బాహుబ‌లి ప్ర‌భాక‌ర్ ఫై భారీ ఫైట్ చిత్రీక‌ర‌ణ‌!!

Must Read

   ఆర్. ఆర్ క్రియేష‌న్స్ -పాలిక్ స్టూడియోస్ ప్రొడ‌క్ష‌న్ నెం-1 చిత్రం ఆఖ‌రి షెడ్యూల్‌!!

 బాహుబ‌లి` ప్ర‌భాక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆర్. ఆర్ క్రియేష‌న్స్ -పాలిక్ స్టూడియోస్ బేన‌ర్స్ పై పాలిక్ ( పాలిక్ శ్రీనివాస చారి) ద‌ర్శ‌క‌త్వంలో ర‌మేష్ రావుల  నిర్మిస్తోన్న ప్రొడ‌క్ష‌న్ నెం-1 చిత్రం షూటింగ్ ప్ర‌స్తుతం బూత్ బంగ్లాలో షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ సంద‌ర్భంగా ఆన్ లొకేష‌న్‌లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.  

ఈ కార్య‌క్ర‌మంలో బాహుబ‌లి ప్ర‌భాక‌ర్ మాట్లాడుతూ…“ఒక అద్భుత‌మైన క‌థ‌తో ద‌ర్శ‌కుడు పాలిక్ ఈ చిత్రాన్ని తెకెక్కిస్తున్నారు. నా పాత్ర చాలా డిఫ‌రెంట్ గా ఉంటుంది. డైలాగ్స్ బాగా కుదిరాయి. నా పైన ఒక డిఫ‌రెంట్ సాంగ్ కూడా పిక్చ‌రైజ్ చేశారు. ఫ్యామిలీ అంతా క‌లిసి చూసేలా సినిమా ఉంటుంది. ప్ర‌స్తుతం ఫైట్ సీన్ షూటింగ్ జ‌రుగుతోంది. ఈ షెడ్యూల్ తో షూటింగ్ అంతా పూర్త‌వుతుంది“ అన్నారు.

 ద‌ర్శ‌కుడు పాలిక్ మాట్లాడుతూ…``ద‌ర్శ‌కుడుగా ఇది నా 6వ చిత్రం. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా వ‌స్తోన్న ఈ చిత్రంలో  బాహుబ‌లి ప్ర‌భాక‌ర్  ప్రధాన పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఎంతో బిజీగా ఉన్నా ప్ర‌భాక‌ర్  ఎంతో స‌హ‌క‌రిస్తున్నారు.  ప్ర‌స్తుతం ర‌వి మాస్ట‌ర్ సార‌థ్యంలో  ప్ర‌భాక‌ర్ గారి పై భారీ ఫైట్ బూత్ బంగ్లాలో  చిత్రీక‌రిస్తున్నాం. ఈ షెడ్యూల్ రెండో రోజుల్లో పూర్త‌వుతుంది. దీంతో షూటింగ్ పూర్త‌యిన‌ట్లే. మా నిర్మాత రావుల ర‌మేష్  ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా సినిమా రిచ్ గా రావ‌డానికి స‌హ‌క‌రిస్తున్నారు. వింధ్య  మంచి స్టోరి ఇచ్చారు. జాన్ భూష‌ణ్ మూడు అద్భుత‌మైన పాట‌లిచ్చారు. ప్ర‌భాక‌ర్ గారి పై చాలా గ్రాండ్ గా ఒక పాట చిత్రీక‌రించాం. మార్చిలో సినిమాను రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం“ అన్నారు.

 నిర్మాత ర‌మేష్ రావుల మాట్లాడుతూ…“ఈ రోజు భారీగా ప్ర‌భాక‌ర్ గారి పై ఫైట్ చిత్రీక‌రిస్తున్నాం. ప్ర‌భాక‌ర్ గారి స‌పోర్ట్ మ‌రువ‌లేనిది. మా డైర‌క్ట‌ర్ పాలిక్ మంచి ప్లానింగ్ తో సినిమాను అనుకున్న ప్ర‌కారం పూర్తి చేస్తున్నారు. త్వ‌ర‌లో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పూర్తి చేసి మార్చిలో సినిమా రిలీజ్ చేస్తాం“ అన్నారు.

 క‌థా ర‌చ‌యిత వింధ్య రెడ్డి మాట్లాడుతూ…“నా క‌థ‌ను అద్భుతంగా పాలిక్ గారు తెర‌కెక్కిస్తున్నారు. ర‌మేష్ గారు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. ప్ర‌భాక‌ర్ గారి స‌హ‌కారం వ‌ల్ల సినిమా అనుకున్న దానిక‌న్నా బాగా వ‌స్తోంది“ అన్నారు.

 హీరో వెంక‌ట్ మాట్లాడుతూ…“ ఈ చిత్రంలో హీరోగా అవ‌కాశం క‌ల్పించిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ధ‌న్య‌వాదాలు. సీనియ‌ర్ ఆర్టిస్ట్ ప్ర‌భాక‌ర్ గారితో న‌టించ‌డం వండర్ ఫుల్ ఎక్స్ పీరియ‌న్స్ “ అన్నారు.

హీరోయిన్ మోహ‌న సిద్ధి మాట్లాడుతూ…“ఒక మంచి చిత్రంలో పార్ట్ కావ‌డం ఎంతో సంతోషంగా ఉంద‌న్నారు.

 న‌టీన‌టులుః

ప్ర‌ధాన పాత్ర‌లోః బాహుబ‌లి ప్ర‌భాక‌ర్

 హీరోః ర‌ఘ‌, వెంక‌ట్‌

హీరోయిన్ః మోహ‌న సిద్ధి, పాయ‌ల్‌

 జీవా,  తాగుబోతు ర‌మేష్‌.

గ‌బ్బ‌ర్ సింగ్ బ్యాచ్

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News