టాలీవుడ్‌లో నూతన నిర్మాణ సంస్థ ‘శివమ్ మీడియా’ పేరుతో ప్రారంభం అయ్యింది. సీనియర్ జర్నలిస్ట్ శివమల్లాల ఈ బ్యానర్ నిర్మాత. గురువారం ఈ సినిమా శివమ్ మీడియా లోగో మరియు బ్యానర్‌ను ప్రముఖ నటులు అలీ నిర్మాత, దర్శకులు ప్రవీణా కడియాల , అనిల్ కడియాల చేతుల మీదుగా బ్యానర్‌ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ–‘‘ శివ నా తమ్ముడు లాంటివాడు. గత 20 ఏళ్లుగా వ్యక్తిగతంగా నాకు ఎంతో సన్నిహితుడు. చిన్న స్థాయి నుండి కెరీర్‌ను ప్రారంభించి ఈ రోజున నిర్మాతగా తన బ్యానర్‌ను స్థాపించి ముందుకు వెళ్లటం ఆనందంగా ఉంది’’ అన్నారు.
అనిల్ కడియాల మాట్లాడుతూ– శివమల్లాల తొలి రోజుల్నుంచి మాకు మంచి ఫ్రెండ్, మంచిమనిషి. అందుకే మా జర్నీలో శివ ఎప్పుడు ఉన్నాడు. ఈ రోజు ‘శివమ్ మీడియా’ అనే బ్యానర్ ద్వారా శివ అనేక సినిమాలు తీసి మంచి విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు.
జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాత ప్రవీణా కడియాల మాట్లాడుతూ– ‘‘ ఈరోజు నాకు ఎంతో ఆనందంగా ఉంది. మా ముందు చిన్న రిపోర్టర్‌గా పిఆర్వోగా పనిచేసిన మా శివాయేనా ఒక బ్యానర్‌ని పెట్టింది అనిపిస్తుంది. ‘శివమ్ మీడియా’ విషయంలో నేను ఎంతో ప్రౌడ్‌గా ఫీలవుతున్నాను. ఈ బ్యానర్‌ద్వారా డబ్బింగ్ సినిమానా, స్ట్రెయిట్ సినిమానా అనే తేడా లేకుండా అనేక మంచి సినిమాలు వస్తాయని రావాలని కోరుకుంటున్నా’’ అన్నారు.
శివమ్ మీడియా నిర్మాత శివమల్లాల మాట్లాడుతూ–‘‘ నాకు ఎప్పుడు సపోర్టు చేసే ముగ్గురు స్నేహితులు అలీ, అనిల్, ప్రవీణా. ఈ ముగ్గురు చేతుల మీదుగా నా బ్యానర్‌ని ప్రారంభించటం ఎంతో హ్యాపీ. నేను ఎంత కష్టపడతానో ఈ ముగ్గురికి బాగా తెలుసు. శివమ్ మీడియా బ్యానర్‌పై మంచి సినిమాలు చేస్తాను’’ అన్నారు.
నటీననటులు– సాంకేతిక నిపుణులు
హీరో– హమరేశ్, హీరోయిన్ – ప్రార్థన సందీప్, ఆడుగాలం మురుగదాస్, మాటలు– కె.యన్ విజయ్ పాటలు– రాంబాబు గోసాల, సంగీతం– సుందరమూర్తి కె.యస్ డిఓపి– బ్యానర్– శివమ్ మీడియా నిర్మాత– శివమల్లాల, కథ– దర్శకత్వం– వాలీ మోహన్‌దాస్ ,పీఆర్‌వో– మధు వి.ఆర్, మూర్తి మల్లాల
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…