వారణాసి క్రియేషన్స్ పతాకంపై చైతన్య రావు, అలెగ్జాండర్ సాల్నికొవ్, ప్రియా పాల్వాయి, కతాలీన్ గౌడ ముఖ్య తారాగణం తో మునికృష్ణ దర్శకత్వం లో కె.పి. లోకనాథ్, దొరడ్ల బాలాజీ మరియు శ్రీధర్ వారణాసి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ఏ జర్నీ టు కాశీ’ అమెజాన్ ప్రైమ్ రెంటల్ లో జూలై 20 నుంచి ప్రసారం అవుతుంది.
ఈ సందర్భంగా చిత్ర బృందం చిత్రానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపింది. 2024, జనవరి 6న థియేటర్లలో విడుదల అయ్యి జాతీయ అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవాలలో తొమ్మిది అవార్డులు పొంది మన్ననలు పొందింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం అవుతూ ప్రేక్షకులు, వెబ్ విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది.
ప్రముఖ రచయిత నాటక ప్రయోక్త సౌదా అరుణ ఈ చిత్రాన్ని సమీక్షిస్తూ “అనుకోని పరిస్థితుల్లో ఇద్దరు అపరిచితులు కాశిలో కలుసుకొని ఒకరినొకరు గుర్తు పడతారు. వొకరు వేశ్య! ఇంకొకరు సన్యాసుల లో కలిసిన ఆమె తండ్రి! ఇది ఒక వేశ్య ఆధ్యాత్మిక ప్రయాణం!! ఇది ఒక తండ్రి స్పిరిచువల్ ప్రోస్టిట్యూషన్!! .ఒకప్పుడు భారతదేశాన్ని చెర పట్టిన పాపం నుంచి ఈ తరంలో ప్రాయశ్చితం చేసుకోడానికి ఈ వేశ్య ఆశీర్వాదం కోసం ప్రయత్నించే వొక బ్రిటిష్ జాతి లవరబోయ్!! అతడి దృష్టిలో ఆమె మదర్ ఇండియా! ఈ సినిమాలో పాత్రలు ఇవీ! ” అని కథాంశాన్ని వివరించారు.
ది లాస్ట్ బ్రాహ్మిన్ రచయిత రాణి శివశంకర శర్మ చిత్రాన్ని చూసి దర్శకుడు మునికృష్ణ సత్యాన్ని దర్శనం చేసే శక్తి గల దర్శకుడు. మనం కూడా జర్నీ చేద్దాం నిజం కాశీకి” అని అన్నారు.
బ్యానర్ : వారణాసి క్రియేషన్స్
చిత్రం పేరు : ఏ జర్నీ టు కాశీ
నటి నటులు : చైతన్య రావు, అలెగ్జాండర్ సాల్నికోవ్, కతాలీన్ గౌడ, ప్రియా పాల్వాయి, అక్షర తదితరులు.
కెమెరామెన్ : గోకుల్ భారతి మరియు శ్రీ సాయి
ఆర్ట్ డైరెక్టర్: నాగేంద్ర గువ్వల
సంగీతం: ఫణి కళ్యాణ్
కొరియోగ్రఫీ : అజయ్ శివశంకర
ఫైట్స్ : శంకర్
ఎడిటర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : తిరుపతి రెడ్డి
సౌండ్ డిజైన్ : సైందబ్ ముఖర్జీ
సౌండ్ మిక్సింగ్ : సైమాల్ శిక్దర్
డైలాగ్ :పల్ల మోహన్
ప్రొడక్షన్ మేనేజర్ : కె. ఆనంద్ మోహన్
పి ఆర్ ఓ : పాల్ పవన్
డిజిటల్ పార్టనర్ : ఏ ఏ ఏ సినిమాస్
ప్రొడ్యూసర్ : కె. పి లోకనాథ్, దొరాడ్ల బాలాజీ, వారణాసి శ్రీధర్
రచన , దర్శకత్వం: మునికృష్ణ
వైవిధ్యమైన కథలతో ఆకట్టుకునే కథానాయకుడు త్రిగుణ్ (అదిత్ అరుణ్) హీరోగా, హెబ్బాపటేల్, ఇషాచావ్లా, వర్షిణి హీరోయిన్స్‌గా స్వాతి సినిమాస్ పతాకంపై…
Actor Trigun (Adit Arun), known for captivating audiences with diverse storylines, stars as the hero…
నివాస్, అమిత శ్రీ జంటగా నటిస్తున్న సినిమా "తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా". ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రల్లో 30…
The comedy entertainer film Teliyadu, Gurtuledu, Marchipoya, starring Nivas and Amita Sri as the lead…
"Ukku Satyagraham" is the last film starring Praja YuddhaNauka and revolutionary poet Gaddar in the…
విశాఖ ఉక్కు తెలుగు వారి హక్కు నినాదం తో దర్శక, నిర్మాత, హీరో, జనం స్టార్ సత్యారెడ్డి నిర్మాణం లో…