యంగ్ అండ్ ప్రామెసింగ్ హీరో శ్రీవిష్ణు, వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘సామజవరగమన’. అనిల్ సుంకర సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్ పై ఎకె ఎంటర్ టైన్‌మెంట్స్ తో కలిసి రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి ఫన్ టాస్టిక్ బ్లాక్ బస్టర్ విజయాన్నిఅందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో నిర్మాత అనిల్ సుంకర సామజవరగమన సక్సెస్ తో పాటు తమ నిర్మాణంలో రాబోతున్న చిత్రాల విశేషాలని విలేకరుల సమావేశంలో పంచుకున్నారు.
సామజవరగమన విజయాన్ని ముందే ఊహించారా ?
‘సామజవరగమన’ విజయం పై ముందు నుంచి నమ్మకం వుంది. చాలా మంచి స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్ ని నా దగ్గరకి పంపించిన సందీప్ కి థాంక్స్ చెప్పాలి. కథ చెప్పినపుడే చాలా నచ్చింది. ఈ సినిమాకి మొదటి నుంచి అన్నీ పక్కాగా ప్లాన్ ప్రకారం జరిగింది.
ఈ కథకు శ్రీ విష్ణు యాప్ట్. చాలా అద్భుతంగా నటించారు. చాలా ఇంప్రొవైజ్ చేశాడు. ఇలాంటి కథ మరోసారి చేయాలంటే.. నా ఫస్ట్ ఛాయిస్ శ్రీవిష్ణునే.
అలాగే నరేష్ గారి పాత్ర కూడా హిలేరియస్. కథ చెప్పిన వెంటనే ఆ పాత్రకు నరేష్ గారే యాప్ట్ అని భావించాం. ఆయన డేట్స్ కోసం రెండు నెలలు ఆగాం.
ప్రిమియర్స్ ఈ సినిమాకి ఎంతవరకు కలిసొచ్చాయి ?
ప్రిమియర్స్ ఈ సినిమాకి ప్లస్ అయ్యాయి. ముందు రోజు నైజాంలో ఇరవై షోలు పడ్డాయి. పది లక్షల షేర్ వచ్చింది. ఇది ఖచ్చితంగా మంచి విజయం. ప్రిమియర్స్ వలన మరింత నమ్మకం పెరిగింది. సామజవరగమన విజయం చాలా తృప్తిని ఇచ్చింది. ఇదే కాంబినేషన్ లో మళ్ళీ సినిమా వుంటుంది. అలాగే సామజవరగమన ని తమిళంలో రీమేక్ చేయాలనే ఆలోచన వుంది.
భోళా శంకర్ ఎలా ఉండబోతుంది ?
భోళా శంకర్ కూడా ఫ్యామిలీ మూవీ. చిరంజీవి గారికి యాప్ట్ మూవీ. చిరంజీవి గారు, కీర్తి సురేష్ గారి కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. సినిమా పెద్ద విజయం సాధిస్తుందని చాలా నమ్మకంగా వున్నాం. ఆగస్ట్ 11న సినిమా రిలీజ్ అవుతుంది.
చిరంజీవి గారితో పని చేయడం ఎలా అనిపించింది ?
చిరంజీవి గారితో వర్క్ చేయడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్. ఆయనతో కూర్చున్నప్పుడు ఎలాంటి ఒత్తిడి వుండదు. చాలా రిలాక్స్ గా వుంటుంది. ఆయనతో పని చేయడాన్ని చాలా ఎంజాయ్ చేశాను.
ఏజెంట్ సినిమా విడుదల తర్వాత మీరు చేసిన ‘బౌండ్ స్క్రిప్ట్’ ట్వీట్ కారణం ?
ఏజెంట్ విషయంలో అందరిది తప్పు వుంది. కొన్ని కారణాల వలన బౌండ్ స్క్రిప్ట్ తో వెళ్ళలేకపోయాం. ఈ విషయంలో ఎవరినీ నిందించకూడదు. నేను, సురేంద్ రెడ్డి ఈ సినిమాతో ఒక హీరోని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్తామని అనుకుని మొదలుపెట్టాం. కానీ మేము ఆశించిన ఫలితం రాలేదు. నిర్మాతగా ఈ ఫలితానికి భాద్యత వహిస్తాను.
నిర్మాతగా పెద్ద, చిన్న సినిమాలు చేస్తున్నారు.. పెద్ద సినిమా భారీ రిలీజ్ ఉంటున్నాయి.. చిన్న సినిమాలు నాన్ థియేటర్ పై ఆధారపడే పరిస్థితి వుంది. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి ?
పెద్ద సినిమాలు కాంబినేషన్ ఈక్వేషన్ లో వెళ్తాయి. చిన్న సినిమాల్లో ఒక రిస్క్ వుంటుంది. ఐతే సబ్జెక్ట్ బావుంటే వర్క్ అవుట్ అవుతాయి. హిడింబ అనే సినిమా చేశాం. టేబుల్ ప్రాఫిట్ మూవీ. ఒక్క ట్రైలర్ తో అందరినీ ఆకర్షించింది. ఒక చిన్న సినిమాకి టేబుల్ ఫ్రాఫిట్ రావడం అంత సులువు కాదు. సబ్జెక్ట్ బావుంటేనే ఇలా జరుగుతుంది. ‘ఊరు పేరు భైరవ కోన’ కంటెంట్ కూడా యూనిక్ గా వుంటుంది.
రిరిలీజ్ సినిమా సినిమాలు కూడా కొత్త సినిమాకి పోటిగా మారాయి కదా దాన్ని ఎలా చూస్తారు ?
రిరిలీజ్ సినిమాల ట్రెండ్ మంచిదే. ఏ నిర్మాతకు డబ్బులు వచ్చిన అది ఇండస్ట్రీ వచ్చినట్లే. రేపు మా సినిమా కూడా రిరిలీజ్ కి రావచ్చు. అది అందరికీ మంచిదే కదా.
మీకు సినిమాతో పాటు ఇతర వ్యాపారాలు కూడా వున్నాయి కదా ? ఇందులో ఏది ఎక్కువ తృప్తిని ఇస్తుంది ?
సినిమాలో ఒక భిన్నమైన తృప్తి వుంటుంది. ఒక విజయవంతమైన చిత్రాన్ని అందించి ప్రేక్షకులకు కూడా ఆనందాన్ని కలిగించడం ఒక ప్రత్యేకమైన తృప్తిని ఇస్తుంది.
ఆల్ ది బెస్ట్
థాంక్స్
-మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేసిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, కరుణ కుమార్, వైర ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్స్ 'మట్కా'…
The cult blockbuster Baby, produced by Cult Producer SKN under the banner of Mass Movie…
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కేఎన్…
Young hero Kiran Abbavaram's latest film, KA, is creating a sensation at the box office,…
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లెటెస్ట్ మూవీ "క" బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీపావళి విన్నర్ గా…
నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి, సిస్టర్ నిఖిత రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ ద్వారా గ్రాండ్…