అతిరథమహారధుల సమక్షంలోరాజా మార్కండేయఆడియో ఘనంగా విడుదల!!

Must Read

శ్రీ జగన్మాత రేణుకా క్రియేషన్స్, ఫోర్ ఫౌండర్స్ పతాకాలపై బన్నీ అశ్వంత్ దర్శకత్వంలో సామా శ్రీధర్, పంజాల వెంకట్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “రాజా మార్కండేయ”. “వేట మొదలైంది” అనేది ఉప శీర్షిక. గౌరిశెట్టి శ్రీనివాస్, బన్నీ అశ్వంత్ కో ప్రొడ్యూసర్స్. యస్ కె మీరావలి , రాయారావు విశ్వేశ్వరరావు , సత్యదీప్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం జనవరి 27న హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఆత్మీయ అతిధుల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ హీరో సుమన్, ప్రతాని రామకృష్ణ గౌడ్, హీరో తేజస్ వీరమాచినేని, హీరోయిన్స్ రోమి, దేవిక, ప్రత్యూష, దర్శకుడు బన్నీ ఆశ్వంత్, నిర్మాతలు సామా శ్రీధర్, పంజల వెంకట్ గౌడ్, సహ నిర్మాతలు గౌరిశెట్టి శ్రీనివాస్, మాజీ టూరిజం ఛైర్మెన్ శ్రీనివాస్ గుప్తా, హైకోర్ట్ అడ్వకేట్ రాపోలు భాస్కర్, హాస్యబ్రహ్మ శంకర్ నారాయణ, సామాజికవేత్త – ప్రొడ్యూసర్ డాక్టర్ మూసా అలీ ఖాన్, కటకం శ్రీనివాస్ గుప్తా, ఇన్స్టాఫేమ్ కవిరాజ్ దంపతులు, ప్రముఖ సామాజికవేత్త గంగాపురం పద్మా గౌడ్ తదితరులు పాల్గొన్నారు. చిత్రంలోని ఒక్కో పాటను విచ్చేసిన అతిధులు ఆవిష్కరించగా.. టీజర్ ను రాపోలు భాస్కర్ విడుదల చేశారు. సినిమా ట్రైలర్ ను హీరో సుమన్ రిలీజ్ చేశారు.

అనంతరం హీరో సుమన్ మాట్లాడుతూ.. “రాజా మార్కండేయ” సినిమా సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. టీజర్, ట్రైలర్ చూస్తుంటే మంచి కంటెంట్ ను నమ్ముకొని తీసినట్టు వుంది. అందరూ కొత్తవాళ్ళైనా సినిమాలో మంచి కథ వుందని అర్థం అవుతుంది. ఇలాంటి కొత్తవాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అప్పుడే మంచి సినిమాలు వస్తాయి. చిత్రంలో శివయ్య పాట చాలా అద్భుతంగా ఉంది. రాబోయే శివరాత్రి పండుగకు ప్రతి దేవాలయంలో ఈ పాట మార్మోగుతుంది. ఈ చిత్రం మంచి విజయం సాధించి నిర్మాత దర్శకులకు మంచి లాభాలు రావాలి” అన్నారు.

సంగీత దర్శకులు యస్ కె. మీరావలి, రాయారావు విశ్వేశ్వరరావు మాట్లాడుతూ.. “బన్నీ ఆధ్వర్యంలో ఫోర్ ఫౌండర్స్ టీం మమ్ములను తీసుకొచ్చి ఈ చిత్రానికి మ్యూజిక్ చేయించారు. వారివల్లే మేము ఇండస్ట్రీకి రాగలిగాము. ఆడియోతోపాటు సినిమాని కూడా పెద్ద విజయం చేయాలని కోరుకుంటున్నాము అన్నారు.

ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. “చిత్ర దర్శకుడు బన్నీ మా సభ్యుడే. చాలా టాలెంట్ వున్న వ్యక్తి. నిర్మాతలు మా జిల్లాకు చెందినవారు. అందరూ చాలా కష్టపడి ఈ సినిమా చేశారు. సాంగ్స్ ట్రైలర్ అధ్బుతంగా వున్నాయి. డెఫినెట్ గా ఈ సినిమా హిట్ అవుతుంది” అన్నారు.

దర్శకుడు బన్నీ ఆశ్వంత్ మాట్లాడుతూ.. “ఇరవై సంవత్సరాలుగా ఇండస్ట్రీలో వున్నాను. ఎన్నో కష్టాలు పడ్డాను. సినిమా తీయాలని నా కల. నాకు సహకరించి ప్రోత్సహించిన మా నిర్మాతలకు, స్నేహితులకి ధన్యవాదాలు. ఈనాటి కలియుగంలో శివుడి భక్తుడైన మార్కండేయ జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? వాటిని శివుడి అనుగ్రహంతో ఎలా అధిగమించాడు? అనేది కాన్సెప్ట్. మీరావలి మంచి సంగీతాన్ని అందించారు. ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరూ చాలా బాగా కోపరేట్ చేసి వర్క్ చేశారు.. లైఫ్ లాంగ్ కొత్త వారికి అవకాశాలు కల్పిస్తూ సినిమాలు తీయాలన్నదే నా ధ్యేయం. మా సినిమా ప్రేక్షలందరికి నచ్చుతుంది” అన్నారు.

నిర్మాతల్లో ఒకరైన సామా శ్రీధర్ మాట్లాడుతూ.. “మా బన్నీ ఆశ్వంత్ వల్లే ఈ సినిమాని నిర్మించగలిగాం. కథని నమ్ముకొని తీసిన సినిమా ఇది. హీరో తేజస్, హీరోయిన్స్ రోమీ, దేవిక, ప్రత్యూష, టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరూ సినిమా కోసం అహర్నిశలు కష్టపడ్డారు. వారందరికీ స్పెషల్ థాంక్స్. అలాగే మా తోటి మిత్రులు అందరూ నాకు చాలా హెల్ప్ చేశారు. సినిమా బాగా వచ్చింది. ఆడియెన్స్ కి ఈ చిత్రం కచ్చితంగా నచ్చుతుంది.. అన్నారు. హీరో, హీరోయిన్స్.. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన నిర్మాతలు, దర్శకులకు థాంక్స్ తెలిపారు!!

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News