టాలీవుడ్

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ లాంచ్ చేసిన సోల్ ఫుల్ లవ్ మెలోడీ ‘అల్లో నేరేడల్లో పిల్లా’ సాంగ్

వెర్సటైల్ యాక్టర్ బ్రహ్మాజీ లీడ్ రోల్ లో ఒకరిగా ఆమని, బలగం సుధాకర్ రెడ్డి, ధన్య బాలకృష్ణ, మణి ఏగుర్ల, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్న డార్క్ కామెడీ-డ్రామా ‘బాపు’. ఈ చిత్రానికి దయా దర్శకత్వం వహిస్తున్నారు. కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై రాజు, సిహెచ్‌ భాను ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇటివలే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా మేకర్స్ బాపు మ్యూజికల్ జర్నీ కిక్ స్టార్ట్ చేశారు. యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ‘అల్లో నేరేడల్లో పిల్లా’ సాంగ్ ని లాంచ్ చేశారు.

ఈ సందర్భంగా హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘అల్లో నేరేడల్లో పిల్లా’ సాంగ్ కంపోజిషన్ బ్యూటీఫుల్ అండ్ క్యాచి గా వుంది. రామన్న వాయిస్ ఈ సాంగ్ కి పర్ఫెక్ట్. లిరిక్స్ బ్యూటీఫుల్ గా వున్నాయి. మణి లుక్ చాలా బావుంది. ఈ సినిమా మరో బలగం కావాలని కోరుకుంటున్నాను. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ అన్నారు

మ్యూజిక్ డైరెక్టర్ ధృవన్ ఈ పాటని సోల్ ఫుల్ లవ్ మెలోడీగా కంపోజ్ చేశారు. సెన్సేషనల్ సింగర్ రామ్ మిర్యాల తన ఎనర్జిటిక్ వోకల్స్ తో కట్టిపడేశారు. రఘు రాం రాసిన లిరిక్స్ క్యాచి గా వున్నాయి. ఈ సాంగ్ లో లీడ్ పెయిర్ కెమిస్ట్రీ బ్యూటీఫుల్ గా వుంది. ఈ సాంగ్ ఇన్స్టంట్ హిట్ గా నిలిచింది.

బాపు నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో ఓ వ్యవసాయ కుటుంబం ఎమోషనల్ జర్నీగా వుంటుంది. ఓ కుటుంబ సభ్యుడు ఇతరుల మనుగడ కోసం తమ జీవితాన్ని త్యాగం చేయవలసి వచ్చినప్పుడు ఫ్యామిలీ డైనమిక్స్ ఎలా మారుతుందో డార్క్ కామెడీ, హ్యుమర్, ఎమోషనల్ గా హత్తుకునే నెరేటివ్ తో సినిమా ఉండబోతోంది.

ఈ చిత్రానికి వాసు పెండెం డీవోపీగా పని చేస్తున్నారు. RR ధృవన్ మ్యూజిక్ అందిస్తున్నారు. అనిల్ ఆలయం ఎడిటర్.

నటీనటులు: బ్రహ్మాజీ, ఆమని, అవసరాల శ్రీనివాస్, బలగం సుధాకర్ రెడ్డి, ధన్య బాలకృష్ణ, మణి ఎగుర్ల, రాచ రవి, గంగవ్వ

బ్యానర్: కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్
నిర్మాతలు: రాజు, సిహెచ్. భాను ప్రసాద్ రెడ్డి
రచన, దర్శకత్వం: దయా
సంగీతం: RR ధ్రువన్
సినిమాటోగ్రఫీ: వాసు పెండెం
ఎడిటింగ్: అనిల్ ఆలయం
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీపాల్ మాచర్ల
లిరిక్స్: శ్యామ్ కాసర్ల
కాస్ట్యూమ్ డిజైనర్: మైథిలి సీత
పీఆర్వో: వంశీ-శేఖర్
పబ్లిసిటీ డిజైన్: వివేక్ రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: భరత్ రెడ్డి

Tfja Team

Recent Posts

సూపర్ హిట్ సాంగ్స్ తో సంతృప్తికరంగా నా కెరీర్ సాగుతోంది – కేకే

గీత రచయితగా తన ప్రస్థానం చాలా సంతృప్తికరంగా సాగుతోందని అన్నారు ప్రముఖ లిరిసిస్ట్ కేకే(కృష్ణకాంత్). గతేడాది రాసిన పాటలన్నీ ఛాట్…

12 hours ago

My Career with Super Hit Songs Famous Lyricist KK

Famous lyricist KK (Krishnakanth) shared that his journey as a lyricist has been progressing very…

12 hours ago

విడుదలకు సిద్దంగా ఉన్న ఆదిత్య ఓం ‘బంధీ’

ప్రేక్షకులు ప్రస్తుతం రెగ్యులర్ కమర్షియల్ యాక్షన్ చిత్రాల కంటే కాన్సెప్ట్, కంటెంట్ బేస్డ్ చిత్రాలనే ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో…

12 hours ago

Aditya Om’s Bandi Set For Theatrical Release Soon

Versatile actor Aditya Om’s upcoming film Bandi which is inspired by the urgent and timely…

12 hours ago

డైలాగ్ కింగ్ సాయి కుమార్ 50 ఏళ్ల ప్రస్థానం.. ఎన్నో అవార్డులు, ఎన్నెన్నో రివార్డులు

సాయి కుమార్ అంటే అందరికీ నాలుగు సింహాల డైలాగ్ గుర్తుకు వస్తుంది. పోలీస్ స్టోరీ సినిమాతో ఇండియన్ సినిమా హిస్టరీలో…

12 hours ago

Sai Kumar’s 50-year Journey With Numerous Awards

When we think of Sai Kumar, the iconic "4 Simhalu" dialogue instantly comes to mind.…

12 hours ago