తెలంగాణ గవర్నర్ ‘తమిళిసై’ ను  కలిసిన అలీ..

Must Read

  

టాలీవుడ్‌ ప్రముఖ నటుడు అలీ తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్ ని కలిశారు. ఈ మధ్యే అలీని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎలక్ట్రానిక్‌ మీడియా ముఖ్య సలహాదారుగా నియమించిన సంగతి తెలిసిందే.

అలీ నేడు తెలంగాణ గవర్నర్‌  తమిళిసై గౌరవప్రదంగా కలిసి ముచ్చటించారు. అలీ పెద్దకూతురు ఫాతిమా వివాహం నిశ్చయమైంది. రీసెంట్ గా ఫాతిమా ఎంగేజ్‌మెంట్‌ హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది.

ఈ సందర్భంగా అలీ వివాహ ఆహ్వాన పత్రిక ప్రతిని  గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ కి అందిస్తూ  స్వయంగా వివాహానికి రావాలని  ప్రత్యేకంగా ఆహ్వానించారు. పెళ్లిపత్రిక స్వీకరించిన తమిళిసై కూడా, తప్పకుండా వివాహానికి హాజరు అవుతాను అని అలీకి మాటిచ్చారు.

Latest News

‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ ,క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సినిమా విడుదల

ల‌వ్‌, ఎమోష‌న్, డ్రామా వంటి క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తోపాటు చ‌క్క‌టి సోష‌ల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సినిమా విడుదల వైవిధ్యమైన...

More News