ప్రతినిధి 2 థియేట్రికల్ రైట్స్ ను సొంతం చేసుకున్న అమోఘా ఎంటర్‌టైన్‌మెంట్స్

Must Read

హీరో నారా రోహిత్ ‘ప్రతినిధి 2’చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహించిన ఈ చిత్రం, వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్ బ్యానర్‌లపై కుమార్ రజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్‌ కు అద్భుతమైన స్పందన వచ్చింది. నారా రోహిత్ తన ఇంటెన్స్ నటనతో  ఆశ్చర్యపరిచారు. మూర్తి రచన, దర్శకత్వంకు మంచి ప్రశంసలు వచ్చాయి.

తాజాగా ‘ప్రతినిధి 2’ థియేట్రికల్ రైట్స్ ను డిస్ట్రిబ్యుషన్, ప్రొడక్షన్ సంస్థ అమోఘా ఎంటర్‌టైన్‌మెంట్స్ సొంతం చేసుకుంది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం  ఏప్రిల్ 25నప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ‘ప్రతినిధి’ 10 సంవత్సరాల క్రితం 2014లో ఇదే తేదీన విడుదల కావడం విశేషం.

‘ప్రతినిధి 2’ … ప్రతినిధి సిరీస్ నుండి రెండవ ఫ్రాంచైజీ. ఈ సినిమాలో నారా రోహిత్ నిజాయితీ గల న్యూస్ రిపోర్టర్ పాత్రలో కనిపించనున్నారు. సిరీ లెల్లా కథానాయికగా నటిస్తుండగా, దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

నాని చమిడిశెట్టి డీవోపీగా చేస్తుండగా, యంగ్ సెన్సేషన్ మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. రవితేజ గిరిజాల ఎడిటర్, కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్.

తారాగణం: నారా రోహిత్, సిరీ లెల్ల, దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా, సచిన్ ఖేడేకర్, తనికెళ్ల భరణి, ఇంద్రజ, ఉదయ భాను, అజయ్ గోష్, అజయ్, ప్రవీణ్, పృధ్వీ రాజ్, రఘుబాబు, రఘు కారుమంచి

సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: మూర్తి దేవగుప్తపు
నిర్మాతలు: కుమార్‌రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని
బ్యానర్లు: వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్
సంగీతం: మహతి స్వర సాగర్
ఎడిటర్: రవితేజ గిరిజాల
డీవోపీ: నాని చమిడిశెట్టి
ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె
స్టంట్స్: శివరాజు & పృధ్వి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కార్తీక్ పుప్పాల
పబ్లిసిటీ డిజైన్స్: అనిల్ & భాను
పీఆర్వో: వంశీ-శేఖర్
డిజిటల్: ప్రవీణ్ & హౌస్‌ఫుల్ డిజిటల్

Latest News

వి.వి.వినాయక్ చేతుల మీదుగా “బరాబర్ ప్రేమిస్తా” మూవీ టీజర్ రిలీజ్

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా "బరాబర్ ప్రేమిస్తా ". ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను కాకర్ల సత్యనారాయణ...

More News