ఘ‌నంగా శ‌తాధిక ద‌ర్శ‌కుడు కోడి రామ‌కృష్ణ 75వ జ‌యంతి వేడుక‌లు

Must Read

టాలీవుడ్ చ‌రిత్ర‌లో గొప్ప గొప్ప చిత్రాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కులు అరుదు. అలాంటి అరుదైన ద‌ర్శ‌కుల్లో కోడి రామ‌కృష్ణ ఒక‌రు. తెలుగు చిత్ర సీమ గురువుగారు అంటూ పిలుచుకునే ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు శిష్యుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టారు కోడి రామ‌కృష్ణ‌. విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను రూపొందిస్తూ ఒక్కో సినిమాకు ఒక్కో మెట్టుకు ఎక్కుతూ శ‌తాధిక ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకుని గురువుకి త‌గ్గ శిష్యుడిగా పేరు సంపాదించుకున్నారు.

ప్ర‌తాప్ ఆర్ట్ ప్రొడ‌క్ష‌న్స్ అధినేత కె.రాఘ‌వ నిర్మాత‌గా రూపొందించిన తొలి చిత్రం ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ చిత్రంతో కోడి రామ‌కృష్ణ ద‌ర్శ‌కుడిగా త‌న ప్ర‌యాణం ప్రారంభించారు. మెగాస్టార్ చిరంజీవి తొలి నాళ్ల‌లో హీరోగా న‌టించిన ఆ చిత్రం అప్ప‌ట్లో 560 రోజులకు పైగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. అక్క‌డి నుంచి ఆయ‌న వెనుదిరిగి చూసుకోలేదు. ఫ్యామిలీ డ్రామాలు, యాక్ష‌న్ చిత్రాలు, పొలిటిక‌ల్ సెటైర్స్‌, ఫిక్ష‌న్‌, ఫాంట‌సీ, థ్రిల్ల‌ర్ ఇలా జోన‌ర్ ఏదైనా స‌రే! ఆయన బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు తీసి ప్రేక్ష‌కుల హృద‌యాల్లో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్నారు. చిన్న సినిమాలు తీసి భారీ విజ‌యాల‌ను ద‌క్కించుకున్నారు. స్టార్ హీరోల‌తో బాక్సాఫీస్ రికార్డుల‌ను షేక్ చేయించారు. టాలీవుడ్‌లో మ‌రే ద‌ర్శ‌కుడికీ లేన‌న్ని సిల్వ‌ర్‌, గోల్డెన్ జూబ్లీ మూవీస్ చేసిన ఘ‌న‌త ఆయ‌న‌కే సొంతం.

ఎ.ఎన్‌.ఆర్‌, కృష్ణ‌, కృష్ణంరాజు, చిరంజీవి, బాల‌కృష్ణ‌, వెంక‌టేష్, నాగార్జున‌, రాజశేఖ‌ర్ వంటి హీరోల‌తో బ్లాక్ బ‌స్ట‌ర్స్‌ను తెర‌కెక్కించట‌మే కాకుండా ద‌ర్శ‌కుడిగా త‌న‌దైన ముద్ర‌ను వేయ‌టం కోడి రామ‌కృష్ణ‌కే చెల్లింది. హీరోయిజాన్నే కాదు, అకుంశం వంటి చిత్రంలో రామిరెడ్డి, భార‌త్ బంద్ చిత్రంలో కాస్ట్యూమ్ కృష్ణ వంటి న‌టీన‌టుల‌తో స‌రికొత్త విల‌నిజాన్ని తెలుగు సినీ తెర‌కు ప‌రిచ‌యం చేసిన ఘ‌న‌త ఈయన‌కే ద‌క్కుతుంది. ఇప్పుడు వి.ఎఫ్‌.ఎక్స్ సినిమాలు చేయ‌టం సాధార‌ణంగా మారాయి. కానీ అవేంటో తెలియ‌ని స‌మ‌యంలోనూ దేవి, దేవీపుత్రుడు, అంజి, అమ్మోరు, అరుంధ‌తి వంటి సినిమాల‌తో ఔరా! అని ఆశ్చ‌ర్య‌పోయేలా గ్రాఫిక్స్‌ను క్రియేట్ చేశారు.

నిర్మాత‌ల మంచి కోరే ద‌ర్శ‌కుల్లో ముందుంటారాయ‌న‌. తోటి నటీన‌టుల‌కు, సాంకేతిక నిపుణుల‌కు అండ‌గా నిలవ‌టంలో కోడిరామ‌కృష్ణ తర్వాతే ఎవ‌రైనా అనే పేరుని సంపాదించుకున్నారు. ద‌ర్శ‌కుడిగానే కాదు, న‌టుడిగానూ కొన్ని చిత్రాల్లో కీల‌క పాత్ర‌ల్లో న‌టించి ప్రేక్ష‌కుల మెప్పుని పొందారు. దాదాపు 120 చిత్రాల‌కు పైగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించి, ఈ సుదీర్ఘ ప్ర‌యాణంలో ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెర‌గ‌ని స్థానాన్ని సంపాదించుకున్న శ‌తాధిక ద‌ర్శ‌కుడు కోడి రామ‌కృష్ణ జ‌యంతి జూలై 23. ఈ సంద‌ర్భంగా ఆయన‌కు ముర‌ళీ మోహ‌న్‌, బాబూ మోహ‌న్‌, శివాజీ రాజా, పృథ్వీ, హీరో శ్రీకాంత్, జొన్న‌విత్తుల‌, రేలంగి న‌ర‌సింహారావు, దేవీ ప్ర‌సాద్‌, డైరెక్ట‌ర్ రాంబాబు స‌హా ప‌లువురు సినీ ప్ర‌ముఖులు నివాళులు అర్పించి కోడి రామ‌కృష్ణ‌తో త‌మ‌కున్న అనుబంధాన్ని గుర్తుకు చేసుకున్నారు.

ఇప్పుడు తండ్రికి త‌గ్గ త‌న‌య‌గా కోడి రామ‌కృష్ణ కూతుళ్లు కోడి దివ్య దీప్తి, కోడి ప్రవళిక నిర్మాతలుగా ప్రయాణాన్ని ప్రారంభించారు. తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ విజయాన్ని సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిద్దరూ మరిన్ని ప్రాజెక్టులు చేసేందుకు సంకల్పించారు.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News