భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రం బఘీర అక్టోబర్ 31న గ్రాండ్ రిలీజ్

రోరింగ్ స్టార్ శ్రీమురళి కథానాయకుడిగా కె.జి.యఫ్, కాంతార, సలార్ వంటి సెన్సేషనల్ చిత్రాలను రూపొందించిన నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘బఘీర’. డాక్టర్ సూరి దర్శకత్వం వహిస్తున్నారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి క‌థ‌ను అందించారు. హోంబ‌లే ఫిలిమ్స్ మేకింగ్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. అలాంటి పెస్ట్రీజియ‌స్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ రూపొందిస్తోన్న ఈ మూవీ తెలుగు, క‌న్న‌డ‌, హిందీ, త‌మిళ, మ‌ల‌యాళ భాష‌ల్లో ప్రపంచ వ్యాప్తంగా అక్టోబ‌ర్ 31న గ్రాండ్ రిలీజ్ అవుతుంది.

బ‌ఘీర రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. అందులో ఓ మాస్క్‌ను చూపిస్తున్నారు. డిఫ‌రెంట్ లుక్లో ఉన్న ఈ మాస్క్ క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. ఇప్ప‌టికే విడుద‌లైన ‘బఘీర’ మూవీ పోస్ట‌ర్స్‌, టీజ‌ర్ సినిమాపై అంచనాల‌ను పెంచాయి. శ్రీముర‌ళి ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో అల‌రించ‌బోతున్నారు. ఎ.జె.శెట్టి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి బి.అజ‌నీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని అందిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

న‌టీన‌టులు:

శ్రీముర‌ళి, రుక్మిణి వ‌సంత్, ప్ర‌కాష్ రాజ్‌, రంగ‌యాణ ర‌ఘు, అచ్యుత్ కుమార్‌, గ‌రుడ రామ్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

బ్యాన‌ర్‌:  హోంబ‌లే ఫిలిమ్స్‌, నిర్మాత:  విజ‌య్ కిర‌గందూర్‌, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, డైరెక్ష‌న్‌:  డాక్ట‌ర్ సూరి, సినిమాటోగ్ర‌పీ: ఎ.జె.శెట్టి, మ్యూజిక్‌:  బి.అజ‌నీష్ లోకనాథ్‌, ఎడిట‌ర్‌:  ప్ర‌ణవ్ శ్రీప్ర‌సాద్‌, యాక్ష‌న్‌:  చేత‌న్ డిసౌజా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  యోగి జి.రాజ్‌, అభిజీత్, ఆర్ట్‌: ర‌వి, కాస్ట్యూమ్స్‌:  యోగి.జి.రాజ్‌, పి.ఆర్‌.ఒ:  వంశీ కాకా

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

11 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

12 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

12 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago