మంచి సినిమాలను ఎప్పుడూ ఆదరించే తెలుగు ఆడియెన్స్ మా సినిమాను ఆదరిస్తారని భావిస్తున్నాం :  హీరో అశోక్ సెల్వన్

Must Read

వెర్సటైల్ యాక్టర్ అశోక్ సెల్వన్ ద్వి (తెలుగు, తమిళం) భాషా చిత్రం ‘ఆకాశం’. ఈ చిత్రం ‘నీదాం ఒరు వానమ్’గా తమిళంలోనూ నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వ‌యాకామ్ 18, రైజ్ ఈస్ట్ బ్యాన‌ర్స్‌పై  ఆర్‌.ఎ.కార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న‌ ఈ చిత్రంలో రీతూ వర్మ, అపర్ణ బాల మురళి, శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్స్‌. ఈ సినిమా పాత్రికేయుల సమావేశంలో సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా…

హీరో అశోక్ సెల్వన్ మాట్లాడుతూ ‘‘నేను ఇంతకు ముందు నిన్నలా నిన్నలా సినిమాతో తెలుగు ప్రేక్షకులు ముందుకు వస్తే నన్నెంతో ఆదరించారు. ఇప్పుడు ఆకాశం సినిమాతో మరోసారి మీ ముందుకు రాబోతున్నాను. ఇదొక మంచి ఫీల్ గుడ్ ఎమోషనల్ మూవీ. దీనికి కూడా తెలుగు ప్రేక్షకులు మంచి ఆదరణ ఇస్తారని భావిస్తున్నాను. మీ ప్రేమాభిమానాలు నాకు ఎప్పటికీ కావాలి. తెలుగు ఇండస్ట్రీ మంచి సినిమాలను ఎప్పుడూ ఆదరిస్తాయి. అలాంటి మంచి కథతో వస్తోన్న సినిమానే ఆకాశం. నేను తమిళంలో చేసిన ఓ మై కడవులే సినిమా చూసి మహేష్ వంటి పెద్ద స్టార్ ట్వీట్ చేసినప్పుడు నాకెంతో స్పెషల్‌గా అనిపించింది. అలాగే ఈ సినిమాకు నానిగారు సపోర్ట్ అందించారు. ఇవన్నీ మంచి సినిమాకు మీరు అందిస్తోన్న సపోర్ట్‌ని తెలియజేస్తుంది. ఈ సందర్భంగా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆకాశం సినిమా దర్శకుడు కార్తీక్, హీరోయిన్స్ రీతూ, ఆపర్ణ, శివాత్మికలతో పాటు ఇతర నటీనటులు, టెక్నీషియన్స్‌కి థాంక్స్. ఈ సినిమా తర్వాత మీరు నన్ను మీలో ఒకడిగా ఆదరిస్తారని భావిస్తున్నాను. టీజర్, ట్రైలర్‌కి చాలా మంచి స్పందన వచ్చింది. రేపు సినిమాను కూడా  ఇదే రీతిలో ఆదరిస్తారనుకుంటున్నాను. ఇదొక విజువల్ ట్రీట్‌టా ఉంటుంది. హండ్రెడ్ పర్సెంట్ మీకు సినిమా నచ్చుతుంది’’ అన్నారు.

దర్శకుడు ఆర్.ఎ.కార్తీక్ మాట్లాడుతూ ‘‘నేను తెలుగు సినిమాతో డైరెక్టర్‌గా డెబ్యూ చేయాలనుకున్నాను. అది ఆకాశం సినిమాతో కుదిరింది. లవ్, ఎమోషన్స్ ఉన్న మంచి ఫీల్ గుడ్ మూవీ ఇది. సినిమా చూస్తే మీరు ప్రేమలో పడతారు. మీ సపోర్ట్  మాకు అవసరం. థాంక్యూ’’ అన్నారు.

