సూపర్ హిట్ సాంగ్స్ తో సంతృప్తికరంగా నా కెరీర్ సాగుతోంది – కేకే

గీత రచయితగా తన ప్రస్థానం చాలా సంతృప్తికరంగా సాగుతోందని అన్నారు ప్రముఖ లిరిసిస్ట్ కేకే(కృష్ణకాంత్). గతేడాది రాసిన పాటలన్నీ ఛాట్ బస్టర్స్ కావడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ డబ్బింగ్ మూవీస్ కు మ్యూజిక్ లవర్స్ ను మెప్పించే పాటలు రాసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. రీసెంట్ ఇంటర్వ్యూలో లిరిసిస్ట్ గా తన అనుభవాలను పాత్రికేయులతో పంచుకున్నారు కేకే.

  • గీత రచయితగా చాలా సంతృప్తిగా ఉన్నాను. గతేడాది నాకు అద్భుతంగా గడిచింది. మంచి పాటలు రాసే అవకాశం వచ్చింది. నేను ఉద్యోగం వదులుకుని పాటల రచయితగా పేరు తెచ్చుకోవాలని వచ్చిన లక్ష్యం నేరవేరిందినే సంతృప్తి కలుగుతోంది. నేను లాస్ట్ ఇయర్ రాసిన పాటలు, డబ్బింగ్ సినిమా పాటలతో సహా ఛాట్ బస్టర్స్ అయ్యాయి. మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుని వైరల్ గా మారాయి.
  • ఇటీవల పాన్ ఇండియా మూవీస్ కు ఎక్కువగా పాటలు రాస్తున్నాను. పాన్ ఇండియా మూవీస్ కు పాటలు రాయడం నాపై ఒత్తిడి పెంచడం లేదు. సలార్, రాధే శ్యామ్ లాంటి పాన్ ఇండియా మూవీస్ కు పాటలు రాసినప్పుడు తెలుగులో రాసిన పాటను, ఇంగ్లీష్ లోకి ట్రాన్స్ లేట్ చేసి దాన్ని ఇతర భాషల లిరిక్ రైటర్స్ కు పంపాలి. వాళ్లు అది చూసి వాళ్ల వెర్షన్ లో రాస్తారు. పాన్ ఇండియా మూవీస్ వల్ల ఇదొక్కటే అదనపు వర్క్ అవుతోంది.
  • ఒక సినిమాకు పాటలు రాయడానికి కథ మొత్తం తెలిస్తే రైటర్ కు అడ్వాంటేజ్ ఉంటుంది. నేను సింగిల్ కార్డ్ రాసిన సినిమాలు పడి పడి లేచె మనసు, సీతారామం(ఐదు పాటలు), సలార్, రాధే శ్యామ్ పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. సింగిల్ కార్డ్ రాసిన చిత్రాలన్నీ నాకు లిరిక్ రైటర్ గా మంచి సంతృప్తిని అందించాయి. కేవలం పాట సందర్భం మాత్రమే కాకుండా కథ మొత్తం తెలియడం వల్ల ముందు పాటలో రాసిన పదాలను అవాయిడ్ చేసే అవకాశం లభిస్తుంది.
  • గతేడాది నేను రాసిన పాటల్లో హాయ్ నాన్న మూవీలోని అడిగా పాట బాగా సంతృప్తిని ఇచ్చింది. సినిమాతో పాటు వివిధ మ్యూజిక్ కన్సర్ట్స్ ద్వారా ఈ పాట శ్రోతలకు బాగా చేరువయ్యింది. ఓం బీమ్ భుష్ లోని అణువణువు పాట బాగా వైరల్ అయ్యింది. అలాగే డబ్బింగ్ మూవీ ఏఆర్ఎం లోని అంబరాల వీధిలోని పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. జనక అయితే గనక సినిమాలో నా ఫేవరేట్టు నా పెళ్లామే పాట కూడా బాగా హిట్టయ్యింది. ఇలా నేను రాసిన పాటల్లో 90శాతం సక్సెస్ అవుతుండటం సంతోషంగా ఉంది. రజినీకాంత్ వేట్టయాన్, శివకార్తికేయన్ అమరన్ సినిమాలకు రాసిన పాటలకు మంచి పేరొచ్చింది.
