టాలీవుడ్

పేక మేడలు సినిమా బ్లాక్ బస్టర్ జులై 26న యూఎస్ఏ లో గ్రాండ్ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్ ఎంపవర్మెంట్ ని బేస్ చేసుకున్న సినిమా ఇది. జులై 19న విడుదలై చిన్న సినిమా గా వచ్చి పెద్ద విజయం సాధించింది. ప్రతి ఒక్కరూ సినిమా చూసే విధంగా ప్రీమియర్స్ ని 50 రూపాయలకే ప్రత్యేక షోలు వేసి పేక మేడలు సినిమా వైపు చూసే లాగా చేశారు. ప్రీమియర్ షోస్ నుంచే బ్లాక్ బస్టర్ టాక్ అందుకున్న పేక మేడలు జులై 26 నుంచి నిర్వాణ మూవీస్ డిస్ట్రిబ్యూషన్ తరఫున యూఎస్ఏ లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. 300 పెడితే గాని సినిమా చూడలేని ఈ రోజుల్లో విడుదలైన రోజు నుంచి 100 రూపాయలకే టికెట్ రేట్లు పెట్టి ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేలాగా చేశారు. కలెక్షన్స్ కోసం కాకుండా మంచి సినిమాని ప్రేక్షకులు అందరూ చూడాలని తక్కువ రేటుకే టికెట్ రేట్లు పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఉమెన్ ఎంపవర్మెంట్ ని బేస్ చేసుకున్న సినిమా కాబట్టి ఆడవారు అందరూ ఈ సినిమా చూసే విధంగా ఈ రేట్లు పెట్టినట్టుగా చెబుతున్నారు టీం.

ఈ సందర్భంగా నిర్మాత రాకేష్ వర్రే మాట్లాడుతూ : మొదటి రోజు నుంచి సినిమా ను ఆదరించి ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ₹100 టికెట్ రేట్ పెట్టడం వల్ల ఎక్కువ మంది ప్రేక్షకులు సినిమాని చూడగలిగారు. ఇప్పుడు మా సినిమాని నిర్వాణ మూవీస్ డిస్ట్రిబ్యూషన్ వారు ఈనెల 26 నుంచి యూఎస్ఏ లో రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడ ఆదరించినట్టే యూఎస్ఏ లో ఉన్న తెలుగు ప్రేక్షకులు అందరూ ఈ సినిమాను చూసి సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను అన్నారు.

నటీనటులు :
వినోద్ కిషన్, అనూష కృష్ణ, రితిక శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూష నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్

టెక్నీషియన్స్ :
నిర్మాణం : క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్
నిర్మాత: రాకేష్ వర్రే
రచయిత మరియు దర్శకుడు: నీలగిరి మామిళ్ల
డి ఓ పి: హరిచరణ్ కె.
ఎడిటర్: సృజన అడుసుమిల్లి, హంజా అలీ
సంగీత దర్శకుడు: స్మరణ్ సాయి
లైన్ ప్రొడ్యూసర్: అనూషా బోరా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కేతన్ కుమార్
పి ఆర్ ఓ: మధు VR

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

22 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

5 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

5 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago