‘పొన్నియిన్ సెల్వ‌న్ 2’నుంచి ‘ఆగనందేఆగనందే..’పాట విడుదల

Must Read

మణిరత్నం విజువల్ వండర్ ‘పొన్నియిన్ సెల్వ‌న్ 2’  నుంచి ‘ఆగనందే ఆగనందే..’ పాట విడుదల

ప్రియుడి ప్రేమ‌లో చోళ రాజ్య‌పు యువ‌రాణి మైమ‌ర‌చిపోతుంది. అత‌న్ని చూసినా, త‌లుచుకున్నా ముఖంలో చిరున‌వ్వు విచ్చుకుంటుంద‌ని ఆమె త‌న మ‌నసులో ప్రేమ‌ను ‘ఆగనందే ఆగనందే’ అంటూ అందమైన పాట రూపంలో పాడుకుంకుంటుంది. ఆ చోళ రాజ్య‌పు యువ‌రాణి ఎవ‌రో కాదు.. కుంద‌వై , ఆమె ప్రియుడు వ‌ల్ల‌వ‌రాయుడు.  కుంద‌విగా త్రిష‌, వ‌ల్ల‌వ‌రాయుడిగా కార్తి సిల్వ‌ర్ స్క్రీన్‌పై మెప్పించ‌నున్నారు. అస‌లు వారి మ‌ధ్య ప్రేమకు కార‌ణ‌మేంటో తెలుసుకోవాలంటే ‘పొన్నియిన్ సెల్వ‌న్ 2’ సినిమా చూడాల్సిందేనంటున్నారు మ‌ణిరత్నం, సుభాస్క‌ర‌న్‌. 

ఇండియ‌న్ ఏస్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం ఆవిష్క‌రిస్తోన్న విజువ‌ల్ వండ‌ర్ `పొన్నియిన్ సెల్వ‌న్ 2`. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, మ‌ద్రాస్ టాకీస్ బ్యాన‌ర్స్‌పై సుభాస్క‌ర‌న్‌, మ‌ణిర‌త్నం ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. గ‌త ఏడాది సెన్సేష‌న‌ల్ హిట్ అయిన హిస్టారిక‌ల్ మూవీ పొన్నియిన్ సెల్వ‌న్ 1కి కొన‌సాగింపుగా పొన్నియిన్ సెల్వ‌న్ 2 తెర‌కెక్కుతోంది. రెండో భాగంపై హై ఎక్స్‌పెక్టేష‌న్స్ నెల‌కొన్నాయి. ఏప్రిల్ 28న వ‌ర‌ల్డ్ వైడ్‌గా పాన్ ఇండియా మూవీగా తెలుగు, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో `పొన్నియిన్ సెల్వ‌న్ 2` రిలీజ్‌కి స‌న్న‌ద్ధ‌మ‌వుతుంది. 

సోమవారం  ఈ సినిమా నుంచి ‘ఆగనందే ఆగనందే’ అనే పాట‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

ఆస్కార్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ ఈ పాట‌ను కంపోజ్ చేసి అందించారు. ఆనంత్ శ్రీరామ్ రాసిన ఈ పాట‌ను శ‌క్తిశ్రీ గోపాల‌న్ శ్రావ్యంగా ఆల‌పించారు. 

అత్య‌ద్భుత‌మైన కోట‌లు, అంత‌కు మించిన క‌థ‌, క‌థ‌నం, అందులో రాజతంత్రం, ఒక‌రికి ముగ్గురు హీరోలు, స్క్రీన్ నిండుగా హీరోయిన్లు అంటూ వేరే లెవ‌ల్ ఎక్స్‌పెక్టేష‌న్స్‌తో తెర‌కెక్కుతోంది పొన్నియిన్ సెల్వ‌న్‌2. విక్ర‌మ్, జ‌యం ర‌వి, కార్తి, ఐశ్వ‌ర్యారాయ్‌, త్రిష‌, జ‌య‌రామ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఏప్రిల్ 28న వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ పాన్ ఇండియా మూవీ త‌మిళ్‌ తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ అవుతుంది.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News