  • స్ట్రైట్ పాట రాసేప్పుడు మనకు కావాల్సినంత స్వేచ్ఛ ఉంటుంది. డబ్బింగ్ వెర్షన్ రాసేప్పుడు ఆ భాషలో వాడిన పదాలకు సరిపోయే తెలుగు పదాలను ఎంచుకుని రాయాల్సివస్తుంది. స్ట్రైట్ సాంగ్ తో చూస్తే డబ్బింగ్ సాంగ్ రాయడం కష్టం. న్యూ ఇయర్ లో స్క్రిప్ట్ రైటర్ గా ప్రయత్నిస్తున్నాను. ప్రశాంత్ వర్మ పీవీసీయూలో అధీర అనే మూవీకి డైలాగ్స్ ఇస్తున్నాను. పాటల బిజీలో డైలాగ్స్ వైపు ఇంతకాలం వెళ్లలేదు. ఇప్పుడు పాటలు, మాటలకు టైమ్ కేటాయించుకుంటున్నాను. దర్శకత్వ ఆలోచన ఉంది. కానీ ప్రస్తుతం రైటింగ్ పైనే దృష్టి పెట్టాను.
  • ప్రభాస్, హను రాఘవపూడి గారి సినిమా లో రెండు సాంగ్స్ కు వర్క్ స్టార్ట్ చేశాం. హను గారి గత చిత్రాల్లో లవ్ స్టోరీస్ చూశాం. కానీ ప్రభాస్ హను గారి కాంబో మూవీలో హ్యూజ్ యాక్షన్, డ్రామా ఉంటూ ఒక హాలీవుడ్ మూవీ చూసిన అనుభూతిని కలిగిస్తుంది. ఈ సినిమా ఒక పీరియాడిక్ మూవీ. 1940 దశకంలో సాగే పేట్రియాటిక్ కథతో ఉంటుంది.
  • ఇప్పుడు ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ పాటలో హుక్ లైన్ ఉండాలని కోరుకుంటున్నారు. ఆ ఒత్తిడి లిరిక్ రైటర్స్ అందరిపై ఉంది. అయితే హుక్ లైన్ ట్రెండ్ అన్ని పాటలకు సరికాదనేది నా అభిప్రాయం. నేను వర్క్ చేసే ప్రతి టెక్నీషియన్ ఎంతో సపోర్టివ్ గా ఉంటున్నారు.
  • సాటి గీత రచయితలు నాతో స్నేహంగా ఉంటారు. నేను మంచి పాట రాసినప్పుడు చంద్రబోస్ గారు ఫోన్ చేసి మాట్లాడుతారు. గతంలో సినిమా కథలు సాధారణ ప్రేక్షకుడు తనతో తాను పోల్చుకునేలా ఉండేవి. అందుకే ఆ సినిమాల్లో పాటలు చిరకాలం గుర్తుండిపోయాయి. ఇప్పుడలాంటి కథలు రావడం లేదు. ఎప్పుడైనా అవకాశం దొరికితే అది నిలుపుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నాను.
  • ప్రభాస్ -హను మూవీ , రాజా సాబ్, రామ్ పోతినేని సినిమా కి , విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి వీడీ 12 తదితర చిత్రాలకు ప్రస్తుతం పాటలు రాస్తున్నాను. మరికొన్ని ప్రాజెక్ట్స్ డిస్కషన్స్ జరుగుతున్నాయి.
Tfja Team

Recent Posts

‘మా రాముడు అందరివాడు’ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా : సీనియర్ నటులు సుమన్

v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా ‌‌: హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…

3 days ago

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

4 days ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

2 weeks ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

2 weeks ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

2 weeks ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

2 weeks ago