‘కస్టడీ’ చిత్రం నుంచి అరవింద్ స్వామి క్యారెక్టర్ పోస్టర్‌

అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం ‘కస్టడీ ఇటివలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం చిత్రబృందం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

ఇటీవల విడుదలైన చిన్న గ్లింప్స్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. కృతి శెట్టి పాత్ర పోస్టర్ కూడా క్యురియాసిటీని పెంచింది. ఈ రోజు మేకర్స్ ట్యాలెంటెడ్ యాక్టర్ అరవింద్ స్వామి పాత్ర పోస్టర్‌ను విడుదల చేసి అందరినీ సర్ప్రైజ్ చేశారు. అరవింద్ స్వామి ఈ చిత్రంలో రాజు అలియాస్ రాజు (Raju aka Raazu) పాత్ర పోషిస్తున్నారు.

అతని లుక్ చాలా పవర్ ఫుల్ గా వుంది. సంకెళ్లతో బార్స్ వెనుక కనిపిస్తున్నారు. అరవింద్ స్వామి ఈ చిత్రంలో బలమైన పాత్ర పోషిస్తున్నారని ఈ పోస్టర్ చూస్తే అర్ధమౌతోంది. ఈ ఫెరోసియష్ లుక్ ఈ యాక్షన్ థ్రిల్లర్‌పై అంచనాలను పెంచింది.

ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. ప్రియమణి పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తుంది. ఈ చిత్రంలో శరత్ కుమార్, సంపత్ రాజ్, ప్రేమ్ జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

నాగ చైతన్య కెరీర్‌లో అత్యంత ఖరీదైన చిత్రాల్లో కస్టడీ ఒకటి. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అత్యున్నత నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని పవన్‌కుమార్‌ సమర్పిస్తున్నారు. అబ్బూరి రవి డైలాగ్స్‌ రాస్తుండగా, ఎస్‌ఆర్‌ కత్తిర్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

కస్టడీ మే 12, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

నటీనటులు: నాగ చైతన్య, కృతి శెట్టి, అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్, ప్రేమ్‌జీ అమరెన్, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు

సాంకేతిక విభాగం :
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకట్ ప్రభు
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్
సమర్పణ: పవన్ కుమార్
సంగీతం: మాస్ట్రో ఇళయరాజా, లిటిల్ మాస్ట్రో యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రాఫర్: ఎస్ఆర్ కతీర్
ఎడిటర్: వెంకట్ రాజన్
డైలాగ్స్: అబ్బూరి రవి
ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్
యాక్షన్: మహేష్ మాథ్యూ
ఆర్ట్ డైరెక్టర్: డివై సత్యనారాయణ
పీఆర్వో: వంశీ శేఖర్
మార్కెటింగ్: విష్ణు తేజ్ పుట్ట

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago