‘తెల్ల కాగితం’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ మీద కృష్ణ కొమ్మలపాటి నిర్మాణంలో హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా నటిస్తున్న ‘తెల్ల కాగితం’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ మీద కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తున్న చిత్రానికి ‘తెల్ల కాగితం’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ మూవీకి రమేష్ బండ్రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ‘కోర్ట్’, ‘బ్యాండ్ మేళం’ వంటి విజయాల తరువాత హర్ష్ రోషన్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అప్డేట్, టైటిల్, ఫస్ట్ లుక్‌ను తాజాగా రిలీజ్ చేశారు. యూత్ ఫుల్ ఎమోషనల్ లవ్ స్టోరీగా ఈ మూవీ రాబోతోందని టైటిల్, ఫస్ట్ లుక్‌ని చూస్తేనే తెలుస్తోంది.

పోస్టర్‌లో హీరో హీరోయిన్లు కనిపిస్తున్న, చుట్టూ ఉన్న విజువల్స్ చూస్తే ఇదొక అందమైన ప్రేమ కథా చిత్రమని అర్థం అవుతోంది. ఆహ్లాదకరమైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసి సినిమా మీద అంచనాలు పెంచేశారు. నందు సవిరిగన ఈ చిత్రానికి కథ, కథనాన్ని, మాటల్ని అందించారు. లోతైన భావోద్వేగాలతో ఈ కథను రెడీ చేశారు. రమేష్ బండ్రెడ్డి ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్‌ను సరికొత్తగా మలిచి ప్రేక్షకులకు ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను ఇవ్వాలని దర్శకుడు ప్రయత్నిస్తున్నారు.

సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రఫర్ కె.వి. గుహన్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. అద్భుతమైన తారాగణంతో, గొప్ప సాంకేతిక బృందం ఆధ్వర్యంలో అందమైన ప్రేమ కథగా ‘తెల్ల కాగితం’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

నటీనటులు: హర్ష్ రోషన్, నక్షత్ర తదితరులు

సాంకేతిక బృందం:

బ్యానర్: అరుణాచల క్రియేషన్స్
దర్శకత్వం: రమేష్ బండ్రెడ్డి
నిర్మాత: కృష్ణ కొమ్మలపాటి
కథ, స్క్రీన్‌ప్లే & సంభాషణలు : నందు సవిరిగన
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: K. V. గుహన్
సంగీతం: విజయ్ బుల్గానిన్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్
ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవి సూర్నెడ్డి
కొరియోగ్రఫీ: ఈశ్వర్ పెంటి
కో-డైరెక్టర్: రమేష్ బోనం
PRO: వంశీ కాకా
మార్కెటింగ్: వాల్స్ అండ్ ట్రెండ్స్
పబ్లిసిటీ డిజైనర్: దివా పెద్దవీటి

TFJA

Recent Posts

‘పొలిమేర 3’ నుంచి యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ‘విరావి’ ఫస్ట్ లుక్ విడుదలతెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్న ‘పొలిమేర 3..!

మిస్టిక్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలో ప్రేక్షకులను ఆకట్టుకున్న 'పొలిమేర' సిరీస్ నుంచి మూడో చిత్రంగా వస్తున్న 'పొలిమేర 3'పై అంచనాలు పెరుగుతున్నాయి.…

5 hours ago

మళ్లీ విద్యార్థినిగా మారిన మంచు లక్ష్మి! హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో ఏం నేర్చుకుంటున్నారు?

మంచు లక్ష్మిని అర్థం చేసుకున్నామనుకునేలోపే, ఆమె మరో కొత్త ఆశ్చర్యానికి తెరతీస్తారు! ఇటీవల ఆమె సోషల్ మీడియాలో కొన్ని ఆసక్తికరమైన…

6 hours ago

‘ఆలోచన’ సినిమా ఈనెల 27న విడుదల..!

పి.ఎస్.జె. ఫిలిమ్స్ అండ్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో సురేందర్ చాచా తెరకెక్కించిన చిత్రం…

6 hours ago

సుమ చిత్ర ఆర్ట్స్ సమర్పణలో సుమయా రెడ్డి నుంచి రాబోతోన్న ప్రొడక్షన్ నెం. 2.. త్వరలోనే టైటిల్ అనౌన్స్మెంట్..!

సుమ చిత్ర ఆర్ట్స్ సమర్పణలో సుమయా రెడ్డి స్వీయ నిర్మాణంలో నటిస్తున్న రెండో ప్రాజెక్ట్‌ని త్వరలోనే ప్రకటించనున్నారు. ‘డియర్ ఉమ’…

6 hours ago

ఆది సాయి కుమార్ ‘ఈగో రాజా’ నుంచి ‘రౌడీ రాకాసి’ అంటూ సాగే లవ్ సాంగ్ రిలీజ్

‘శంబాల’ బ్లాక్ బస్టర్ తర్వాత ఆది సాయికుమార్ డిఫరెంట్ సబ్జెక్ట్‌లతో ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ‘ఈగో రాజా’…

6 hours ago

దీపావళి సందర్భంగా కార్తీక్ జయంతి ‘రాయవలస’ నుంచి పవర్ ఫుల్ పోస్టర్..!

రేసన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపి కృష్ణ జయంతి నిర్మించిన ‘రాయవలస’ చిత్రానికి రాధిక జయంతి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో…

12 hours ago