‘మ్యూజిక్ షాప్ మూర్తి’ టీజర్

Must Read

అజయ్ ఘోష్, చాందినీ చౌదరిలు ప్రముఖ పాత్రలు పోషించిన ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ సినిమాను ఫ్లై హై సినిమాస్ బ్యానర్ మీద హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మించారు. శివ పాలడుగు ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించారు. ఈ మూవీకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ఆల్రెడీ అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను శనివారం నాడు రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన ఈవెంట్‌లో అజయ్ భూపతి ముఖ్య అతిథిగా విచ్చేసి చిత్రయూనిట్‌ను అభినందించారు. అనంతరం చిత్రయూనిట్ మీడియాతో మాట్లాడుతూ..

అజయ్ భూపతి మాట్లాడుతూ.. ‘మ్యూజిక్ షాప్ మూర్తి టీజర్ చాలా బాగుంది. ఈ మధ్య కాలంలో ఓ సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయించడం చాలా కష్టం. టీజర్, ట్రైలర్ బాగుంటే.. సినిమాకు రావాలనే ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది. అలా ఈ మూవీ టీజర్ చాలా బాగుంది.. సినిమాను చూడాలనే కోరిక కలిగేలా.. మళ్లీ మళ్లీ టీజర్ చూడాలనిపించేలా ఉంది. ఈ టీజర్‌ను గమనిస్తుంటే.. న్యూ జనరేషన్ అమ్మాయి.. ఓల్డ్ జనరేషన్ వ్యక్తితో జరిగే ప్రయాణం కనిపిస్తోంది. ఇలా రెండు భిన్న తరాల వ్యక్తులు కలిసి ప్రయాణం చేస్తే ఎన్నో మంచి విషయాలు తెలుస్తాయి. నేను కూడా అలాంటి వ్యక్తులతోనే స్నేహం చేస్తాను. అందుకే నా ఆర్ఎక్స్ 100 మూవీలో డాడీ పాత్ర, మహాసముద్రంలో మామ పాత్ర, మంగళవారంలో అజయ్ ఘోష్ గారి పాత్రను డిజైన్ చేశాను. అజయ్ ఘోష్ గారు కోట శ్రీనివాసరావు గారిలా అంతటి స్థాయికి ఎదిగే సత్తా ఉన్న నటులు. అంతటి స్థాయికి ఎదుగుతారని ఆశిస్తున్నాను. చాందినీ చౌదరి సినిమాలన్నీ నేను చూస్తుంటాను. పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేస్తుంటారు. ఈ మూవీకి సంగీతం బాగుందనిపిస్తోంది. టీజర్‌లో మ్యూజిక్ నాకు చాలా నచ్చింది. ఇలాంటి కథను రాసిన, తీసిన దర్శక నిర్మాతలకు హ్యాట్సాఫ్. ఈ చిత్రాన్ని అందరూ తప్పకుండా చూసి ఆదరించాలి’ అని అన్నారు.

భాను చందర్ మాట్లాడుతూ.. ‘మ్యూజిక్ షాప్ మూర్తి కాన్సెప్ట్, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమా. కమర్షియల్ సినిమాలు ఎప్పుడూ వస్తుంటాయి. కానీ ఇలాంటి సినిమాలను అందరూ ఎంకరేజ్ చేయాలి. ఇది కూడా ఓ కమర్షియల్ మూవీనే. కానీ ఇందులో డిఫరెంట్, మంచి కాన్సెప్ట్ ఉంటుంది. ఇందులో నేను హీరోయిన్ ఫాదర్‌గా నటించాను. ప్రస్తుతం పిల్లలకు, తల్లిదండ్రులకు బాగా గ్యాప్ ఉంది. ఈ మూవీలో అది చక్కగా చూపించారు. చాందినీ చౌదరి చక్కని నటి. ఆమెకు సినిమా పట్ల, నటన పట్ల ఎంతో అంకితభావం ఉంటుంది. అజయ్ ఘోష్ విలక్షణమైన నటుడు. ఇంత మంచి సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.

అజయ్ ఘోష్ మాట్లాడుతూ.. ‘దర్శకుడు శివ కరోనా టైంలో ఈ సినిమా నాతోనే చేయాలని మూడేళ్లు తిరిగాడు. నేను మెయిన్ లీడ్‌గా నటించడం ఏంటి? నా మీద ఎందుకు డబ్బులు పెట్టడం అని శివని అడిగాను. కానీ కథ చెప్పాక.. సెట్స్ మీదకు వచ్చాక ఈ సినిమా గొప్పదనం తెలిసింది. ఇందులో ఒక జీవితం కనిపిస్తుంది. మన జీవితాల్లో మనం ఏమేం కోల్పోయి ఏ స్థితిలో ఉన్నామో చెబుతుంది. తమిళం, మలయాళం, మరాఠీలో మంచి కంటెంట్, కాన్సెప్ట్ సినిమాలు వస్తున్నాయని మన వాళ్లు అంతా చెబుతుంటారు.. కానీ అలాంటి కాన్సెప్ట్ సినిమాలే తెలుగులో వస్తున్నాయి. ఇది కూడా అలాంటి ఓ కాన్సెప్ట్ సినిమానే. ఇందులో నేను హీరో కాదు. కథే హీరో. మేం మా పాత్రలను పోషించామంతే. చాందినీ చౌదరికి నటన పట్ల ఉన్న డెడికేషన్ చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఆమె నటించే తీరు చూసి నేనే పెద్ద గొప్ప నటుడ్ని అనుకునే గర్వం పోయింది. భాను చందర్, ఆమని లాంటి వారితో నటించడం అదృష్టం. దయానంద్ చాలా మంచి నటుడు. మా దర్శకుడు శివ చాలా మంచి కథను రాసుకున్నాడు. ఇది చాలా మంచి చిత్రం అవుతుంది’ అని అన్నారు.

