అభిషేక్ పిక్చర్స్ ప్రొడక్షన్ నంబర్ 9 ఏప్రిల్ 9న టైటిల్ అనౌన్స్ మెంట్

Must Read

టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒకటైన అభిషేక్ పిక్చర్స్ ఎల్లప్పుడూ ఎక్సయిటింగ్ కాన్సెప్ట్‌లతో ముందుకొస్తుంది. ప్రొడక్షన్ బ్యానర్ వారి ప్రొడక్షన్ నెం. 9ని అనౌన్స్ చేసింది. సినిమా అనౌన్స్ మెంట్ పోస్టర్ అఘోరాలు ఫెరోషియస్ గా నడుస్తున్నట్లు చూపిస్తుంది. పుర్రెలు, అగ్ని, మంచు పర్వతాలు, యూనివర్స్ ను  అద్భుతంగా చూపిస్తున్న ఈ పోస్టర్ మంత్రముగ్ధులను చేస్తుంది.

ఈ సినిమాలో ఆధ్యాత్మిక అంశాలున్నాయని పోస్టర్ ద్వారా తెలుస్తోంది. పోస్టర్‌పై స్మరామి నారాయణన్ తత్వమవ్యయం అని రాయడం చాలా ఆసక్తికరంగా వుంది.  

లార్జర్ దెన్ లైఫ్ కథతో భారీ ఎత్తున రూపొందుతున్న ఈ సినిమా టైటిల్‌ ను ఈ నెల 9న ఉగాది సందర్భంగా అనౌన్స్ చేయనున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.

Latest News

అల్లరి నరేష్ హీరోగా నటిస్తోన్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి పాట విడుదల.. ‘అమ్మ కనకదుర్గ’ అంటూ సాగే భక్తి గీతాన్ని విజయవాడలో ఆవిష్కరించిన తమన్ అండ్ టీమ్

నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బిర్లా స్టూడియోస్, టెంపుల్ టౌన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి పాట ‘అమ్మ కనకదుర్గ’ను విజయవాడలో...

More News