‘అన్నీ మంచి శకునములే’ చిత్రం ఓ మంచి బహుమతి:

Must Read

అన్నీ మంచి శకునములే‘ చిత్రం ప్రేక్షకులకు మర్చిపోలేని ఓ మంచి బహుమతి: గౌతమి  

ప్రముఖ నిర్మాణ సంస్థ స్వప్న సినిమా నిర్మాణంలో టాలెంటెడ్ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రలలో రూపొందిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్  ‘అన్నీ మంచి శకునములే‘. మిత్ర విందా మూవీస్‌ తో కలిసి ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమా పై అంచనాలని పెంచింది. మే 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ హీరోయిన్ గౌతమి విలేకరుల సమావేశంలో ‘అన్నీ మంచి శకునములే‘ విశేషాలని పంచుకున్నారు.

ఇది మీకు సెకండ్ ఇన్నింగ్ ఆ.. థర్డ్ ఇన్నింగ్ ఆ?
ఎలా అయినా అనుకోవచ్చు. ఇన్నింగ్ ఉండటమే సంతోషం.(నవ్వుతూ)

ఇప్పటికీ షూటింగ్, సినిమాని ఎంజాయ్ చేయగలుగుతున్నారా ?
ఎంజాయ్ చేయగలుగుతున్నాను కాబట్టే ఇంకా చేయగలుగుతున్నాను. ఈ విషయంలో సంతోషపడుతున్నాను.. ఒక రకంగా గర్వపడుతున్నాడు. సినిమా నా ఫస్ట్ లవ్ అనే అనొచ్చు. సినిమా అనేది ఎండ్ లెస్. నటిగా కాకుండా సినిమాకి సంబధించిన చాలా విభాగాల్లో పని చేశాను. కానీ ఇప్పటికీ అదే ఎక్సయిట్ మెంట్. నేర్చుకోవడానికి చాలా వుంది. ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్ ఇంకా ఆసక్తికరంగా వుంది. యంగ్ స్టర్స్ చాలా ఇంపాక్ట్ ఫుల్ సినిమాలు చేస్తున్నారు.

అన్నీ మంచి శకునములే లో మీ పాత్ర ఎలా వుంటుంది ?
ఇందులో నా పాత్ర పేరు మీనాక్షి. చాలా లవ్లీ క్యారెక్టర్. ఒక డ్రీమ్ మదర్, వైఫ్, ఫ్రెండ్ ఎలా వుండాలని వుంటుందో మీనాక్షి పాత్ర  అలా వుంటుంది. తను ఫ్యామిలీని అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తుంది. ఇందులో ముఖ్యంగా చెప్పాల్సింది.. నా కెరీర్ ప్రారంభంలో రాజేంద్రప్రసాద్ గారి తో నటించాను. మళ్ళీ ఇప్పుడు అదే జోడి లో చేయడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆయన ఇప్పటికీ తను ఉండే సన్నివేశం పై, అందులో కనిపించే నటీనటులపై ఎంతో ప్రత్యేక శ్రద్ధ వహించడం నాకు చాలా ముచ్చటేసింది. నిజంగా అలాంటి అంకితభావం కావాలి.  

నరేష్ గారు, షావుకారు జానకీ, ఊర్వశి గారు ఇలా అందరూ కలిసి నటించడం ఎలా అనిపించింది ?
చాలా సంతోషంగా వుంది. అంత మంది మంచి నటులని నందిని గారు, స్వప్న గారు ఎలా ఒక్క దగ్గరకు చేర్చారో నాకు తెలీదు కానీ నిజంగా అద్భుతం. ప్రేక్షకులకు మర్చిపోలేని బహుమతి.

ఇందులో మీ ప్రయాణం ఎలా మొదలైయింది ?
స్వప్నగారు ఫోన్ చేశారు. ”గౌతమి గారు ఇందులో ఒక పాత్ర వుంది. మీరు తప్ప ఎవరూ కనిపించడం లేదు. ఒకసారి వింటారా ?’ అని అడిగారు. విన్నాను. చాలా నచ్చింది. అలా జర్నీ మొదలైయింది.  

