అశ్విన్ బాబు, అనీల్ కన్నెగంటి, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్వికే సినిమాస్, ఓఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ హిడింబ సెన్సార్ పూర్తి- జూలై 20న విడుదల
సినిమాని సర్టిఫై చేయడానికి సెన్సార్ అధికారుల నుంచి అభ్యంతరాలు రావడానికి రకరకాల కారణాలు వుంటాయి. ‘హిడింబ’ సినిమా విషయానికి వస్తే మొదట సెన్సార్ అధికారుల నుంచి క్లియరెన్స్ పొందింది, ఐతే కొన్ని ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని వారు భావించారు. తర్వాత రివ్యూ కమిటీ ద్వారా సినిమా రీ-సెన్సార్ చేసి ఆమోదం పొందింది.
‘హిడింబ’ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూలై 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో సినిమాను ప్రమోట్ చేయనున్నారు మేకర్స్. “ఇండియన్ సినిమాల్లో ఇంతకు ముందెన్నడూ చెప్పని కథ & ఇంతకు ముందేవరూ టచ్ చేయని జానర్ “అని రిలీజ్ డేట్ పోస్టర్‌లో ఉంది. నిజానికి, థియేట్రికల్ ట్రైలర్ కూడా అదే సూచించింది. యూనిక్ కథతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని థ్రిల్ ని ఇచ్చే విధంగా ఈ చిత్రాన్ని మలిచారు దర్శకుడు అనీల్ కన్నెగంటి.
AK ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అనిల్ సుంకర సమర్పణలో OAK ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ (SVK సినిమాస్) పతాకంపై గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్నారు. నందితా శ్వేత, అశ్విన్ కి జోడి గా నటిస్తున్నారు.
బి రాజశేఖర్ సినిమాటోగ్రాఫర్ కాగా, వికాస్ బాడిసా సంగీతం సమకూరుస్తున్నారు.
తారాగణం: అశ్విన్ బాబు, నందితా శ్వేత, శ్రీనివాస రెడ్డి, సాహితీ అవంచ, సంజయ్ స్వరూప్, షిజ్జు, విద్యుల్లేఖ రామన్, రాజీవ్ కనకాల, శుభలేక సుదాకర్, ప్రమోధిని, రఘు కుంచె, రాజీవ్ పిళ్లై, దీప్తి నల్లమోతు
సాంకేతిక విభాగం:
దర్శకత్వం- అనీల్ కన్నెగంటి
నిర్మాత – గంగపట్నం శ్రీధర్
బ్యానర్ – SVK సినిమాస్
సమర్పణ: అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్
డీవోపీ – బి రాజశేఖర్
ఎడిటర్ – ఎం ఆర్ వర్మ
ఫైట్స్ – జాషువా, రియల్ సతీష్
సంగీతం – వికాస్ బాదిసా
కొరియోగ్రాఫర్లు – శేఖర్ విజె, యష్
డైలాగ్స్- కళ్యాణ చక్రవర్తి
సాహిత్యం- రామ జోగయ్య శాస్త్రి, ప్రణవం
పబ్లిసిటీ డిజైనర్లు – అనిల్ భాను
పీఆర్వో – వంశీ శేఖర్
కాస్ట్యూమ్ డిజైనర్ – మౌనా గుమ్మడి
ఆర్ట్ – షర్మిల యలిశెట్ట
లవ్, ఎమోషన్, డ్రామా వంటి కమర్షియల్ ఎలిమెంట్స్తోపాటు చక్కటి సోషల్ మెసేజ్తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్…
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్‌టైన్‌మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…