హీరో ఆది సాయికుమార్ చేతుల మీదుగా ‘డియర్ కృష్ణ’ చిత్రం బిగ్ టికెట్ రిలీజ్

Must Read

పి.ఎన్.బి సినిమాస్ బ్యానర్ పై రూపొందిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ‘డియర్ కృష్ణ’ చిత్రం నుంచి తాజాగా బిగ్ టికెట్ రిలీజ్ అయింది. హీరో ఆది నటిస్తున్న శాంబల చిత్రం సెట్ కు ఈ రోజు డియర్ కృష్ణ మూవీ టీమ్ వెళ్లింది. ఆది సాయికుమార్ చేతుల మీదుగా బిగ్ టికెట్ ను విడుదల చేశారు. అక్షయ్ హీరోగా, ‘ప్రేమలు’ చిత్రంతో తెలుగు వారికి దగ్గరైన బ్యూటీ మమిత బైజు, మరో బ్యూటీ ఐశ్వర్య హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాలో దూసుకెళ్తుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రం జనవరి 24న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్దం అవడంతో మూవీ యూనిట్ హీరో ఆదితో బిగ్ టికెట్ ను రిలీజ్ చేశారు.

ఈ చిత్రాన్ని చూసే ప్రేక్షకులకు ఓ శుభవార్త కూడా అందించారు చిత్ర నిర్మాత పి.ఎన్. బలరామ్. మొదటి 100 టికెట్ల బుకింగ్ లో ఒక టికెట్ ను డిపింగ్ పద్దతి ద్వారా ఎంపిక చేసి ఆ టికెట్ దారుడికి రూ. 10000 క్యాష్ బ్యాక్ కింద, శ్రీ కృష్ణుడి బహుమతిగా అందించనున్నట్ల రచయిత నిర్మాత పి.ఎన్. బలరామ్ తెలిపారు. ఇదే పద్దతిని మొదటి వారం రోజుల పాటు కొనసాగించనున్నట్లు చెప్పారు. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. శ్రీ కృష్ణుడికి, కృష్ణ భక్తుడికి మధ్య జరిగిన ఒక మిరాకిల్ సంఘటనను ను ప్రేరణగా తీసుకొని ఈ చిత్రాన్ని రూపొందించారు. పీఎన్ బలరామ్ రచయిత, నిర్మాతగా, దినేష్ బాబు డైలాగ్స్, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అన్ని పనులు ముగించుకొని జనవరి 24న ఘనంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉంది.

సోషల్ మీడియాలో దూసుకెళ్తున్న డియర్ కృష్ణ ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలను రేకెత్తిస్తోంది. ఇలాంటి సినిమాలను కచ్చితంగా ఆదరించాలనే ఉద్దేశంతో ప్రేక్షకులు సైతం సినిమాకు మద్దతుగా నిలవడం సంతోషించాల్సిన విషయం. జనవరి 24న విడుదలయ్యే ఈ సినిమా కోసం సర్వత్రా ఆసక్తినెలకొంది.

చిత్రం: డియర్ కృష్ణ
నటీనటులు: అక్షయ్, మమిత బైజు, ఐశ్వర్య
రచయిత, నిర్మాత: పి.ఎన్. బలరామ్
డైలాగ్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్: దినేష్ బాబు
సినిమాటోగ్రఫీ: దినేష్ బాబు
ఎడిటర్: రాజీవ్ రామచంద్రన్
సంగీతం: హరి ప్రసాద్
లిరిక్స్: గిరిపట్ల
చీఫ్ అసోసియేట్ & అడిషనల్ డైలాగ్స్: నాగ నందేశ్వర్ గిడుతురి(నందు)
పీఆర్ఓ: హరీష్, దినేష్

Latest News

Dhanush Directorial ‘Jabilamma Neeku Antha Kopama’ Set to Release on Feb 21

After the success of blockbusters like Pa Pandi and Raayan, Dhanush is all set to impress again as a...

More News