దుబాయ్‌లోని గ్లోబల్ విలేజ్‌లో యానిమల్ ‘అర్జన్ వైలీ’ సాంగ్

Must Read

మోస్ట్ అవైటెడ్ మూవీ ‘యానిమల్’ స్టార్ కాస్ట్ దుబాయ్‌లోని ఐకానిక్ గ్లోబల్ విలేజ్‌లో సందడి చేసింది. రణబీర్ కపూర్, బాబీ డియోల్ సమక్షంలో ‘అర్జన్ వైలీ’ పాట గ్లోబల్ విలేజ్‌ వేదికగా గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.

‘అర్జన్ వైలీ’ పాటతో గ్లోబల్ విలేజ్‌ మార్మోగింది. డ్యాన్సర్‌లు, పెద్ద ఎత్తుకున్న హాజరైన అభిమానులతో ఈ వేడుక కన్నుల పండగగా జరిగింది.  

‘అర్జన్ వైలీ’ పాటకు స్టార్ కాస్ట్, అభిమానుల చేసిన డ్యాన్స్ వైరల్ గా మారింది. అభిమానులు సెల్ఫీలు తీసుకుంటూ, అద్భుతమైన స్టార్ కాస్ట్ ఇంటరాక్షన్ తో ఈ వేడుక అట్టహాసంగా సాగింది. గ్లోబల్ విలేజ్‌లో జరిగిన పాట ఆవిష్కరణ స్టార్ పవర్, మ్యూజికల్ మ్యాజిక్ ని మిళితం చేసింది.

యానిమల్ లో రణబీర్ కపూర్ తో పాటు బాబీ డియోల్, రష్మిక మందన్న, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భూషణ్ కుమార్, కృష్ణ కుమార్ టి-సిరీస్, మురాద్ ఖేతాని సినీ1 స్టూడియోస్, ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ యానిమల్‌ చిత్రాన్ని నిర్మించాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. ప్రేక్షకులకు గొప్ప థ్రిల్ రైడ్ ని అందించే ఈ క్రైమ్ డ్రామా డిసెంబర్ 1, 2023న  గ్రాండ్ గా విడుదల కానుంది.

Latest News

వి.వి.వినాయక్ చేతుల మీదుగా “బరాబర్ ప్రేమిస్తా” మూవీ టీజర్ రిలీజ్

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా "బరాబర్ ప్రేమిస్తా ". ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను కాకర్ల సత్యనారాయణ...

More News