రోరింగ్ స్టార్ శ్రీమురళి కథానాయకుడిగా కె.జి.యఫ్, కాంతార, సలార్ వంటి సెన్సేషనల్ చిత్రాలను రూపొందించిన నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బఘీర’. డాక్టర్ సూరి దర్శకత్వం వహిస్తున్నారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి కథను అందించారు. హోంబలే ఫిలిమ్స్ మేకింగ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. అలాంటి పెస్ట్రీజియస్ ప్రొడక్షన్ హౌస్ రూపొందిస్తోన్న ఈ మూవీ తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 31న గ్రాండ్ రిలీజ్ అవుతుంది.
బఘీర రిలీజ్ డేట్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. అందులో ఓ మాస్క్‌ను చూపిస్తున్నారు. డిఫరెంట్ లుక్లో ఉన్న ఈ మాస్క్ క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే విడుదలైన ‘బఘీర’ మూవీ పోస్టర్స్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచాయి. శ్రీమురళి పవర్‌ఫుల్ రోల్‌లో అలరించబోతున్నారు. ఎ.జె.శెట్టి సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి బి.అజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తామని మేకర్స్ ప్రకటించారు.
నటీనటులు:
శ్రీమురళి, రుక్మిణి వసంత్, ప్రకాష్ రాజ్, రంగయాణ రఘు, అచ్యుత్ కుమార్, గరుడ రామ్ తదితరులు
సాంకేతిక వర్గం:
బ్యానర్: హోంబలే ఫిలిమ్స్, నిర్మాత: విజయ్ కిరగందూర్, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: డాక్టర్ సూరి, సినిమాటోగ్రపీ: ఎ.జె.శెట్టి, మ్యూజిక్: బి.అజనీష్ లోకనాథ్, ఎడిటర్: ప్రణవ్ శ్రీప్రసాద్, యాక్షన్: చేతన్ డిసౌజా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: యోగి జి.రాజ్, అభిజీత్, ఆర్ట్: రవి, కాస్ట్యూమ్స్: యోగి.జి.రాజ్, పి.ఆర్.ఒ: వంశీ కాకా