ముంబైలోని డోమ్‌లో జరిగిన మొట్టమొదటి బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో దక్షిణ భారత నటుడు, అథ్లెట్ అరవింద్ కృష్ణ సంచలనం సృష్టించారు. దిశా పటాని, బాద్షా, రణ్విజయ్ సింఘా, వరుణ్ సూద్ వంటి జాతీయ దిగ్గజాలు పాల్గొన్న ఈ ఆటలో దక్షిణాది నుంచి ప్రాతినిధ్యం వహించిన ఏకైక నటుడిగా అరవింద్ కృష్ణ నిలిచారు. మూడో నంబర్ జెర్సీ ధరించి కోర్ట్‌లో అడుగు పెట్టారు. గత ఏడాది మోకాలి గాయంతో బాధ పడిన అరవింద్ ఈ సారి మరింత శక్తివంతంగా తిరిగి వచ్చారు. అరవింద్ తన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నారు.
అరవింద్ కృష్ట ప్రస్తుతం నటిస్తున్న ‘ఏ మాస్టర్ పీస్’ సినిమాని కూడా NBA ఇండియా అధికారిక స్పాట్‌లైట్ ప్రశంసించింది. అరవింద్‌ను పొగిడే క్రమంలో ఏ మాస్టర్ పీస్ అని కూడా అభివర్ణించారు. అరవింద్ కోర్టులో ఉన్న కమాండింగ్ ఉనికిని చూసి ఆర్గనైజర్స్ ఇలా ఏ మాస్టర్ పీస్ అని అతడ్ని కవిత్వాత్మకంగా ప్రశంసించారు. NBA నుండి ప్రేరణ పొందిన ఆ పసివాడు.. ఇప్పుడు ఏ మాస్టర్ పీస్ అంటూ సూపర్ హీరోగా తెరపైకి రాబోతోన్నారు.
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్…
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్‌టైన్‌మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…
శ్రోతలను ఉర్రుతలూగిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలి గీతం ‘దేఖ్లేంగే సాలా’ 24 గంటల్లోనే 29.6 మిలియన్లకు పైగా వీక్షణలతో…