హీరోయిన్ శివాత్మిక మాట్లాడుతూ ‘‘ఆకాశం వంటి మంచి ఫీల్ గుడ్ మూవీలో అవకాశం ఇచ్చిన సాగర్‌గారు, కార్తీక్‌గారికి ధన్యవాదాలు. రీతూ కలిసి సినిమా చేయటం ఆనందంగా ఉంది. మంచి ఎక్స్‌పీరియెన్స్. చాలా అందమైన సినిమా. అందరం ఎంతో ఇష్టపడి, కష్టపడి సినిమా చేశాం. లవ్ జర్నీ. థియేటర్‌లో సినిమా చూస్తే విజువల్‌గానే కాకుండా ఎమోషనల్‌గానూ మూవీ మీకు నచ్చుతుంది. అశోక్ సెల్వన్, సాగర్, కార్తీక్‌ సహా అందరినీ తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని భావిస్తున్నాను. మంచి సినిమాను ఆదరించే తెలుగు ప్రేక్షకులు మా సినిమాను సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాం’’ అన్నారు.

సాగర్ మాట్లాడుతూ ‘‘మా నాన్నగారు తెలుగు సినిమాలు చేశారు. అయితే మేం చెన్నైలో సెటిల్ అయ్యాం. ఇప్పుడిప్పుడే మళ్లీ  ఇక్కడ సినిమాలు చేస్తున్నాం. ఈ సినిమా అంతా కార్తీక్ ఎఫర్ట్. తనకే ఈ క్రెడిట్ దక్కుతుంది. తను మంచి డైరెక్టర్. సినిమా చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. నెరేషన్ సమయంలో తను అలాగే సినిమా చేస్తాడా అనిపించింది. కానీ సినిమా చూసిన మా ఎడిటర్ ఫోన్ చేసి ఫస్ట్ టైమ్ డైరెక్టర్ చేసినట్లు అనిపించలేదన్నారు. తర్వాత నేను సినిమా చూసి ఆశ్చర్యపోయాను. అంత బాగా చేశాను. రీతూ వర్మ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శివాత్మిక కూడా అద్భుతంగా నటించింది. అపర్ణ కొత్త వేరియేషన్ ఉన్న పాత్రలో మెప్పిస్తుంది. మేం సినిమా చేస్తున్న సమయంలో స్క్రిప్ట్ నచ్చడంతో వయాకామ్ మాతో కలిశారు. అశోక్ సెల్వన్ బ్రిలియంట్‌గా యాక్ట్ చేశారు. సినిమా నవంబర్ 4న రిలీజ్ అవుతుంది’’ అన్నారు.

రీతూ వర్మ మాట్లాడుతూ ‘‘డైరెక్టర్ కార్తీక్‌కి థాంక్స్. మా నిర్మాతలు మా సాగర్ గారికి థాంక్స్. ఎందుకంటే తను కథను నమ్మి చేసిన సినిమా. అశోక్ సెల్వన్‌తో నిన్నిలా నిన్నిలా తర్వాత కలిసి చేసిన సినిమా. మూడు వేర్వేరు పాత్రల్లో బ్రిలియంట్ పెర్ఫామెన్స్ చేశాడు తను. తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా అశోక్ నటనకు ఫిదా అవుతారు. అపర్ణ, శివాత్మిక నేచురల్ పెర్ఫామర్స్. గోపీ సుందర్ ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు. సినిమాలో భాగమైన అందరికీ ధన్యవాదాలు. సినిమా ప్రేమ గురించే కాదు.. జీవితం గురించి కూడా చెబుతుంది. నవంబర్ 4న మూవీ రిలీజ్ అవుతుంది’’ అన్నారు.

Latest News

ఘ‌నంగా ‘మర్రిచెట్టు కింద మనోళ్ళు’ మూవీ ప్రారంభోత్స‌వం

శ్రీ నారసింహ చిత్రాలయ బ్యానర్‌పై నరేష్ వర్మ ముద్దం దర్శకత్వంలో, ప్రమోద్ దేవా, రణధీర్, కీర్తన స్వర్గం ముస్కాన్ రాజేంద‌ర్ హీరోహీరోయిన్లుగా "మర్రిచెట్టు కింద మనోళ్ళు"...

More News