*”నవాబ్” మూవీ కి కే జి యఫ్ తరహాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

Must Read

ముఖేష్ గుప్తా, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా నవాబ్. ఈ చిత్రంలో రామ రాజ్, మురళీ శర్మ, రాహుల్ దేవ్, శ్రవణ్ రాఘవేంద్ర, పాయల్ ముఖర్జీ, స్నేహ గుప్త ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని నమో క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం 2 గా ఆర్ఎం నిర్మిస్తున్నారు. రవి చరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. నవాబ్ మూవీ క్యారెక్టర్ ఇంట్రో ప్రెస్ మీట్ తాజాగా హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సందర్భంగాదర్శకుడు రవి చరణ్ మాట్లాడుతూ….నా మొదటి సినిమా నల్లమల. కొత్త దర్శకుడు అని చూడకుండా నా మొదటి సినిమాను బాగా ఆదరించారు.

మీడియా, సినీ ప్రముఖులు సహకారం అందించారు. అందరి సపోర్ట్ తో మంచి విజయం అందుకున్నాం. మీరు ఇచ్చిన ఉత్సాహంతో ఈ నవాబ్ మూవీని రూపొందిస్తున్నాం. ఇదొక కొత్త తరహా ప్రయత్నం. పూర్తిగా డంపింగ్ యార్డ్ లో సాగే కథతో మూవీ తెరకెక్కిస్తున్నాం. కథ గురించిన పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తాం. నవాబ్ క్యారెక్టర్స్ ఇంట్రో మీకు నచ్చిందని అనుకుంటున్నాం. రెండో సినిమాకు అవకాశం ఇచ్చిన నిర్మాత ఆర్ఎం గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మా హీరో ముఖేష్ గుప్తా తెలుగు వారు కాదు. ఆర్నెళ్లు తెలుగు నేర్చుకుని అద్భుతంగా నటిస్తున్నారు. నాకు సపోర్ట్ చేస్తున్న టెక్నీషియన్స్ మిత్రులకు థాంక్స్. అన్నారు.

హీరో ముఖేష్ గుప్తా మాట్లాడుతూ…నవాబ్ మూవీలో హీరోగా నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు దర్శకుడు రవిచరణ్ కు థాంక్స్ చెబుతున్నాను. తెలుగు నేర్చుకుని ఈ సినిమాలో నటించాను. సినిమా వైవిధ్యంగా ఉంటూ మీకు కొత్త అనుభూతిని ఇస్తుంది. మీ అభిమానం, ప్రేమ కావాలి. అన్నారు.నటుడు రామ రాజ్ మాట్లాడుతూ…గత చిత్రం నల్లమలలో రవిచరణ్ అన్న మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఈ సినిమాలో దమ్కీ దాస్ అనే పాత్రలో నటిస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చిన రవి చరణ్ అన్నకు థాంక్స్. డంప్ యార్డులో జరిగే కథ ఇది. నవాబ్ అనే టైటిల్ తో వస్తున్నాం. డిఫరెంట్ మూవీగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా కోసం మా దర్శకుడు చాలా కష్టపడుతున్నాడు. అన్నారు.

సినిమాటోగ్రాఫర్ రమేష్ కేఆర్ మాట్లాడుతూ…నల్లమల టీజర్ చూసినప్పుడు ఎవరీ దర్శకుడు ఇంత వైవిధ్యంగా సినిమా చేశాడు. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అమిత్ ను హీరోగా కొత్తగా చూపించాడు. సబ్జెక్ట్ కు సరిపోయే నటులను ఈ డైరెక్టర్ ఎంపిక చేస్తాడని అర్థమైంది. నల్లమల రిలీజ్ తర్వాత దర్శకుడు రవి చరణ్ కు కంగ్రాట్స్ చెప్పాను. డంప్ యార్డ్ లో షూటింగ్ చేయడం కష్టం. ఒరిజినల్ డంప్ యార్డ్ లో షూటింగ్ చేయడం కష్టం. దీని కోసం 10, 12 ఎకరాల్లో ఒక డంప్ యార్డ్ ను సెట్ లా క్రియేట్ చేశాడు దర్శకుడు. అలాగే దీనికోసం వర్క్ షాప్స్ పెట్టాడు. అలా ఫుల్ గా ప్రిపేర్ అయ్యి మంచి సినిమా చేశాడు. అన్నారు.

ఈ చిత్రానికి కొరియోగ్రఫీ – ప్రేమ్ రక్షిత్, సంగీతం – పీఆర్, సినిమాటోగ్రఫీ – రమేష్ కేఆర్, వీఎఫ్ఎక్స్ చందు అది అండ్ టీమ్, ఎడిటర్ – శివ శర్వాణి, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గొల్లమూడి రమేష్, పీఆర్వో జీఎస్కే మీడియా, నిర్మాత ఆర్ఎం, రచన దర్శకత్వం – రవి చరణ్.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News