సింబా’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో అనసూయ

Must Read

‘ప్రపంచంలో ఎయిర్ పొల్యూషన్ వల్ల 65 శాతం మంది చనిపోతున్నారు.. అంటే దమ్ము, మందు కంటే.. దుమ్ము వల చనిపోయేది పాతిక రెట్లు ఎక్కువ’.. ‘వస్తువులు మనతో మాత్రమే ఉంటాయి.. కానీ మొక్కలు మనతోనే ఉంటాయి..మనతో పాటు పెరుగుతాయి.. మన తరువాత కూడా ఉంటాయి’.. అంటూ అద్భుతమైన డైలాగ్స్‌తో సాగిన సింబా ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. అనసూయ, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సింబా’. సంపత్ నంది టీం వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద సంపత్ నంది, దాసరి రాజేందర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. సంపత్ నంది అందించిన ఈ కథకు మురళీ మనోహర్ దర్శకత్వం వహించారు. బుధవారం నాడు ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..

అనసూయ మాట్లాడుతూ.. ‘వృక్షో రక్షతి రక్షితః అనే కాన్సెప్ట్ అందరికీ తెలిసిందే. ప్రస్తుతం పర్యావరణాన్ని మనం ఎలా పాడు చేస్తున్నామో.. దానికి ఎలాంటి పర్యవసనాలను చూస్తున్నామో అందరికీ తెలిసిందే. సింబా చాలా మంచి కాన్సెప్ట్‌తో రాబోతోంది. సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్‌తో రాబోతోంది. అందరికీ నచ్చేలా ఈ చిత్రం ఉంటుంది. కబీర్, శ్రీనాథ్, వశిష్ట, దివి అద్భుతంగా నటించారు. జగపతి బాబు గారు ఈ చిత్రానికి ప్రధాన బలం. ఈ సినిమా ఒక్కరికి నచ్చినా కూడా ఒక్కరిలోనూ మార్పు తెచ్చినా ఎంతో మార్పు వస్తుంది. ఇంత మంచి చిత్రంలో నాకు ఛాన్స్ రావడం, ఇంత మంది టాలెంటెడ్ పర్సన్‌తో పని చేయడం ఆనందంగా ఉంది.

మురళీ మనోహర్ మాట్లాడుతూ.. ‘నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన సంపత్ నంది, రాజేందర్ గారికి థాంక్స్. నేను సంపత్ నంది గారితో ఎన్నో ఏళ్ల నుంచి ఉంటున్నాను. నన్ను దర్శకుడిగా ఆయనే లాంచ్ చేస్తానన్నారు. ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే ఆయనే అందించారు. నేను దర్శకత్వం వహించాను. ఈ చిత్రంలో నటించిన ప్రతీ ఒక్క ఆర్టిస్ట్‌కు థాంక్స్. అందరి సహకారంతోనే సినిమాను పూర్తి చేయగలిగాను. నాకు అద్భుతమైన టెక్నికల్ టీం దొరికింది. అందరూ అద్భుతమైన అవుట్ పుట్ ఇచ్చారు. మా సినిమా ఆగస్ట్ 9న రాబోతోంది. ఇది సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్. ఇంత వరకు ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి కాన్సెప్ట్ రాలేదు. అందరికీ ఈ సినిమా నచ్చుతుందని భావిస్తున్నాను’ అని అన్నారు.

నిర్మాత దాసరి రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘సంపత్ నంది గారు చెప్పిన పాయింట్ నాకు చాలా నచ్చింది. మా ఇద్దరిదీ ఒకే ఊరు. ఆయన చెప్పిన కథ నచ్చడంతో ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకొచ్చాం. జగపతి బాబు గారు కథ నచ్చడంతో ఓకే అన్నారు. అనసూయ గారు ఎంతో బిజీగా ఉన్నారు. అయినా మా సినిమాను ఓకే చేశారు. సినిమాలో నటించిన నటీనటులందరికీ థాంక్స్. కృష్ణ సౌరభ్ ప్రాణం పెట్టి మ్యూజిక్ ఇచ్చారు. మురళీ గారు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. సినిమాకు పని చేసిన టెక్నీషియన్లందరికీ థాంక్స్. లవ్ స్టోరీస్‌తో సినిమాలు వస్తూనే ఉంటాయి. మా సినిమాకు కథే హీరో. ప్రతీ కారెక్టర్ హీరోలానే ఉంటుంది. ప్రకృతిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ముందు తరాల గురించి ఆలోచించండి. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంటుంది. ఆగస్ట్ 9న రాబోతోన్న మా చిత్రాన్ని అందరూ థియేటర్లో చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.

దివి మాట్లాడుతూ.. ‘సింబా చిత్రంలో మంచి సందేశం ఉంది. మేం ప్రాణం పెట్టి సినిమాను చేశాం. నాకు ఇంత మంచి చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ఆగస్ట్ 9న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

వశిష్ట మాట్లాడుతూ.. ‘సింబా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు వచ్చిన వారందరికీ థాంక్స్. మొక్కలు నాటాలి, చెట్లు పెంచాలని చిన్నప్పటి నుంచీ చెబుతూనే ఉన్నారు. కానీ ఆచరణలోకి తీసుకు రావడం లేదు. ఇలాంటి పాయింట్‌తో సినిమా రావడం ఆనందంగా ఉంది. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ఈ చిత్రంలో నటించినందుకు గర్వంగా ఉంది. ఇందులో మంచి పాయింట్, కాన్సెప్ట్ ఉంది. ఆగస్ట్ 9న మా చిత్రం రాబోతోంది. అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

కేతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘మా వరలక్ష్మీ కాలేజ్‌లోనే షూటింగ్ జరిగింది. షూటింగ్ జరిగినన్ని రోజులు టీంతోనే ఉన్నాను. నేను కూడా ఈ చిత్రంలో కనిపిస్తాను. సమిష్టి కృషితో ఈ సినిమాను ఇంత బాగా తీశారు. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ కృష్ణ సౌరభ్ మాట్లాడుతూ.. ‘సింబా చిత్రానికి గానూ నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ఈ చిత్రం చాలా కొత్తగా ఉండబోతోంది. చాలా మంచి సినిమా కాబోతోంది. ఇలాంటి కాన్సెప్ట్‌తో అరుదుగా చిత్రాలు వస్తుంటాయి. ఈ సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది’ అని అన్నారు.

కెమెరామెన్ కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘నాకు ఈ అవకాశం ఇచ్చిన సంపత్ నంది, మురళీ, రాజేందర్ గారెకి థాంక్స్. నాకు సపోర్ట్ చేసిన టీంకు థాంక్స్. ఈ చిత్రం గురించి నేను చెప్పడం కంటే.. ఆడియెన్స్ చూసి తెలుసుకుంటే బాగుంటుంది’ అని అన్నారు.

ప్రొడక్షన్ డిజైనర్ రాజీవ్ మాట్లాడుతూ..‘ఈ సినిమా కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. ఆగస్ట్ 9న మా చిత్రం రాబోతోంది. చాలా ఆనందంగా ఉంది. నాకు సపోర్ట్‌గా నిలిచిన టీంకు థాంక్స్’ అని అన్నారు.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News