‘ఉగ్రం’ ఫస్ట్ సింగిల్ దేవేరి మార్చి 19న విడుదల

Must Read

‘నాంది’ చిత్రంతో కమర్షియల్ హిట్ అందించిన అల్లరి నరేష్, విజయ్ కనకమేడల మరో యూనిక్, ఇంటెన్స్ మూవీ ‘ఉగ్రం’ తో వస్తున్నారు. అల్లరి నరేష్‌ని ఫెరోషియస్ పోలీస్‌ గా చూపించిన ఉగ్రం టీజర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఫస్ట్  సింగిల్ దేవేరి ను మార్చి 19న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. వర్షం పడుతుండగా అల్లరి నరేష్ , మిర్నా బైక్‌ పై కూర్చొని  వున్న అనౌన్స్ మెంట్ పోస్టర్‌ ని చూస్తుంటే.. దేవేరి ఒక అందమైన రొమాంటిక్ మెలోడీ అనిపిస్తుంది.

యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ‘ఉగ్రం’ను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. తూమ్ వెంకట్ కథ అందించగా, అబ్బూరి రవి డైలాగ్స్ రాశారు.

సిద్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, చోటా కె ప్రసాద్ ఎడిటర్. బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్.

ఈ ఏడాది వేసవిలో సినిమాను థియేటర్లలో విడుదల కానుంది. 

తారాగణం: అల్లరి నరేష్, మిర్నా

సాంకేతిక విభాగం:

రచన, దర్శకత్వం: విజయ్ కనకమేడల

నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది

బ్యానర్: షైన్ స్క్రీన్స్

కథ: తూమ్ వెంకట్

డైలాగ్స్: అబ్బూరి రవి

డీవోపీ: సిద్

సంగీతం: శ్రీచరణ్ పాకాల

ఎడిటర్: ఛోటా కె ప్రసాద్

ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి

పీఆర్వో: వంశీ-శేఖర్

Latest News

ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక లోకానికి సెల్యూట్ చేస్తూ హీరో తిరువీర్ “భగవంతుడు” మూవీ నుంచి ‘శరణమన్న శరణం’ సాంగ్ రిలీజ్

యంగ్ టాలెంటెడ్ హీరో తిరువీర్ నటిస్తున్న కొత్త సినిమా "భగవంతుడు". ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ నటుడు రిషి ప్రధాన పాత్రలో...

More News