*కార్పొరేట్ ప్రపంచంలో ఇంటర్న్ ఉద్యోగుల ఒడిదొడుకుల తెలియజేసే కథాంశంతో రూపొందిన ఒరిజినల్ ‘అర్థమైందా అరుణ్ కుమార్’… ట్రైలర్ విడుదల చేసిన ‘ఆహా’*
*- జూన్ 30 నుంచి స్ట్రీమింగ్ -*
*- హర్షిత్ రెడ్డి, అనన్య శర్మ, తేజస్వి మడివాడ ప్రధాన తాారాగణం-*
జూన్ 22, హైదరాబాద్: ఇండియాలో నెంబర్ వన్ తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’. జీవితంలో ఏదో సాధించాలనే లక్ష్యంతో ఓ చిన్న పట్టణ ప్రాంతం నుంచి మహా నగరంలోకి ఇంటర్న్‌షిప్ ఉద్యోగిగా అడుగు పెట్టిన అరుణ్ కుమార్ అనే యువకుడి కథ. జర్నీలో తను ఎదుర్కొన్న ఒడిదొడుకులు, వాటి నుంచి తను నేర్చుకున్న పాఠాలు, కొర్పొరేట్ ప్రపంచంలో ఎలా ముందుకు సాగాడనే అంశాలతో రూపొందిన వెబ్ ఒరిజినల్ ‘అర్థమైందా అరుణ్ కుమార్’. జూన్ 30 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్న ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ప్రేక్షకులకు నచ్చేలా, ఆలోచింపచేసేలా ఈ సిరీస్ రూపొందింది. ఓ యువకుడు కార్పొరేట్ ప్రపంచంలో ఇంటర్న్‌గా ప్రయాణం చేసే క్రమంలో తనకు ఎదరయ్యే అనేక అనుభవాలను ఇందులో చూపించే ప్రయత్నం చేశారు. అందులో ప్రేమ, కష్టనష్టాలతో పాటు ఏదో సాధించాలనుకునే ఆ యువకుడు సవాళ్లను ఎదుర్కొని తనదైన స్థానాన్ని ఎలా సంపాదించుకున్నాడనే విషయాలను ఇందులో చక్కగా చూపించారు. ఇన్ని అంశాల మేళవింపుగా రూపొందిన ‘అర్థమైందా అరుణ్ కుమార్’ సిరీస్ జూన్ 30 నుంచి ప్రేక్షకులను మెప్పించనుంది.
అర్రె స్టూడియో, లాఫింగ్ కౌ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై ‘అర్థమైందా అరుణ్ కుమార్’ సిరీస్ రూపొందింది. హర్షిత్ రెడ్డి, అనన్య శర్మ, తేజస్వి మడివాడ తదితరులు తమదైన నటనతో పాత్రలకు ప్రాణం పోశారు. ‘అఫిషియల్ చౌక్యాగిరి’ స్ఫూర్తితో దీన్ని రూపొందించారు. దీని కారణంగా ఈ కార్పొరేట్ డ్రామాలో ఓ కొత్త అనుభూతి కలుగుతుంది.
*ట్రైలర్ లాంచ్ ముఖ్య అతిథి, యాక్టర్ ప్రియదర్శి*, మాట్లాడుతూ ‘‘ఆహాలో ఈ నెల 30 నుంచి స్ట్రీమింగ్ కానున్న ‘అర్థమైందా అరుణ్ కుమార్ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొనటం చాలా ఆనందంగా ఉంది. ఇదొక వైవిధ్యమైన కథాంశం. బయటకు ఎంతో అందంగా కనిపించే కార్పొరేట్ ప్రపంచం ఎలా ఉంటుంది. ఎదో సాధించాలనే లక్ష్యంతో ఎంతో మంది యువకులు ఈ కార్పొరేట్ ప్రపంచంలోకి అడుగు పెడతారు. అయితే వారికి ఎదురయ్యే సవాళ్లు.. వాటిని ఎలా అధిగమించాలనే విషయాలను ఆవిష్కరించారు. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. తప్పకుండా వెబ్ సిరీస్‌పై మరింత ఆసక్తిని పెంచుతుంది” అన్నారు.
