యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) నిర్మాణంలో మోహిత్ సూరి తెరకెక్కించిన చిత్రం ‘సయ్యారా’. YRF బ్యానర్ నుంచి వచ్చే ప్రేమ కథా చిత్రాలకు ఉండే ఫాలోయింగ్, క్రేజ్ అందరికీ తెలిసిందే. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే ఈ ‘సయ్యారా’ చిత్రాన్ని రూపొందించారు. అహాన్ పాండేను హిందీ చిత్ర పరిశ్రమకు ఈ చిత్రంతోనే హీరోగా పరిచయం చేయనున్నారు. రీసెంట్‌గా టీజర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. టీజర్ విడుదలైనప్పటి నుంచి 2025లో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదరుచూసే రొమాంటిక్ మూవీగా మారింది సైయారా. ఓ వైపు మోహిత్ సూరి, మరోవైపు యష్‌రాజ్ ఫిల్మ్స్ ..ఇద్దరూ అద్భుతమైన ప్రేమకథలను రూపొందించటంలో సుప్రసిద్ధులు. వీరిద్దరి కలయికలో ఇప్పుడు వస్తున్న ప్రేమకథా చిత్రం సైయారా కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. హీరోహీరోయిన్ మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది.
ఈరోజున యష్‌రాజ్ ఫిల్మ్స్‘సయ్యారా’ మూవీ నుంచి టైటిల్ ట్రాక్‌ను విడుదల చేసింది. ఐదేళ్ల నుంచి ఎంతో జాగ్రత్తగా సేకరించి, శ్రద్ధగా రూపొందించిన పాటలు, ఆలోచనలు, స్వరాలన్నీ ఈ సినిమాలో ఉన్నాయని డైరెక్టర్ మోహిత్ సూరి పేర్కొన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘నాకు ఎంతో దగ్గరైన స్నేహితులకు మాత్రమే తెలిసిన విషయమేమంటే నేను కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్, సింగర్స్‌ని కలవటానికి ఇష్టపడుతుంటాను. పుస్తకాలను ఎంతో ఇష్టంగా చదివేవాళ్లు పుస్తకాలను ఎలాగైతే సేకరిస్తారో నేను అలాగే పాటలను, స్వరాలను సేకరిస్తుంటాను. సయ్యారా సినిమా విషయానికి వస్తే నేను ఐదేళ్లుగా సేకరించిన పాటలు, ఆలోచనలు, స్వరాలన్నీ ఈ ఆల్బమ్‌లో ఉన్నాయి. మనసుని తాకేలా, సరికొత్త, ఆహ్లాదకరమైన ఆల్బమ్‌ను సయ్యారా సినిమాతో అందించాలనుకుంటున్నాను. కొత్తవారితో చేస్తున్న ఈ సినిమాలో పాటలన్నీ.. సరికొత్త రొమాంటిక్ ఆల్బమ్‌ను సిద్ధం చేయాలనుకుని చేసినవే. ఈ పాటలు నా హృదయానికెంతో దగ్గరైనవి. ప్రతీ పాట నాకెంతో ప్రత్యేకమైనది. ప్రమోషన్స్‌లో భాగంగా ముందుగా సయ్యారా టైటిల్ ట్రాక్‌ను విడుదల చేశాం. ఈ పాటలో ప్రేమ, ఆర్ద్రత, ఓ ఆత్మ ఉంటుంది. ఈ పాటతో నేను వెంటనే ప్రేమలో పడ్డాను. సయ్యారా టైటిల్ ట్రాక్‌తో పాటు ఫహీమ్ అబ్దుల్లా, అర్సలాన్ నిజామి అనే ఇద్దరు అత్యంత ప్రతిభావంతమైన భారతీయ సంగీత దర్శకులు, గాయకులను (కాశ్మీర్ నుండి) బాలీవుడ్‌కు పరిచయం చేయబోతున్నాం. ఈ ట్రాక్‌ను ప్రతిభాశాలి తనిష్క్ బాగ్చీ స్వరపరిచారు. ఫహీమ్, అర్సలాన్‌ను పరిచయం చేసినందుకు ఆయనకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇర్షాద్ కామిల్ ఈ పాటకు అందమైన సాహిత్యాన్ని అందించారు. సయ్యారా మొదటి పాటపై పని చేసిన వాళ్లంతా అద్భుతమైన ప్రతిభ కలిగిన కళాకారులు. మనం అందరికీ చాలా కాలం గుర్తుండిపోయే ఒక మధురమైన ప్రేమ పాట అందిస్తున్నామనే ఆశతో ఉన్నాం
‘సయ్యారా’ చిత్రంతో హిందీ చిత్రసీమకు అహాన్ పాండే హీరోగా పరిచయం అవుతున్నారు. అలాగే ప్రశంసలు అందుకున్న వెబ్ సిరీస్ ‘బిగ్ గ్రిల్స్ డోంట్ క్రై’లో తన అద్భుత నటనతో ప్రేక్షకుల మనసులు దోచుకున్న అనీత్ పడ్డా ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు.
ఈ చిత్రాన్ని యష్ రాజ్ ఫిల్మ్స్ సీఈఓ అక్షయ్ విద్యానీ నిర్మించారు. ఈ చిత్రం జూలై 18, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది.
v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా : హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…