‘అమీర్ లోగ్’ లాంటి చిత్రం ఇప్పటి వరకు రాలేదు.. ఇది కచ్చితంగా హిట్టు బొమ్మ.. ప్రెస్ మీట్‌లో దర్శకుడు రమణా రెడ్డి సోమ

‘అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన తొలి చిత్రం ‘అమీర్ లోగ్’. ఈ మూవీకి రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో MC హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించగా.. వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి కీలక పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటి సంస్థ ‘స్పిరిట్ మీడియా’ ఈ మూవీని తెలుగులో ఆగస్ట్ 21న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోంది. ఈ క్రమంలో బుధవారం ప్రెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..

దర్శకుడు రమణా రెడ్డి సోమ మాట్లాడుతూ .. ‘‘అమీర్ లోగ్’ సినిమాని ఇప్పటికి చాలా సార్లు చూశాం. కచ్చితంగా హిట్టు బొమ్మ. ఇప్పటి వరకు ఇలాంటి చిత్రం రాలేదు. అలాంటి ఓ గొప్ప అటెంప్ట్ నేను చేశాను. ప్రీమియర్లకు వచ్చిన రెస్పాన్స్ చూస్తే మేం హిట్ కొట్టేశాం, మేం అనుకున్నది సాధించేశాం అని అర్థమైంది. మలయాళంలో తీసినట్టుగా మన దగ్గర రావడం లేదు అని అంటుంటారు కదా.. ఇకపై హైదరబాద్ ఎరా స్టార్ట్ అయింది. ఆగస్ట్ 21న నైజాంలో స్టార్ట్ అయ్యే సౌండ్.. అన్ని వుడ్‌లకు చేరుకుంటుంది’ అని అన్నారు.

నిర్మాత మాధవి రెడ్డి సోమ మాట్లాడుతూ .. ‘‘నన్ను ముందు నిలబెట్టి నడిపిస్తున్న నా భర్త రమణ గారికి థాంక్స్. ఆయనే రైటర్, డైరెక్టర్‌, నిర్మాతగా అన్నీ పనులు చూసుకున్నారు. ఆయన ఈ ‘అమీర్ లోగ్’ సినిమాని అందమైన పెయింటింగ్‌గా తీర్చి దిద్దారు. ఈ సినిమా చూసి బయటకు వెళ్లేటప్పుడు ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక ఎమోషన్‌ను ఇంటికి తీసుకు వెళ్తారు’అని అన్నారు.

నటుడు MC హరి మాట్లాడుతూ .. ‘‘అమీర్ లోగ్’ సినిమా నాకు మంచి అవకాశాన్ని, కుటుంబాన్ని, అనుభవాన్ని ఇచ్చింది. రోహిత్ అన్న ఎడిటింగ్ అదిరిపోతుంది. స్మరణ్ అన్న అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చారు. మనోజ్, శశి, నేను కలిసి సెట్‌లో ఎంతో సరదాగా ఉండేవాళ్లం. సెట్‌లో రోజూ ఏదో ఒకటి కొత్తగా నేర్చుకునేవాళ్లం. ఈ జర్నీలో సపోర్ట్ చేసిన సందీప్ అన్న, ఎస్వీకే అన్నకి, మాధవి గారికి, రమణ అన్నకి థాంక్స్. ప్రీమియర్లు వేసిన ప్రతీ చోటా థియేటర్లు బ్లాస్ట్ అయ్యాయి. ఆగస్ట్ 21న కూడా మాకు అదే రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాం’ అని అన్నారు.

నటుడు మనోజ్ మాట్లాడుతూ .. ‘‘అమీర్ లోగ్’ లాంటి సినిమా కెరీర్ ఆరంభంలోనే రావడం ఆనందంగా ఉంది. ఈ మూవీతో మేం ఇంకో పదేళ్లు సర్వైవ్ అవుతాం. ప్రీమియర్లు వేసిన ప్రతీ చోటా అద్భుతమైన స్పందన వస్తోంది. స్మరణ్ మ్యూజిక్‌తో సినిమా నెక్ట్స్ లెవెల్‌కి వెళ్లింది. తెలంగాణను రిప్రజెంట్ చేసేలా మా చిత్రం ఉంటుంది’ అని అన్నారు.

నటి వేద జలంధర్ మాట్లాడుతూ .. ‘‘అమీర్ లోగ్’ మూవీకి వేస్తున్న ప్రీమియర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మా కరీంనగర్‌లో సినిమా చూసిన వారంతా నా గురించే అడిగారట (నవ్వుతూ). మా చిత్రంలో నిజాయితీ, అమాయకత్వం ఉంటుంది. ఆగస్ట్ 21న మా మూవీని చూడండి. మా సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. స్మరణ్ గారి సంగీతం, రోహిత్ గారి ఎడిటింగ్, ఇతర ఆర్టిస్టులు అందరం కలిసి సినిమా కోసం కష్టపడ్డాం. మాకు సపోర్ట్ చేసిన మాధవి గారు, రమణ రెడ్డి గార్లకు థాంక్స్. చిత్రాన్ని చూసిన తర్వాత ఫుల్ మీల్స్ తిన్నట్టుగా, కడుపు నిండినట్టుగా అనిపిస్తుంది’ అని అన్నారు.

