గ్రాండ్ గా బద్మాషులు ఫ్రీ రిలీజ్ ఈవెంట్.. జూన్ 6న థియేటర్స్ లో !!!

శంకర్ చేగూరి దర్శకత్వంలో బి బాలకృష్ణ, రమా శంకర్ నిర్మించిన తాజా చిత్రం బద్మాషులు. ఈ చిత్రంలో మహేష్ చింతల, విద్యాసాగర్, బలగం సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, కవితా శ్రీరంగం, దీక్ష కోటేశ్వర్ కీలకపాత్రలో నటించారు. ఇటీవల విడుదలైన బద్మాషులు చిత్ర ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. వినోదం అందించే సన్నివేశాలు, మంచి కామెడీ తో ట్రైలర్ బాగా వైరల్ అయింది. ఈ చిత్రం జూన్ 6న రిలీజ్ అవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో దర్శకులు తరుణ్ భాస్కర్, మాలిక్ రామ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చరణ్ అర్జున్ మాట్లాడుతూ.. మహేష్ చింతలకి అవకాశం వచ్చినట్లే చిత్ర పరిశ్రమంలో ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది. ఒక శుక్రవారం రోజు ప్రతి ఒక్కరు స్టార్లు అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే దానికి కాస్త టైం పడుతుంది. బద్మాషులు చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరూ స్టార్లు కావాలని ఆశిస్తున్నా అని అన్నారు.

ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా హాజరైన డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. చాలామంది కామెడీ ని చాలా తేలిగ్గా తీసిపారేస్తుంటారు. కానీ ఆ కామెడీ సన్నివేశాలు వెనుక ఎంత కష్టం, నిజాయితీ దాగుందనేది చూసే వాళ్లకి అర్థం కాదు. ఆ సీన్లు రాసిన వాళ్లకే తెలుస్తుంది. పెళ్లిచూపులు చిత్రంలో కామెడీ సన్నివేశాలు రాస్తున్నప్పుడు మా నాన్న ఆరోగ్యం చాలా సీరియస్ గా ఉంది. చాలా టెన్షన్ పడుతూ రాత్రి వేళల్లో ఆ సన్నివేశాలు రాసాను. మన టాలెంట్ తో నిజాయితీగా ప్రయత్నిస్తే మన కష్టానికి వడ్డీతో సహా ప్రతిఫలం దక్కుతుంది. మా నాన్న కి కోపం వచ్చినప్పుడు నన్ను కామన్ గా తిట్టే పదం బద్మాష్. బద్మాషులు చిత్రం మంచి విజయం సాధించాలి. ఆరవ తేదీ ప్రతి ఒక్కరు ఈ చిత్రాన్ని చూడండి అని తరుణ్ భాస్కర్ అన్నారు.

డైరెక్టర్ మాలిక్ రామ్ మాట్లాడుతూ.. టిల్లు స్క్వేర్ రాకముందు డిజె టిల్లు అనేది చిన్న చిత్రం. ఈ నగరానికి ఏమైంది చిత్రానికి ముందు పెళ్లి చూపులు అనేది ఒక స్మాల్ బడ్జెట్ మూవీ. ఈ రోజున విజయం సాధించే చిన్న బడ్జెట్ చిత్రాలే రేపు పెద్ద బడ్జెట్ చిత్రాలకు నాంది పలుకుతాయి. బద్మాషుల చిత్రం కూడా భవిష్యత్తులో ఒక పెద్ద చిత్రానికి నాంది పలకబోతోంది అని అనిపిస్తుంది. ఈ చిత్రం విజయం సాధించాలి అని మాలిక్ రామ్ అన్నారు.

బద్మాషులు చిత్ర డైరెక్టర్ శంకర్ చేకూరి మాట్లాడుతూ.. తరుణ్ భాస్కర్ అన్న ఈ చెత్త ఫ్రీ రిలీజ్ కి వచ్చి బద్మాష్ లో చిత్రాన్ని మరో స్థాయికి పెంచారు. అందుకు ఆయనకు కృతజ్ఞతలు. బద్మాషులు మూవీ రెండు గంటల పాటు ఫన్ రైడ్ గా సాగుతుంది. హాస్యం అందిస్తూనే ఒక మంచి మెసేజ్ ఈ కథ ద్వారా అందించాం అని అన్నారు.

ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన మహేష్ చింతల మాట్లాడుతూ.. బద్మాషులు చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూడాలి. ఈ మూవీ ద్వారా సహజసిద్ధమైన హాస్యాన్ని అందించాం. పెద్ద సినిమాలు సిటీ లాంటివి అయితే మా చిన్న సినిమాలు పల్లెటూరు లాంటివి. అప్పుడప్పుడు పల్లెటూర్లకు కూడా వెళుతూ ఉండాలి అని మహేష్ అన్నారు.

ఈ చిత్రంలో మరో ప్రధాన పాత్రలో నటించిన విద్యాసాగర్ మాట్లాడుతూ.. బద్మాషులు మూవీలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. ఫ్యామిలీ మొత్తం చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఈ చిత్రం థియేటర్స్ లో మంచి ఎక్స్పీరియన్స్ అందించాలని ఉద్దేశంతో డైరెక్టర్ గారు చాలా వర్క్ చేశారు. ఈ చిత్రంలో పాత్రలు మీరు ప్రతిరోజు చేస్తున్న మీ స్నేహితులు, బంధువుల తరహాలో సహజ సిద్ధంగా అనిపిస్తాయి అని అన్నారు.

Tfja Team

Recent Posts

అవినాష్ తిరువీధుల “వానర” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘అదరహో..’ రిలీజ్, ఈ నెల 26న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…

1 day ago

‘దండోరా’ చిత్రం అద్భుతంగా ఉంటుంది.. మంచి అనుభూతితో థియేటర్ నుంచి బయటకు వస్తారు – దర్శకుడు మురళీకాంత్

వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్…

1 day ago

డిసెంబర్ 19న రాబోతోన్న ‘జిన్’ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి

సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…

1 day ago

‘ఎర్రచీర’పక్కాగా ఫిబ్రవరి 6న విడుదల

బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…

1 day ago

ఫిబ్రవరి 13న ‘ఫంకీ’.. వాలెంటైన్స్ వీకెండ్‌కు ఫుల్ ఫన్ గ్యారంటీ!

వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…

1 day ago

‘దేఖ్‌లేంగే సాలా’ పాటతో పవన్ కళ్యాణ్ అభిమానుల ఆకలి తీర్చిన దర్శకుడు హరీష్ శంకర్

శ్రోతలను ఉర్రుతలూగిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలి గీతం ‘దేఖ్‌లేంగే సాలా’ 24 గంటల్లోనే 29.6 మిలియన్లకు పైగా వీక్షణలతో…

1 day ago