జూలై 19న అంజలి ప్రధాన పాత్రలో ZEE 5, పిక్సెల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్స్‌పై రూపొందిన వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’ స్ట్రీమింగ్

Must Read

యాబైకి పైగా చిత్రాల్లో హీరోయిన్‌గా, విలక్షణ పాత్రల్లో మెప్పించిన నటి అంజలి. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో ZEE 5, పిక్సెల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్స్‌పై రూపొందుతోన్న వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’. ముఖేష్ ప్రజాపతి ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. విలేజ్ రివేంజ్ డ్రామా జోనర్‌లో రూపొందుతోన్న ఈ సిరీస్‌లో 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈ వెబ్ సిరీస్ జూలై 19 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ క్రమంలో మీడియాతో ‘బహిష్కరణ’ యూనిట్ ముచ్చటించింది. హీరోయిన్ అంజలి, దర్శక, నిర్మాతలు చెప్పిన విశేషాలివే..

పిక్సెల్ పిక్చర్స్ ప్రై. లి. అధినేత, నిర్మాత ప్రశాంతి మలిశెట్టి.. ‘జీ5తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. జీ5తో మాకు లోకల్ కథలను గ్లోబల్ వైడ్‌గా చెప్పగలమనే నమ్మకం ఏర్పడింది. అంజలి ఇది వరకెన్నడూ చేయనటువంటి, పోషించనటువంటి పాత్రలో కనిపిస్తారు.మా దర్శకుడు ముఖేష్ ప్రజాపతి, అసాధారణమైన కథతో, ఎంతో లోతైన ఎమోషన్స్‌తో మరెంతో ఉద్వేగభరితమైన వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. పిక్సెల్ పిక్చర్స్‌లో కంటెంట్ కింగ్.. కాంటెక్స్ట్ గాడ్ అని నమ్ముతాం. మన సమాజంలోని వాస్తవికతలను, పరిస్థితులను ప్రతిబింబించేలా ఈ సిరీస్ ఉండనుంది. ZEE5 వంటి జాతీయ ప్లాట్‌ఫాంలలో ప్రాంతీయ కంటెంట్‌లకు ప్రాధాన్యత పెరిగింది. మా సిరీస్‌ దేశ వ్యాప్తంగా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నామ’ అని అన్నారు.

అంజలి మాట్లాడుతూ.. ‘పుష్ప పాత్ర పోషించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇప్పటికీ నేను నమ్మలేకపోతోన్నాను. కానీ ఈ పాత్రను చేయడంతో నాకు సంతృప్తి కలిగింది. ఒక అమాయకపు వేశ్య నుంచి.. అన్ని అసమానతలను ఎదుర్కొనేందుకు శక్తి, ధైర్యాన్ని కూడగట్టుకునే స్త్రీ ప్రయాణం ఇందులో అద్భుతంగా ఉంటుంది. పుష్ప అంటే ఓ మిస్టరీ. ZEE5 ప్రేక్షకులు ఆమె చేసిన ప్రయాణం, ఆమెలో వచ్చిన మార్పుని చూడాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

దర్శకుడు ముఖేష్ ప్రజాపతి మాట్లాడుతూ.. ‘బహిష్కరణలో అద్భుతమైన, శక్తివంతమైన కథ, కథనాలున్నాయి. అందులోని ప్రతీ పాత్ర, ఆ ఎమోషన్స్ ఎంతో సంక్లిష్టంగా, లోతుగా ఉంటాయి. పుష్ప పాత్ర.. కోల్పోవడానికి ఏమీ లేని, జీవితమంటేనే ఇంత అన్యాయంగా ఉంటుందని భావింస్తుంటుంది. అయితే అలా సముద్రంలా ప్రశాంతంగా ఉండే వ్యక్తి జోలికి పోతే వినాశనం ఎలా ఎదురువుతుందో చూపించాం. పుష్ప పాత్రలో అనేక లేయర్స్ ఉంటాయి.. ఎన్ని కష్టాలు వచ్చినా, ఏం జరిగినా కూడా ధైర్యంగా అడుగు ముందుకు వేసి ప్రతీకారాన్ని తీర్చుకుంటుంది. అంజలి తన అసాధారణమైన నటనతో పుష్ప పాత్రకు ప్రాణం పోశారు. ZEE5, Pixel Picturesతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. నటీనటులంతా కూడా అంకితభావంతో పని చేశారు. ఆర్టిస్టులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. దేశ వ్యాప్తంగా ఉన్న ఆడియెన్స్‌ను “బహిష్కరణ” ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నామ’ అని అన్నారు.

నటీనటులు:

అంజలి, రవీంద్ర విజయ్, శ్రీతేజ్, అనన్య నాగళ్ల, షణ్ముక్, చైతన్య సాగిరాజు, మహ్మద్ బాషా, బేబీ చైత్ర తదితరులు

సాంకేతిక వర్గం:

నిర్మాణ సంస్థ: పిక్సెల్ పిక్చర్స్ ఇండియా, నిర్మాత: ప్రశాంతి మలిశెట్టి, రైటర్ – డైరెక్టర్ : ముఖేష్ ప్రజాపతి, డైరెక్టర్ ఆఫ్ సినిమాటోగ్రఫీ: ప్రసన్న కుమార్, సంగీతం : సిద్ధార్ద్ సదాశివుని, ఎడిటర్ : రవితేజ గిరిజాల, కాస్ట్యూమ్ డిజైనర్ : అనూష పుంజాల, ఆర్ట్ డైరెక్టర్ : ప్రియం క్రాంతి, కో – రైటర్ : వంశీ కృష్ణ పొడపటి, డైలాగ్ రైటర్ : శ్యామ్ చెన్ను, కో- డైరెక్టర్ : రమేష్ బోనం, అసోసియేట్ డైరెక్టర్: ఆదిత్య ఆకురాతి, పి.ఆర్.ఒ: బియాండ్ మీడియా (నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి).

Latest News

Hombale Films and Prabhas Sign Landmark A New Era For Indian Cinema

Hombale Films and Prabhas all set to join forces for three mega films, set to redefine entertainment on the...

More News