చాందినీ చౌదరి మాట్లాడుతూ.. ‘నేను చేసిన, చేస్తున్న ప్రతీ పనిని, ప్రతీ కారెక్టర్‌ను ఆడియెన్స్ ఇష్టపడుతున్నారు. అందుకే ఇంత దూరం ప్రయాణించగలిగాను. కంటెంట్ ఉంటే.. సినిమాలో కథ ఉంటే.. ఎమోషన్ ఉంటే.. కచ్చితంగా ఆడియెన్స్ సినిమాని చూస్తారు.. హిట్ చేస్తారు.. అదే మొన్న గామి సినిమాతో రుజువైంది. ఆడియెన్స్‌ని ఎప్పుడూ నిరాశపర్చకూడదనే ప్రయత్నిస్తుంటాం. మంచి చిత్రాలను ప్రేక్షకులకు అందివ్వాలని చూస్తుంటాం. మ్యూజిక్ షాప్ మూర్తి అనే సినిమా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి ఎక్కువగా కనెక్ట్ అవుతుంది. అప్పటి తరంలో ఫ్యామిలీ కోసం ఎన్నో ఆశయాలు, లక్ష్యాలు ఇలా అన్నింటిని త్యాగం చేస్తారు. కానీ ఇప్పుడు మాత్రం ఎవరి లక్ష్యం వారిదే.. ఎవరి ప్రపంచం వారిదే అన్నట్టుగా ఉంటారు.. ఇలా భిన్న మనస్తత్వాలున్న రెండు పాత్రల ప్రయాణం అందరినీ ఆకట్టుకుంటుంది. ఇంత మంచి కథను ఇంత మంచి క్వాలిటీతో తీసిన దర్శక నిర్మాతలకు థాంక్స్. విజువల్స్, మ్యూజిక్ బాగుంటాయి. అజయ్ ఘోష్, భాను చందర్ వంటి వారితో నటించడం ఆనందంగా ఉంది. మా సినిమా కచ్చితంగా ప్రేక్షకుల్ని నిరాశపర్చదు’ అని అన్నారు.

నిర్మాత హర్ష గారపాటి మాట్లాడుతూ.. ‘ఓ మంచి సినిమా తీయాలనే ఉద్దేశంతోనే మ్యూజిక్ షాప్ మూర్తి కథను ఎంచుకున్నాం. బడ్జెట్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. మధ్యలో బడ్జెట్ పెరిగింది. కానీ ఓ మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతోనే పూర్తి చేశాం. ఈ సినిమా ప్రేక్షకులందరికీ కనెక్ట్ అవుతుంది. పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నామ’ని అన్నారు.

Music Shop Murthy Telugu Teaser I Ajay Ghosh, Chandini Chowdary I Fly High Cinemas

దర్శకుడు శివ పాలడుగు మాట్లాడుతూ.. ‘మా ఈవెంట్‌కు గెస్టుగా వచ్చిన అజయ్ భూపతి గారికి థాంక్స్. నేను ఈ కథను ముందుగా అజయ్ ఘోష్ గారికే చెప్పాను. నన్ను నమ్మి ఈ కథను ఒప్పుకున్నందుకు థాంక్స్. చాందినీ గారు విలక్షణ నటి. డైలాగ్ ఏంటి? సీన్ ఏంటి? అని అడిగి అర్థం చేసుకుని నటిస్తారు. నన్ను నమ్మి ఈ సినిమాను నిర్మించిన నిర్మాతలకు థాంక్స్. మంచి చిత్రాన్ని తీయాలనే ప్యాషన్‌తో నిర్మించారు. మా టెక్నికల్ టీం లేకపోతే ఇంత క్వాలిటీతో సినిమా వచ్చేది కాదు’ అని అన్నారు.

Latest News

వి.వి.వినాయక్ చేతుల మీదుగా “బరాబర్ ప్రేమిస్తా” మూవీ టీజర్ రిలీజ్

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా "బరాబర్ ప్రేమిస్తా ". ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను కాకర్ల సత్యనారాయణ...

More News