మైథాలజీ ఇప్పుడు సక్సెస్ ఫుల్ ట్రెండ్ గా మారింది. పురాణాలు, ఇతిహాసాలు, దైవిక అంశాలతో కూడిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతున్నాయి. ఈ ట్రెండ్ పాన్ ఇండియా స్థాయిలో ప్రతి చిత్ర పరిశ్రమలోనూ కనిపిస్తోంది. కార్తికేయ 2, హనుమాన్, కాంతార, ఓ మై గాడ్ సినిమాలు మైథాలజీ, దేవుడి నేపథ్యంతో ఘన విజయాలు అందుకున్నాయి. రీసెంట్ గా మహాభారత ఇతిహాసాన్ని, అందులోని పాత్రలను బ్యాక్ డ్రాప్ గా తీసుకున్న ప్రభాస్ కల్కి 2898 ఎడి సినిమా కూడా గ్లోబల్ గా బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తోంది.
ఇదే క్రమంలో అరిషడ్వర్గాలు, శ్రీకృష్ణుడి గొప్పతనం వంటి అంశాలతో తెరకెక్కిన ‘అరి’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అరిషడ్వార్గాలను కాన్సెప్ట్ గా తీసుకుని ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద సినిమా రాలేదు. దీంతో ‘అరి’ సినిమాపై అందరిలో ఆసక్తి ఏర్పడుతోంది. మైథాలజీ బ్యాక్ డ్రాప్ సూపర్ హిట్ సినిమాల్లాగే ‘అరి’ మూవీ మీద భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ చిత్రాన్ని ఆర్ వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్నారు. ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనేది ఉపశీర్షిక. వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. “పేపర్ బాయ్” చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన జయశంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ‘అరి’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ‘అరి’ మూవీలో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ భాగస్వామి కానుంది. ‘అరి’ సినిమా హిందీ రీమేక్ పై బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది
నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరోయిన్ కీర్తి సురేశ్ టైటిల్ రోల్ లో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'రివాల్వర్ రీటా'.…
ప్రేమమూర్తి అయిన ఓ తల్లి తన జీవిత గమనంలో ఎలాంటి భావోద్యేగాలకు గురైంది అన్న ఇతివృత్తంతో "తల్లి మనసు" చిత్రాన్ని…
The highly anticipated film Thandel, starring Yuva Samrat Naga Chaitanya and directed by Chandoo Mondeti,…
‘హుషారు, సినిమా చూపిస్త మావ, మేం వయసుకు వచ్చాం, ప్రేమ ఇష్క్ కాదల్, పాగల్’ వంటి యూత్ ఫుల్ చిత్రాలను…
Bekkam Venu Gopal, the renowned producer behind youth-centric hits like Hushaaru, Cinema Choopistha Mava, Prema…
రావుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్ పతాకంపై ఏఐ ఎంటర్ టైన్ మెంట్స్ కలయికలో నిర్మించిన చిత్రం "ఆదిపర్వం".…