‘మత్తువదలరా2’ కథ, క్యారెక్టర్స్ ని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు సింహ  

Must Read

బ్లాక్ బస్టర్ మత్తు వదలరాకు సీక్వెల్ ‘మత్తువదలరా2’  ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమౌతోంది. శ్రీ సింహ కోడూరి లీడ్ రోల్ లో తన సైడ్ కిక్ గా సత్య నటిస్తున్న ఈ చిత్రానికి రితేష్ రానా దర్శకత్వం వహిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా  హీరోయిన్ గా నటిస్తోంది. ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. సెప్టెంబర్ 13న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరో శ్రీ సింహ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

‘మత్తువదలరా2’ కు ఎలా ప్రీపరేషన్ జరిగింది ?
-చాలా బాగా జరిగింది. గెటప్పు, క్యారెక్టర్స్ స్టయిలింగ్ మారింది. ‘హీ’ టీం ఏజెంట్స్ గా చూపించాం. ఫస్ట్ పార్ట్ కన్నా యాక్షన్ సీన్స్ ఎక్కువగా వుంటాయి.  

మత్తువదలరా2 ఆలోచన మొదటి నుంచా ఉందా?
-రిలీజైయ్యాక హిట్ అయిన తర్వాత సీక్వెల్ చేద్దామని నాకు, చెర్రీ గారికి వుండేది. డైరెక్టర్ రితిష్ లాస్ట్ ఇయర్స్ స్క్రిప్ట్ రాయడం స్టార్ట్ చేశారు.

-ఫస్ట్ పార్ట్ లో వున్న క్యారెక్టర్స్ ట్రావెల్ అవుతాయి. డెలివరీ బాయ్స్ నుంచి ఏజెంట్స్ ఎలా అయ్యారనే లింక్ చూపిస్తాం.  

పార్ట్ వన్ పెద్ద హిట్ట్ అయ్యింది కదా.. రెండో పార్ట్ అంచనాలు విషయంలో ఒత్తిడి తీసుకున్నారా?
-సినిమా హిట్ అయ్యిందని పార్ట్ 2 తీస్తే ఖచ్చితంగా ఒత్తిడి వుంటుంది. కానీ డైరెక్టర్ రితిష్ కి ఈ కథ ఫస్ట్ పార్ట్ కి మ్యాచ్ అయ్యేలా ఆర్గానిక్ గా వచ్చింది. అందుకే నేచురల్ గా అంతా సెట్ అయ్యింది. ఈ క్రెడిట్ అంతా డైరెక్టర్ దే.

రిలీజ్ టైం కే సినిమా బయటికి వచ్చింది. అంతకుముందు అంత సైలెంట్ గా ఉండటానికి కారణం?
– ఇదొక కొత్త స్ట్రాటజీ లా అనుకున్నాం. అనౌన్స్ చేస్తే బజ్ వస్తుంది. ఫస్ట్ పార్ట్ హిట్ కాబట్టి ఆడియన్స్ ఎక్సయిట్ అవుతారు. అయితే సినిమా పూర్తయి విడుదలకి వచ్చేసరికి దానిపై బజ్ తగ్గొచ్చు. ఎక్సయిట్మెంట్ పలచబడకముందే వేడివేడిగా వడించేయాలనే ఉద్దేశంలో ఇలా చేశాం. ఇప్పుడున్న బజ్ చూస్తుంటే మా స్ట్రాటజీ వర్క్ అయ్యిందనిపించింది.  

ప్రభాస్ గారు ట్రైలర్ లాంచ్  చేశారు కదా.. ఆయన రియాక్షన్ ఏమిటి?
– చాలా ఎంజాయ్ చేశారు. టీజర్ ట్రైలర్ సాంగ్ చూసి చాలా ఎక్సయిట్ అయ్యారు. ఆయనకు జెన్యూన్ గా నచ్చితేనే అంత టైం స్పెండ్ చేస్తారు.

ఫారియాతో వర్క్ చేయడం గురించి ?
-ఫారియా ఫన్నీ క్యారెక్టర్స్ కి బాగా సెట్ అవుతుంది. నేచురల్ గా తనలో ఫన్ వుంటుంది. ఇందులో తన పాత్ర యాక్షన్ కూడా వుంది. ఈ క్యారెక్టర్ కి ఫారియా యాప్ట్. ఈ సినిమాలో తను సాంగ్ రాయడంతో పాటు  కొరియోగ్రాఫ్ చేసింది. అది ప్రమోషన్స్ కి బాగా యూజ్ అయ్యింది.

