కార్తికేయ 2 చిత్రంతో నేషనల్ రేంజ్ పాపులారిటీని సంపాదించుకున్న హీరో నిఖిల్ ప్రస్తుతం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అంటూ ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు. స్వామి రారా, కేశవ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత సుధీర్ వర్మ, నిఖిల్ కాంబోలో రాబోతున్న సినిమా కావటంతో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ చిత్రంలో కన్నడ క్రేజీ హీరోయిన్ అయిన రుక్మిణి వసంత్ హీరోయిన్ నటించారు. మరో బ్యూటీ డాల్ దివ్యాంశ కౌశిక్ కీలక పాత్రలో నటించగా.. హర్ష చెముడు ముఖ్య పాత్రను పోషించారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యానర్‌పై ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన సీనియర్ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. యోగేష్ సుధాకర్, సునీల్ షా, రాజా సుబ్రమణ్యం ఈ సినిమాకు కో ప్రొడ్యూసర్స్. బాపినీడు.బి ఈ చిత్రానికి సమర్పణ. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ మెలోడియస్ గీతాన్ని యూనిట్ విడుదల చేసింది.
కార్తీక్ స్వరపరిచిన ఈ బాణీకి కృష్ణ చైతన్య సాహిత్యాన్ని అందించారు. కార్తీక్, నిత్యశ్రీల గాత్రంలో ఈ పాట ఎంతో వినసొంపుగా శ్రోతలకు హాయినిచ్చేలా ఉంది. హీరో హీరోయిన్ మధ్య ప్రేమ, కెమిస్ట్రీని తెలిపేలా ఈ పాట సాగింది. మనోహరమైన సాహిత్యం హృద్యమైన ట్యూన్‌ని కలిగి ఉన్న ఈ మెలోడీతో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ప్రేమలో పడతారనిపిస్తోంది.
సింగర్ కార్తీక్ ఈ చిత్రానికి సంగీతాన్ని.. సన్నీ ఎం.ఆర్ బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందిస్తున్నారు. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. ఈ ఏడాది దీపావళి సందర్భంగా నవంబర్ 8న ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ చిత్రం గ్రాండ్ రిలీజ్ అవుతుంది.
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…