ది ఇండియా హౌస్’ షూటింగ్‌లో జాయిన్ అయిన టైమ్‌లెస్ టైటాన్ అనుపమ్ ఖేర్

Must Read

ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2,  టైగర్ నాగేశ్వరరావు వంటి ప్రశంసలు పొందిన చిత్రాలతో సహా, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మించిన ప్రముఖ ప్రాజెక్ట్‌లలో టైమ్‌లెస్ టైటాన్ అనుపమ్ ఖేర్ కొలాబరేట్ అయ్యారు. ఈ సక్సెస్ ఫుల్ కొలాబరేషన్ ని కొనసాగిస్తూ, అనుపమ్ ఖేర్, అభిషేక్ అగర్వాల్ లేటెస్ట్ ప్రొడక్షన్ ‘ది ఇండియా హౌస్‌’లో ముఖ్యమైన పాత్రను పోషించబోతున్నారు. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా,  రామ్ వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి  గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, విక్రమ్ రెడ్డి V మెగా పిక్చర్స్ ప్రొడక్షన్ పార్ట్నర్స్.


ది ఇండియా హౌస్ ప్రొడక్షన్ ఇటీవలే హంపి హిస్టారికల్ బ్యాక్ డ్రాప్లో అఫీషియల్ గా ప్రారంభమైంది. షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో ప్రఖ్యాత నటుడు అనుపమ్ ఖేర్ స్టార్ కాస్ట్ లో చేరారు. అనుపమ్ ఖేర్ సెట్‌లోకి ఎంటరవ్వడం టీంకు న్యూ డైనమిక్ ఎనర్జీని తీసుకువచ్చింది. ఆయన ప్రాజెక్ట్స్ లోకి రావడం క్రియేటివ్ స్పిరిట్, ప్రొడక్షన్ మూమెంటమ్ కి దోహదపడుతోంది.

మేకర్స్ విడుదల చేసిన వీడియో అభిషేక్ అగర్వాల్, అనుపమ్ ఖేర్ మధ్య పరస్పర అభిమానాన్ని చూపిస్తుంది. ఇందులో ఆయన చాలా క్రూషియల్ రోల్ లో నటిస్తున్నారు. వీడియోలో అనుపమ్ ఖేర్ లుక్ పూర్తిగా రివీల్ చేయనప్పటికీ, సూటు, పంచెలో కళ్లద్దాలు పెట్టుకుని కనిపించడం క్యురియాసిటీని పెంచింది.

1905 బ్యాక్ డ్రాప్ లో లవ్, రెవెల్యుషన్ థీం ని ఎక్స్ ఫ్లోర్ చేసే ఈ పీరియడ్ మూవీలో సాయి మంజ్రేకర్ హీరోయిన్

ఈ సినిమాకి టాప్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. కెమరూన్ బ్రైసన్ డీవోపీ కాగా, విశాల్ అబానీ ప్రొడక్షన్ డిజైనర్.

నటీనటులు: నిఖిల్ సిద్ధార్థ్, సాయి మంజ్రేకర్, అనుపమ్ ఖేర్  

సాంకేతిక సిబ్బంది:
ప్రెజెంటర్: రామ్ చరణ్
నిర్మాతలు: అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, విక్రమ్ రెడ్డి  
రచన, దర్శకత్వం: రామ్ వంశీకృష్ణ
బ్యానర్స్: అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వి మెగా పిక్చర్స్
సహ నిర్మాత: మయాంక్ సింఘానియా
డీవోపీ: కామెరాన్ బ్రైసన్
ప్రొడక్షన్ డిజైనర్: విశాల్ అబానీ
కాస్ట్యూమ్ డిజైనర్: రజిని
పీఆర్వో: వంశీ శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

Latest News

Sandeep Reddy Vanga to watch Saiyaara on first day, Ahaan Panday & Aneet Padda react: ‘This means the world…’

Director Sandeep Reddy Vanga is eager to watch Saiyaara. The Yash Raj Films is produced movie and directed by...

More News