“డ్రింకర్ సాయి”లో నేను చేసిన బాగీ క్యారెక్టర్ కు ప్రేక్షకులంతా కనెక్ట్ అవుతారు – హీరోయిన్ ఐశ్వర్య శర్మ

Must Read

ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “డ్రింకర్ సాయి”. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మిస్తున్నారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ నెల 27న ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అ‌వుతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో “డ్రింకర్ సాయి” సినిమా హైలైట్స్ హీరోయిన్ ఐశ్వర్య శర్మ తెలిపారు.

-“డ్రింకర్ సాయి” సినిమాలో నా క్యారెక్టర్ పేరు బాగీ. ఈ కథ విన్నప్పుడు నాది చాలా బలమైన క్యారెక్టర్ అనిపించింది. ఈ క్యారెక్టర్ ను జెన్యూన్ గా ప్రెజెంట్ చేయాలని బాధ్యతగా ఫీలయ్యాను. నటిగా నాకు ఛాలెంజింగ్ గా అనిపించింది. ఈ సినిమా కోసం ఆడిషన్స్ ఇచ్చాను. కొన్ని సీన్స్ ఇస్తే చేసి చూపించాను. అందులో పర్ ఫార్మెన్స్ నచ్చి ప్రాజెక్ట్ లోకి తీసుకున్నారు. బాగీ క్యారెక్టర్ కు మీరు బాగా కనెక్ట్ అవుతారు.

  • మా నాన్న స్టేజ్ యాక్టర్. నాపైనా ఆ ప్రభావం తెలియకుండానే పడింది. చిన్నప్పటి నుంచి ఆర్టిస్టుగానే ఉండాలనుకున్నాను. డ్యాన్సర్, సింగర్ కావాలనేది నా కోరిక. ఈ ఫీల్డ్ లోకి రాకుంటే ఫలానా జాబ్ చేయాలనే ఆప్షన్ కూడా పెట్టుకోలేదు. 12 క్లాస్ పూర్తయిన తర్వాత జమ్మూ నుంచి ముంబై వచ్చి యాక్టింగ్ కోర్సులో జాయిన్ అయ్యాను. యాక్టింగ్ కోర్సు పూర్తయ్యాక ఆడిషన్స్ ఇవ్వడం ప్రారంభించాను. గతంలో షార్ట్ ఫిలింస్, వెబ్ సిరీస్ లలో నటించలేదు. కొన్ని యాడ్స్ లో నటించాను. “డ్రింకర్ సాయి”తో హీరోయిన్ గా మీ ముందుకు వస్తున్నా.
  • తెలుగమ్మాయిని కాకపోవడం వల్ల డైలాగ్స్ చెప్పేప్పుడు ఇబ్బందిగా ఉండేది. నేను ఏ డైలాగ్ చెబుతున్నాను అనేది అర్థమయ్యేది కాదు. ఈ సినిమా చేసేప్పుడు భాష ఒక్కటే నేను ఎదుర్కొన్న సమస్య. అది తప్ప సెట్ లో నటిస్తున్నప్పుడు బాగా ఎంజాయ్ చేశాను.

-హీరో ధర్మతో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. పర్సనల్ గా చాలా మంచివాడు. “డ్రింకర్ సాయి” క్యారెక్టర్ కు పూర్తిగా భిన్నమైన వ్యక్తిత్వం అతనిది. డైలాగ్స్ చెప్పడంలో నాకు సపోర్టివ్ గా ఉన్నాడు. ఈ చిత్రంలో సాయి పాత్రలో తను బాగా పర్ ఫార్మ్ చేశాడు.

  • ప్రేమతో మనకు విడదీయరానికి అనుబంధం ఉంటుంది. మన జీవితంలోని ప్రతి దశలో, ప్రతి సందర్భంలో ప్రేమను అనుభూతి చెందుతాం. “డ్రింకర్ సాయి”లో ఒక మంచి ప్రేమకథను చూస్తారు. ఈ సినిమాలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ చిత్రంతో కొన్ని మంచి విషయాలు కూడా చెబుతున్నాం. అవి ఇప్పుడు రివీల్ చేస్తే స్క్రీన్ మీద ఎంజాయ్ చేయలేరు.
  • బాగీ క్యారెక్టర్ లో ఇన్నోసెంట్ గా కనిపిస్తాను. అలాగే రఫ్ అండ్ టఫ్ గా, స్ట్రిక్ట్ గా ఉంటాను. ఇందులో మెడికల్ స్టూడెంట్ గా కనిపిస్తాను. నా క్యారెక్టర్ లో ఫన్ కూడా ఉంటుంది. ట్రైలర్, మిగతా కంటెంట్ చూశాక బాగీ క్యారెక్టర్ మీద మీకొక అభిప్రాయం ఏర్పడి ఉంటుంది. అయితే సినిమా చూస్తే మీకు బాగి క్యారెక్టర్ పూర్తిగా అర్థమవుతుంది. రెగ్యులర్ హీరోయిన్ రోల్స్ కు భిన్నంగా నా క్యారెక్టర్ ఉంటుంది.
  • మా చిత్రంలో సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులోని సాడ్ సాంగ్ వింటున్నప్పుడు ఎమోషనల్ అయ్యాను. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ వసంత్ మంచి సాంగ్స్ చేశారు. అర్జున్ రెడ్డి చిత్రంతో మా “డ్రింకర్ సాయి” సినిమాకు పోలిక లేదు. అర్జున్ రెడ్డి క్లాసీ డ్రింకర్. మా సాయి మాసీ డ్రింకర్.
  • మా డైరెక్టర్ కిరణ్ ఫన్నీ పర్సన్. మా మీద ఎలాంటి ప్రెజర్ పెట్టలేదు. షూటింగ్ అంతా సరదాగా చేశాం. సెట్ లో నన్ను అక్క అని పిలిచేవారు. నేను ఆయనను అన్నా అని పిలిస్తే, లేదు నేను నీకు తమ్ముడిని , తమ్ముడు అని పిలువు అనేవారు. ఈ క్యారెక్టర్ లో నేను పర్ ఫార్మ్ చేయగలను అని బాగా నమ్మారు కిరణ్ గారు. ఎంతో సపోర్ట్ చేశారు.
  • మా ఇంట్లో ఫ్యామిలీ అంతా సౌత్ సినిమాలను ఎక్కువగా చూస్తుంటాం. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ మూవీస్ చాలా బాగుంటుంది. అర్థవంతమైన కథ, సహజంగా సినిమాలను రూపొందిస్తుంటారు. ఇలాంటి ఇండస్ట్రీలో పార్ట్ అవడం సంతోషంగా ఉంది. ధనుష్ నా ఫేవరేట్ యాక్టర్. నేను ఇటీవల లక్కీ భాస్కర్ సినిమా చూశాను.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News