ఆహా కంటెంట్, నాన్ సబ్స్ రెవెన్యూ హెడ్ వాసుదేవ్ కొప్పినేని మాట్లాడుతూ ‘‘కార్పొరేట్ ప్రపంచంలో ఉండే ఇబ్బందులను ‘అర్థమైందా అరుణ్ కుమార్’ వెబ్ సిరీస్‌లో చూపించే ప్రయత్నం చేశాం. అరుణ్ కుమార్ అనే యువకుడు తన జీవితంలో ఏదో సాధించాలనే లక్ష్యంతో సిటీలోని కార్పొరేట్ కంపెనీలోకి ఇంటర్న్ ఎంప్లాయ్‌గా జాయిన్ అవుతారు. తన ప్రయాణంలో ఎదుర్కొన్న ఒడిదొడుకులను, సాధించిన ఉన్నతి అన్నింటినీ ఇందులో చూపిస్తున్నాం. ప్రస్తుతం ఉన్న కార్పొరేట్ ప్రపంచంలోని ఉద్యోగులందరూ ఈ కథకు కనెక్ట్ అవుతారు. అంతే కాకుండా వారిని వారి లక్ష్యం వైపు అడుగులు వేసేలా ఈ ఒరిజినల్ ప్రేరేపిస్తుంది’’ అన్నారు.
అర్రె స్టూడియోస్ ప్రతనిధి మాట్లాడుతూ ‘‘మాకెంతో ఇష్టమైన షోస్లో ‘అఫిషియల్ చౌక్యాగిరి’ ఒకటి. ఈ షో మూడు సీజన్స్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దాన్నితెలుగులో అర్థమైందా అరుణ్ కుమార్ పేరుతో రూపొందించంటం చాలా ఆనందంగా ఉంది. రీమేక్ కంటెంట్‌లో కథ, పాత్రలు చాలా బలమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఇతర భాషలోకి మా కంటెంట్ రావటం మాకెంతో ఆనందంగా ఉంది. అహావారితో పాటు లాఫింగ్ కౌ ప్రొడక్షన్స్‌తో కలిసి పని చేయటం ఈ ఫ్రాంచైజీకి ఓ కొత్త ఎనర్జీనిచ్చిందనే చెప్పాలి’’ అన్నారు.
విలక్షణమైన కంటెంట్‌ను అందించటంతో పాటు నాణ్యమైన కంటెంట్‌ను అందించాలనే లక్ష్యంతో డిజిటల్ మాధ్యమంలో ఆహా తిరుగులేని ఎంటర్‌టైన్మెంట్‌ను అందిస్తోంది. తెలుగు ప్రేక్షకులు వైవిధ్యమైన కంటెంట్‌ను కోరుకుంటున్నారు. అలాంటి వారందరికీ ‘అర్థమైందా అరుణ్ కుమార్’ సిరీస్ నచ్చుతుంది. మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ను తెలుగు ప్రేక్షకులకు అందించాలని ఓ మిషన్‌లా ఆహా వారు ప్రయత్నిస్తూ తమ ప్రామిస్‌ను నిలబెట్టుకుంటూ వస్తున్నారు. అలాంటి దానికి ఇదొక ఉదాహరణ అని చెప్పాలి. ఎందుకంటే ఆకర్షణీయంగా ఆకట్టుకునే కథలతో పాటు ఆలోచింప చేసేలా కంటెంట్‌ను అందిస్తూ అంకిత బావంతో ఆహా దూసుకెళ్తోంది.
*‘అర్థమైందా అరుణ్ కుమార్’ సిరీస్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా ఆహాలో మాత్రమే వీక్షించండి. అందులో కథ, పాత్ర, ఇచ్చిన సందేశం ప్రేక్షకులను మెప్పిస్తుంది.*
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…