ఎడిటర్ రోహిత్ మాట్లాడుతూ .. ‘రమణ గారితో నాకు ఏడేళ్ల నుంచి అనుబంధం ఉంది. ‘అమీర్ లోగ్’ సినిమాకి రమణ ఎంతో కష్టపడ్డాడు. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఆగస్ట్ 21న రాబోతోంది. సినిమా అద్భుతంగా వచ్చింది. అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు.

కో ప్రొడ్యూసర్ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ .. ‘యూస్‌ నుంచి రీసెంట్‌గానే వచ్చాను. అమెరికాలో కూడా ఈ మూవీ గురించి అడుగుతున్నారు. ఈ మూవీని రమణ అంతా తానై భుజానికి ఎత్తుకుని మోశాడు’ అని అన్నారు.

నటుడు యోగి మాట్లాడుతూ .. ‘హైదరబాద్ మీద రమణన్న తనకున్న ప్రేమను ఈ ‘అమీర్ లోగ్’ సినిమాతో చూపించబోతోన్నారు. ఏపీలో వేసిన ప్రీమియర్లకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కరీంనగర్, వరంగల్‌లో వేసిన ప్రీమియర్లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది’ అని అన్నారు.

తారాగణం : MC హరి, మనోజ్, శశిధర్ కొచ్చర్లకోట, వేద జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయియోగి తదితరులు

సాంకేతిక సిబ్బంది:

బ్యానర్: అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్
దర్శకుడు: రమణారెడ్డి సోమ
నిర్మాత: మాధవి రెడ్డి సోమ
సహ నిర్మాత: మనోహర్ రెడ్డి మంచురి
విడుదల: రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా
DOP: SVK
ఎడిటర్: రోహిత్ పెనుమత్స
సంగీతం: స్మరణ్ సాయి
పోస్టర్లు: శక్తి
సింక్ సౌండ్ & మిక్సింగ్: స్వప్నిక్ రావు
చీఫ్ AD: సాయి యోగి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సందీప్ బోరెడ్డి
లైన్ ప్రొడ్యూసర్: శరత్ పోలవరపు
PRO: సాయి సతీష్

TFJA

Recent Posts

కల్ట్ ప్రొడ్యూసర్ SKN గారి చేతుల మీదగా మిస్సింగ్ మేఘన మూవీ టీజర్ లాంచ్*

ఫస్ట్ కాపీ మూవీస్, కేడి & కో బ్యానర్ పై పంచుమర్తి నరేష్ బాబు ప్రొడ్యూసర్ గా, వాచస్పతి దర్శకత్వంలో…

24 minutes ago

విజయదశమి పర్వదినం సందర్భంగా అక్టోబర్ 17న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న సెన్సేషనల్ సై ఫై థ్రిల్లర్ మూవీ “కిల్లర్”

సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచుతున్న "కిల్లర్" రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ గ్లింప్స్ జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్…

58 minutes ago

ప్రకాష్ రాజ్, మధుబాల, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’.. సెప్టెంబర్ 4గా స్ట్రీమింగ్ కానున్నట్టు ప్రకటించిన అమెజాన్ ప్రైమ్ వీడియో

భారతదేశంలో ప్రత్యేకమైన ఒరిజినల్స్ అందించే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో తాజాగా తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్…

3 hours ago

అనుకున్న సమయానికి, తక్కువ బడ్జెట్‌లో సినిమా ప్రాజెక్ట్‌ పూర్తి కావాలా?.. ఆల్‌ ఇన్‌ వన్‌ సాఫ్ట్‌వేర్ ‘సినరీ’ ఉందిగా!

సినిమా, షార్ట్‌ ఫిల్మ్‌, వెబ్‌ సిరీస్‌ వంటి ప్రాజెక్టులను రూపొందించే ప్రతి నిర్మాత, దర్శకుడు, మూవీ ప్రొఫెషనల్‌కు ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌…

5 hours ago

‘ఇరుముడి’ కి చాలా నేషనల్ అవార్డ్స్ వస్తాయి. ట్రెండ్ సెట్టర్ మూవీ అవుతుంది. ‘విక్రమార్కుడు’ తర్వాత రవితేజ గారి సినిమాల్లో నా ఫేవరెట్ ఇరుముడి: సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఇరుముడి'. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో,…

21 hours ago

అభిమానం ముందు అనారోగ్యం కూడా ఓడిపోవాలి… శశి కోసం రామ్ పోతినేని చేసిన మానవీయ ప్రయత్నం

రెండేళ్ల క్రితం వరకు శషి కూడా అందరిలాగే చదువుకుంటూ, ఆడుతూ పాడుతూ, ఎంతో ఆనందంగా గడిపిన ఓ చిన్నారి. కానీ…

21 hours ago