ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్న”బేబి”

ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కేఎన్ నిర్మాణంలో దర్శకుడు సాయి రాజేశ్ రూపొందించిన కల్ట్ బ్లాక్ బస్టర్ బేబి మరో హిస్టారిక్ ఫీట్ కు చేరువలో ఉంది. తాజాగా అనౌన్స్ చేసిన ఫిల్మ్ ఫేర్ సౌత్ 2024 అవార్డ్స్ లో బేబి సినిమాకు 8 నామినేషన్స్ దక్కాయి. బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ లిరిసిస్ట్, రెండు బెస్ట్ సింగర్..ఇలా 8 మేజర్ విభాగాల్లో బేబి సినిమా నామినేషన్స్ పొందింది. ఈ హ్యూజ్ నామినేషన్స్ చూస్తుంటే త్వరలో హైదరాబాద్ లో జరగనున్న ఫిల్మ్ ఫేర్ సౌత్ 2024 అవార్డ్స్ లో బేబి సినిమా చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

బేబి సినిమాలో హార్ట్ టచింగ్ యాక్టింగ్ తో ఆకట్టుకున్న ఆనంద్ దేవరకొండ బెస్ట్ యాక్టర్ గా, ది బెస్ట్ పర్ ఫార్మెన్స్ ఇచ్చిన వైష్ణవి చైతన్య బెస్ట్ యాక్ట్రెస్ గా, క్లాసిక్ ఇమేజ్ తో పాటు కమర్షియల్ సక్సెస్ సాధించి 100 కోట్ల గ్రాసర్ గా నిలిచినందుకు బెస్ట్ ఫిల్మ్ గా, ప్రేమ కథను హృద్యంగా తెరపై ఆవిష్కరించినందుకు బెస్ట్ డైరెక్టర్ గా సాయి రాజేష్, తన మ్యూజిక్ తో బేబికి ప్రాణం పోసిన విజయ్ బుల్గానిన్ బెస్ట్ మ్యూజిక్ కంపోజర్ గా, ఓ రెండు మేఘాలిలా పాటతో టైటిల్స్ నుంచే సినిమాలో ప్రేక్షకుల్ని లీనం చేసే సాహిత్యాన్ని అందించినందుకు లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ బెస్ట్ లిరిక్ రైటర్ విభాగంలో నామినేషన్స్ అందుకున్నారు. ప్రేమిస్తున్నా పాట పాడిన పీవీఎన్ఎస్ రోహిత్, ఓ రెండు ప్రేమ మేఘాలిలా పాట పాడిన శ్రీరామ చంద్ర బెస్ట్ సింగర్స్ గా నామినేషన్ అందుకున్నారు.

గొప్ప సినిమాకు ప్రేక్షకుల రివార్డ్స్ తో పాటు అవార్డ్స్ కూడా దక్కుతాయని అనేందుకు బేబి సినిమా తిరుగులేని ఎగ్జాంపుల్ గా నిలుస్తోంది. ఈ సినిమాకు గామా సహా జాతీయ, రాష్ట్ర స్థాయిలో రెపుటేషన్ ఉన్న పలు ప్రతిష్టాత్మక అవార్డ్స్ దక్కాయి. ఇప్పుడు ఫిలింఫేర్ వంటి ప్రతిష్టాత్మక అవార్డ్స్ లోనూ సత్తా చాటేందుకు బేబి మూవీ రెడీ అవుతోంది.

బేబి సినిమాతో పాటు నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమాకు కూడా 8 నామినేషన్స్ దక్కాయి.

Tfja Team

Recent Posts

వైభవంగా జరిగిన హీరో సతీష్ జై కుమార్తె ‘నైరా ‘ పుట్టినరోజు వేడుక

అంతకుమించి చిత్రం పేం సతీష్ జై, డాక్టర్ మైత్రి షరణ్ ల కుమార్తె "నైరా" మొదటి పుట్టినరోజు వేడుకలు ఇటీవల…

19 minutes ago

హీరోలు సందీప్ కిషన్, విశ్వక్ సేన్ చేతుల మీదుగా హీరో తిరువీర్ “భగవంతుడు” మూవీ టీజర్ రిలీజ్

యంగ్ టాలెంటెడ్ హీరో తిరువీర్ నటిస్తున్న కొత్త సినిమా "భగవంతుడు". ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ…

2 hours ago

ఘనంగా తిరుపతిలో ‘సుమతి శతకం’ చిత్ర టైలర్ లాంచ్ ఈవెంట్ – ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాతగా ఎంఎం నాయుడు రచన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు…

4 hours ago

శ్రీరామ్‌ ‘ది మేజ్‌’ ఫస్ట్‌లుక్‌ అండ్‌ గ్లింప్స్‌ విడుదల

ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఒకరికి ఒకరు వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో తెలుగులో అందరికి సుపరిచితుడైన కథానాయకుడు శ్రీరామ్‌. ఈయన…

1 day ago

సబ్ స్క్రైబర్స్ కు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ కంటెంట్ అందిస్తూ ఎంటర్ టైన్ చేస్తున్న ఆహా ఓటీటీ

తమ సబ్ స్క్రైబర్స్ కు మంచి ఎంటర్ టైన్ మెంట్ అందిస్తామనే ప్రామిస్ ను నిలబెట్టుకుంటూ బ్యాక్ టు బ్యాక్…

1 day ago

యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సీతా పయనం నుంచి ‘పయనమే’ అంటూ సాగే మెలోడియస్, రొమాంటిక్ పాట విడుదల

శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై మల్టీ టాలెంటెడ్ నటుడు, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రాబోతోన్న కొత్త…

1 day ago