందుకు వస్తాం. జిలేబి సినిమా షోస్ ని ప్రతి చోట ఇంకా పెంచుతున్నాం. ప్రేక్షకులు మరింతగా ఆదరించాలని కోరుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు” తెలిపారు
అంకిత్ కొయ్య మాట్లాడుతూ.. సినిమా చూసిన వారంతా హాయిగా నవ్వుకుంటున్నారు. ఆ నవ్వులు మాకు దీవెనలుగా భావిస్తున్నాం. ఇంతమంచి ఎంటర్ టైనర్ లో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు” తెలిపారు.
సన్నీ మాట్లాడుతూ.. జిలేబి సినిమా చూసినవారంతా చాలా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. చాలా నందంగా వుంది. సినిమా చూసిన వాళ్ళు మరో నలుగురికి చెప్పాలని కోరుకుంటున్నాను. విజయభాస్కర్ గారి గత చిత్రాల్లానే జిలేబిలో కూడా చాలా ఆహ్లాదకరమైన కామెడీ వుంది. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు” తెలిపారు.
సాయి కుమార్ బబ్లూ మాట్లాడుతూ.. ఈ సినిమా అవకాశం ఒచ్చిన విజయభాస్కర్ గారి ధన్యవాదాలు. ఇది నా మొదటి సినిమా, చాలా మంచి రోల్ ఇచ్చారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలు అందించిన విజయభాస్కర్ గారి సినిమాలో చేయడం అనందంగా వుంది. సినిమా మంచి విజయం సాధించింది. జిలేబిని అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాని ఇంకా పెద్ద విజయం చేస్తారని ఆశిస్తున్నాను”అన్నారు.
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…