ఇది మర్డర్ మిస్టరీనా… డ్రగ్స్ బ్యాక్ డ్రాపా ?
-ఫస్ట్ పార్ట్ లో మర్డర్ ఎవరు చేశారు అనే ట్రాక్ తో పాటు డ్రగ్స్ ట్రాక్ వుంటుంది కదా..  ఇందులో కూడా ఆ రెండితో పాటు ఇంకొన్ని లేయర్స్ యాడ్ అవుతాయి.  

మ్యూజిక్ లో ఎక్సపర్మెంట్ చేస్తున్నారా?
-ఫస్ట్ పార్ట్ ఎంత హిట్ అయ్యిందో దాని బీజీఎంకి కూడా అంత మంచి పేరు వచ్చింది. సెకండ్ పార్ట్ కి కూడా అలానే వస్తుందనే నమ్మకం వుంది.

మత్తువదలరా రీరిలీజ్ షో తర్వాత ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అవ్వడం ఎలా అనిపించింది?
-ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ అందరం కలిసి చూశాం. కొంత మంది ఫస్ట్ పార్ట్ ని థియేటర్స్ లో మిస్ అయ్యారు. అలా మిస్ అయన వారంతా వచ్చి చూడటం చాలా హ్యాపీగా అనిపించింది.    

రాజమౌళి గారి రియాక్షన్ ఏమిటి?
-రాజమౌళి గారికి టీజర్, ట్రైలర్ చాలా నచ్చాయి. చాలా ఎంజాయ్ చేశారు. ప్రోడక్ట్ విషయంలో హ్యాపీగా వున్నారు.

ప్రిమియర్స్ ఎప్పుడు ?
-ప్లాన్ చేస్తున్నాం. 12న ఒక ప్రిమియర్ ఉండొచ్చు. ఇంకా ప్లాన్ చేస్తున్నాం.

ఈ సినిమాలో మీమ్స్ రిఫరెన్స్ ఎంతవరకూ వుంటుంది?
-ఫస్ట్ పార్ట్ లో ఎంతవరకూ వున్నాయో అంత వరకు లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం వుంటాయి. సోషల్ మీడియాతో పరిచయం లేని ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేసే కథ, క్యారెక్టర్స్ వుంటాయి. ఫన్, థ్రిల్ డబుల్ వుంటుంది.  

సత్య, మీ కాంబినేషన్ సూపర్ కదా.. సెకండ్ పార్ట్ లో ఎలా వుంటుంది ?
-మా ఇద్దరి కెమిస్ట్రీ ఫస్ట్ పార్ట్ లో నేచురల్ గా వచ్చింది. సూపర్ గా వర్క్ అయ్యింది. సెకండ్ పార్ట్ లో మేమిద్దరం త్రూ అవుట్ కనిపిస్తాం.

-వెన్నెల కిశోర్ ఇందులో ఫస్ట్ పార్ట్ తో సంబంధం లేని క్యారెక్టర్ లో కనిపిస్తారు. ఆ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా వుంటుంది.

డైరెక్టర్ రితిష్ రానా గురించి?
-రితిష్ చాలా క్లారిటీ వున్న డైరెక్టర్. సినిమా విజన్ బోర్డ్ తన మైండ్ లో వుంటుంది.  

మత్తువదలరా ని ఫ్రాంచైజ్ గా కొనసాగిస్తారా?
-మాకు చేయాలనే వుంది. చేసే అవకాశం వున్న ఫ్రాంచైజ్ ఇది.

 మైత్రీ మూవీ మేకర్స్,  క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాతల గురించి?
-ఇలాంటి అద్భుతమైన టీంని ఇచ్చిన నిర్మాతలు థాంక్స్ చెబుతున్నాను. ఫస్ట్ పార్ట్ కి మంచి పేరు వచ్చిన తర్వాత సెకండ్ పార్ట్ కి స్కేల్ పెంచారు. బాగా ఖర్చుపెట్టారు. సినిమాని గ్రాండ్ గా తీశారు.

కొత్త ప్రాజెక్ట్స్ గురించి ?
అన్నీ డెవలప్మెంట్ లో వున్నాయి. ఇది అయిన తర్వాత వన్ బై వన్ చేయాలనేది నా ఆలోచన.

ఆల్ ది బెస్ట్
-థాంక్ యూ

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News