‘మ్యూజిక్ షాప్ మూర్తి’ నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన లిరికల్ వీడియో విడుదల

Must Read

ప్రస్తుతం కంటెంట్ ప్రధానంగా తెరకెక్కించే చిత్రాలను ఆడియెన్స్ ఆధరిస్తున్నారు. అలా ఓ కంటెంట్ బేస్డ్ మూవీనే ఇప్పుడు రాబోతుంది. ఫ్లై హై సినిమాస్ బ్యానర్ మీద అజయ్ ఘోష్, చాందినీ చౌదరిలు ప్రధాన పాత్రల్లో ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ అనే కాన్సెప్ట్ , కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాను హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మించారు. శివ పాలడుగు ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించారు. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, పాటలు, టీజర్‌ ఇలా అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. త్వరలోనే ఈ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. ఈ క్రమంలో ఈ చిత్రం నుంచి ‘అంగ్రేజీ బీట్’ అంటూ అదిరిపోయే బీటున్న పాటను విడుదల చేశారు.

అంగ్రేజీ బీట్ అంటూ సాగే ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. ఇక ఈ లిరికల్ వీడియోలో డీజే మూర్తిగా అజయ్ ఘోష్ ఆహార్యం, వేసిన స్టెప్పులు, కనిపించిన తీరు అందరినీ ఆకట్టుకునేలా ఉంది. పవన్ లిరిక్స్, బాణీలు ఈ పాటను ప్రత్యేకంగా మార్చేశాయి.మంచి హుషారైన బీటుతో ప్రస్తుతం ఈ పాట అందరినీ ఆకట్టుకునేలా ఉంది.

Angrezi Beat Lyrical | Music Shop Murthy | Ajay Ghosh,Chandini Chowdary| Rahul Sipligunj | Pavan

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. వచ్చే నెలలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

నటీనటులు : అజయ్ ఘోష్, చాందిని చౌదరి, ఆమని, అమిత్ శర్మ, భాను చందర్, దయానంద్ రెడ్డి తదితరులు

సాంకేతిక బృందం
బ్యానర్: ఫ్లై హై సినిమాస్
నిర్మాతలు: హర్ష గారపాటి & రంగారావు గారపాటి
సహ నిర్మాతలు: సత్య కిషోర్ బచ్చు, వంశీ ప్రసాద్ రాజా వాసిరెడ్డి, సత్యనారాయణ పాలడుగు
రచన & దర్శకత్వం: శివ పాలడుగు
సంగీతం: పవన్
కెమెరామెన్: శ్రీనివాస్ బెజుగం
ఎడిటర్: బొంతల నాగేశ్వరరెడ్డి
పీఆర్వో: ఎస్ ఆర్ ప్రమోషన్స్ (సాయి సతీష్)

Latest News

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ థియేట‌ర్స్‌లో సంద‌డి చేస్తోన్న‌సినిమా ధనుష్, కృతి...

More News