‘పొట్టేల్’లో చేసిన పటేల్ క్యారెక్టర్ టెర్రిఫిక్ గా వచ్చింది యాక్టర్ అజయ్  

Must Read

యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ లో సాహిత్ మోత్ఖూరి డైరెక్ట్ చేస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘పొట్టేల్’. ఈ చిత్రంలో అజయ్ పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు. నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కు స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేశాయి. శేఖర్ చంద్ర అందించిన సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ‘పొట్టేల్’ అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా యాక్టర్ అజయ్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు. 

‘పొట్టేల్’ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? 

సాహిత్ కథ చెప్పాడు. మొదట నేను చాలా క్యాజువల్ గా విన్నాను. ఒక రెండు గంటల నేరేషన్ తర్వాత ఈ సినిమాలో క్యారెక్టర్ డెఫినెట్ గా చేయాలనిపించింది. నా క్యారెక్టర్ ని చాలా బాగా చేయాలి, లేకపోతే సినిమా పాడైపోతుందనే ఫీలింగ్ ని డైరెక్టర్ కలిగించగలిగారు. కథని ఎంత అద్భుతంగా చెప్పాడో సినిమాని కూడా అంత అద్భుతంగా తెరకెక్కించాడు. 

-ఇది మల్టీ లేయర్ కథ. పాప ఎడ్యుకేషన్ కోసం ఫైట్ చేసే బ్యాక్ డ్రాప్. ఇలాంటి కథలు చెప్పినప్పుడు కొన్నిసార్లు సందేశం ఎక్కువైపోయే అవకాశం వుంది. దీన్ని కమర్షియల్ గా తీసుకురావడం చాలా కష్టం. డైరెక్టర్ సాహిత్ ఈ కథని మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తో చాలా మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా తీర్చిదిద్దాడు. ఇందులో విజిల్స్ పడే సీన్స్ ఉంటాయి. 

ఇందులో మిమ్మల్ని బాగా ఎక్సైట్ చేసిన ఎలిమెంట్ ఏంటి? 

– కథ చాలా నచ్చింది. అదే నన్ను ఈ సినిమా చేయడానికి ఎక్సైట్ చేసింది. తర్వాత నా క్యారెక్టర్ నచ్చింది. నాదే కాదు యువ, అనన్య వీళ్ళ క్యారెక్టర్స్ అన్నీ చాలా అద్భుతంగా కుదిరాయి. 

– స్లాంగ్ విషయంలో సాహిత్ చాలా హోంవర్క్ చేసుకున్నాడు. తన నేటివ్ నిర్మల్. డైలాగ్ రాయడమే స్లాంగ్ లో రాశాడు. అయితే డబ్బింగ్ చెప్పినప్పుడు కొంచెం హార్డ్ అనిపించింది. నా క్యారెక్టర్ కి కొన్ని చాంట్స్ ఉంటాయి. అవి చెప్పడానికి కొంచెం కష్టపడాల్సి వచ్చింది.

విక్రమార్కుడిలో టిట్ల క్యారెక్టర్ తర్వాత పటేల్ క్యారెక్టర్ నచ్చిందని చెప్పడానికి కారణం ?  

-విక్రమార్కుడు తర్వాత అంతా టెర్రిఫిక్ విలన్ వేషాలు తక్కువే వచ్చి ఉంటాయి. అవి కూడా చాలా వరకు రాజమౌళి గారి సినిమాలోనే ఉన్నాయి. టిట్ల లాంటి క్యారెక్టర్స్ రెగ్యులర్ గా రావు. అదొక మ్యాజిక్ లాగా జరిగిపోయింది. తర్వాత నేను కొన్ని క్యారెక్టర్స్ ట్రై చేసాను. కానీ ఆ మ్యాజిక్ కుదరలేదు. ఈ సినిమాలో చేస్తున్న పటేల్ క్యారెక్టర్ లో చాలా షేడ్స్ వున్నాయి. అందుకే చాలా రోజుల తర్వాత నాకు నచ్చిన రోల్ దొరికిందని చెప్పాను. యాక్టర్ గా హ్యాపీనెస్ ఇచ్చిన రోల్ ఇది. 