ఈ చిత్రంలో మహిళా దర్శకురాలు,  మహిళా నిర్మాత.. అంతా ఫిమేల్ డామినేషన్ కనిపిస్తుంది కదా ?


మంచిదే కదండీ(నవ్వుతూ). అయితే నేను ఎప్పుడూ జెండర్ ని బట్టి ప్రతిభ, సామర్థ్యాన్ని జడ్జ్ చేయను. ఒక లక్ష్యం వుంటే దాని కోసం ఎవరైనా ప్రయత్నించాల్సిందే. ఈ విషయంలో అయితే అద్భుతమైన ప్రొడ్యూసర్, అద్భుతమైన డైరెక్టర్. నందిని రెడ్డి గోల్డెన్ హార్ట్ డైరెక్టర్. తను ఎప్పుడూ ప్రశాంతంగా వుంటుంది. స్వయం నియంత్రణ వున్న దర్శకురాలు. స్వప్నగారు విషయానికి వస్తే ఒక గొప్ప నిర్మాతకు ఉండాల్సిన లక్షణాలన్నీ తనలో కనిపించాయి. నేను ఎక్కడో చెన్నైలో వుంటే వెదికి పట్టుకొని మరి కథని ఆ పాత్రని చెప్పించారు. ఒక దర్శకుడి విజన్ కి తగ్గట్టు పని చేసి, వారికి ఏం సమకూర్చాలో తెలిసిన నిర్మాత. ప్రియాంక, స్వప్న ఇద్దరూ వండర్ ఫుల్ ప్రోడ్యుసర్స్. ఈ విషయంలో అశ్వినీదత్ గారికి నిజంగా హ్యాట్సప్. ఇద్దరు పిల్లల్ని ఎంతో చక్కగా ప్రోత్సహించి ఇంత గొప్ప స్థితికి తీసుకొచ్చారు.

టీజర్ లో కొబ్బరి నీళ్ళు సీన్ చాలా బ్యూటిఫుల్ గా వుంది.. అలాంటి సీన్స్ ఇంకా వుంటాయా ?
మీరు స్క్రీన్ పై చూడాల్సిందే. నందిని గారు ఒకొక్క పాత్రని చాలా బ్యూటిఫుల్ గా తీర్చిదిద్దారు. సినిమా చూసినప్పుడు ప్రేక్షకుల మనసులో ఒక హాయి వుంటుంది. వెన్నెల కిషోర్ టైమింగ్ చాలా బావుంటుంది. అలాగే ఈ సినిమాలో అందరూ కూడా మంచి టైమింగ్ వున్న నటులే. ఇంత మంచి టాలెంట్ తో పని చేసినప్పుడు మన స్థానం మనం నిలబెట్టుకోవాలంటే చాలా ఎలర్ట్ గా వుండాలి. అది ఎక్సయిటింగా అనిపించింది.

కొత్త సినిమాలు గురించి ?
బోయపాటి గారి సినిమా చేస్తున్నాను. అలాగే ఒక వెబ్ సిరీస్ పూర్తయింది. అలాగే మరో అమెజాన్ వెబ్ సిరీస్ చేస్తున్నాను. ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ వున్నాయి.

మీ ప్రాజెక్ట్స్ చూస్తుంటే.. వచ్చిన గ్యాప్ ని ఫిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని అనుకోవచ్చా ?
నేను వర్క్ హాలిక్. ఏదో పని ఉండాల్సిందే. ఇన్నాళ్ల తర్వాత కూడా ఇలాంటి మంచి పాత్రలు వెతుక్కుంటూ రావడం ఒక గౌరవంగా భావిస్తున్నాను.

మీ అమ్మాయికి నటనపై ఆసక్తి ఉందా ?
మా అమ్మాయి ఫిల్మ్ మేకింగ్ చదువుతోంది. తనకు కెమెరా వెనుక ఉండటం ఇష్టం.

ఆల్ ది బెస్ట్
థాంక్స్

Latest News

తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌

సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్‌ హస్పటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఈ రోజు (బుధవారం) పరామర్శించారు. శ్రీతేజ్‌ యోగా...

More News