తెలుగు సినిమా ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్. యంగ్ అండ్ డైనమిక్ అఖిల్ అక్కినేని తాజా సినిమాను నిర్మిస్తున్నాయి. అఖిల్ 6ని అక్కినేని నాగార్జున, నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
అక్కినేని అఖిల్ పుట్టినరోజును పురస్కరించుకుని అఖిల్ 6వ చిత్రానికి లెనిన్ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ని ప్రకటించారు. మురళీ కిశోర్ అబ్బూరు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వినరో భాగ్యము విష్ణు కథ చిత్రంతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు మురళీకిశోర్ అబ్బూరు. ఇంటన్స్, యాక్షన్ ప్యాక్డ్ ఎక్స్ పీరియన్స్ తో రాయలసీమ నేపథ్యంలో రోమాలు నిక్కబొడుచుకునేలా సాగింది లెనిన్ గ్లింప్స్.
టైటిల్ గ్లింప్స్ పవర్‌ఫుల్ విజువల్స్‌తో ప్రారంభమయింది. ఆధ్యాత్మిక అంశాలను చొప్పిస్తూ ఆద్యంతం ఆకట్టుకునే ప్రయత్నం చేశారు మేకర్స్. అఖిల్ అక్కినేని… స్టన్నింగ్ లెనిన్ కేరక్టర్‌కి అద్భుతంగా సూట్ అయ్యారు. ఆయన దట్టమైన మీసం, పొడవాటి జుట్టు, మ్యాచో అవతార్‌కి పక్కాగా సూట్ అయ్యాయి. స్ట్రైకింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రేక్షకుల్ని కట్టిపడేశారు అఖిల్. అఖిల్ సరసన శ్రీలీల నటిస్తున్న విషయం గ్లింప్స్ లో రివీల్ అయింది.
టైటిల్ గ్లింప్స్‌లో మాసివ్ యాక్షన్ మొమెంట్స్, పంచ్ మాత్రమే కాదు పవర్‌ఫుల్ డైలాగు కూడా ఆడియన్స్ ని కట్టిపడేసింది.
“పుట్టేటప్పుడు ఊపిరి ఉంటుంది రా, పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు, పేరు మాత్రమే ఉంటుంది“ అని రాయలసీమ స్లాంగ్‌లో అఖిల్ చెప్పిన డైలాగ్ సింపుల్‌గా అదుర్స్ అంతే. సినిమాలో ఎమోషన్ ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్పకనే చెప్పింది. యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్‌కి ఉండాల్సిన పక్కా డైలాగులు ఉన్నాయనే ఫీల్‌ని క్రియేట్ చేసింది.
అఖిల్ రాయలసీమ స్లాంగ్‌ను అద్భుతంగా అర్థం చేసుకుని పట్టుకోగలిగారు. ఆయన వాయిస్ మోడ్యూలేషన్ పర్ఫెక్ట్‌గా సూట్ అయింది. విజువల్స్, టోన్… ప్రతిదీ టైటిల్ గ్లింప్స్ కి బలం చేకూర్చేలా ఉంది.
“ప్రేమ కన్నా ఏ యుద్ధం హింసాత్మకమైనది కాదు“ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. లెనిల్‌లో ప్రేమకున్న ప్రాధాన్యతను సంపూర్ణంగా చెప్పే ట్యాగ్ లైన్ ఇది. రా ఎమోషన్స్ ఎలా ఉండబోతున్నాయో ఉప్పందించేసింది. సినిమాటోగ్రాఫర్ నవీన్ కుమార్ విజువల్స్ కి ప్రత్యేక అభినందనలు అందుతున్నాయి. ఇంటెన్స్ ఉన్న సన్నివేశాలను తమన్ తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో మరో రేంజ్‌కి తీసుకెళ్లారు. ఎడిటర్ నవీన్ నూలీ షార్ప్ కట్స్ ఎలా ఉంటాయో గ్లింప్స్ చెప్పకనే చెప్పేసింది. మురళీ కిశోర్ అబ్బూరు విజన్‌ని ఫ్యాన్స్ కి చేర్చడానికి టెక్నీషియన్లందరూ పర్ఫెక్ట్ గా కుదిరారు. అద్భుతమైన విజువల్స్, ఎక్స్ ట్రార్డినరీ ప్రొడక్షన్ వేల్యూస్ కలగలిసి ఫ్యాన్స్ కి నెవర్ బిఫోర్ విజువల్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడం గ్యారంటీ.
ఒళ్లు గగుర్పొడిచేలా సాగింది లెనిన్ టైటిల్ గ్లింప్స్. పవర్‌ఫుల్ ఎంటర్టైనర్ కి సంబంధించి ప్రతి చిన్న విషయాన్నీ అర్జంటుగా తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ కలిగించింది గ్లింప్స్. లెనిన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామంటున్నారు ప్రొడ్యూసర్లు.
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…