పటేల్ క్యారెక్టర్ కోసం ఎలాంటి హోంవర్క్ చేశారు? 

-ప్రతి సినిమా యాక్టర్ కి ఒక డిస్కవరీ లానే ఉంటుంది. ఈ సినిమాలో నా వరకు కష్టపడింది కల్చర్ ని ప్రజెంట్ చేయడం కోసం. తెలంగాణలో సిగం అని ఉంటుంది. సిగం అంటే దేవుడు రావడం అంటారు. దానికి ఒక పాటర్న్ ఉంటుంది. అది వచ్చినప్పుడు మాట్లాడే విధానం చాలా భిన్నంగా ఉంటుంది. దానిమీద నేను డైరెక్టర్ కూర్చొని కొంత హోమ్ వర్క్ చేశాం. కొంతమందిని కలిశాం. చాలా ఎఫర్ట్ పెట్టాం. 

మ్యూజిక్ గురించి ? 

శేఖర్ చంద్ర ఎక్స్ ట్రార్డినరీ మ్యూజిక్ ఇచ్చాడు. ఆర్ఆర్ సినిమాలో హైలెట్ గా వుంటుంది. ఒక పెద్ద కాన్వాస్ వున్న సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగిస్తుంది. సినిమా చూశాను కాబట్టే ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నాను. 

 ఈ సినిమాలో మూఢనమ్మకాల గురించి ఉంటుందా? 

-మూఢనమ్మకాలు, మూఢనమ్మకల్ని అడ్డం పెట్టుకుని బతికే మనుషుల గురించి,  మొండితనం గురించి, గ్రామదేవతల గురించి.. ఇలా మల్టీ లేయర్స్ లో ఈ  సినిమా  వుంటుంది.

ఈ సినిమాకి ఇండస్ట్రీ నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి? 

 -కొరటాల శివ గారికి నా వెల్ విషర్ గా ఈ సినిమా చూపించాను. దేవర పనుల్లో బిజీగా ఉండి కూడా ఆయన వచ్చి ఈ సినిమా చూశారు. ఆయనకి చాలా నచ్చింది.  సందీప్ రెడ్డి వంగా గారు చూశారు. ఆయనకీ నచ్చింది. కమర్షియల్ సక్సెస్ తో పాటు అవార్డ్స్ కూడా ఈ సినిమాకు వస్తాయని డైరెక్టర్ తో ఆయన చెప్పారు. 

 యాక్టర్ గా 25 ఇయర్స్  మీ జర్నీని డిఫైన్ చేయాలంటే ? 

-25 ఇయర్స్ కెరీర్ నాట్ ఏ జోక్. 25 ఏళ్లుగా యాక్టర్ గా ఇక్కడ ఉన్నాం. అదే పెద్ద గిఫ్ట్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపు 250 సినిమాలు చేసే పరిస్థితి ఇప్పుడు లేదు. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ తగ్గిపోతున్నాయి. అందరూ సెలెక్టివ్ అయిపోతున్నారు. ఆ రకంగా చూసుకుంటే అదృష్టంగా భావిస్తున్నాను. 

-2024లో దేవర, మత్తువదలరా లాంటి రెండు పెద్ద హిట్లు వచ్చాయి.  నా క్యారెక్టర్ లో కొన్ని మీమ్స్ వైరల్ కూడా అయ్యాయి. అవి నా ఫ్రెండ్స్ సెండ్ చేసినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది.  

యాక్టర్ గా ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని వుంది ?,

-నాకు ఎమోషనల్ రోల్స్ చేయడం బాగా ఇష్టం. నేను ఎమోషన్స్ ని బలంగా చేయగలనని నా పర్శనల్ ఫీలింగ్.  

కొత్తగా చేస్తున్న ప్రాజెక్ట్స్ గురించి? 

అజయ్ దేవగన్ గారితో సింగం చేశాను. పుష్ప 2  ఉంది. అలాగే ఓ రీమేక్ మూవీ జరుగుతోంది. అలాగే తమిళ్, మలయాళం ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. 

Latest News

Nuvvu Gudhithe lyrical song from Drinker Sai

Dharma and Aishwarya Sharma play the lead roles in Drinker Sai, which carries the tagline Brand of Bad Boys....

More News